Login or Register కోసం ఉత్తమ CarDekho experience
Login

గోల్ఫ్ GTE స్పోర్ట్ హైబ్రిడ్ కాన్సెప్ట్ ని బహిర్గతం చేసిన వోక్స్వ్యాగన్

నవంబర్ 19, 2015 02:59 pm nabeel ద్వారా ప్రచురించబడింది

జైపూర్:

Volkswagen Golf GTE Sport Hybrid Concept

వోక్స్వ్యాగన్ దాని గోల్ఫ్ GTE స్పోర్ట్ హైబ్రిడ్ కాన్సెప్ట్ ని లాస్ ఏంజిల్స్ ఇంటర్నేషనల్ ఆటో షోలో పరిచయం చేయకముందు అధికారికంగా బహిర్గతం చేసింది. ఈ కాన్సెప్ట్ కారు గోల్ఫ్ హాచ్బాక్ యొక్క భవిష్యత్తు తరాల రూపాన్ని నిర్వచిస్తుంది మరియు స్పోర్ట్ వాహన శ్రేణికి సాధారణ రోడ్లకు మధ్య ఉన్న దూరాన్ని తగ్గించే విధంగా ఉండబోతుంది. ఒక 395-హార్స్పవర్ ప్లగ్-ఇన్ హైబ్రిడ్ వ్యవస్థ ద్వారా ఆధారితం చేయబడి 50 km / L మైలేజ్ మేనేజ్ చేస్తూ 280 km / h పైగా చేరే సామర్థ్యం కలిగి ఉంటుంది. ఈ ఆల్ వీల్ డ్రైవ్ హైబ్రిడ్ తేలికగా ఉండే కార్బన్ ఫైబర్ నిర్మాణంతో ఉన్న వరల్డ్ ర్యాలీ ఛాంపియన్షిప్ టర్బోచార్జ్డ్ ఇంజన్లతో పాటు రెండు విద్యుత్ మోటార్లను పొంది ఉంది.

Volkswagen Golf GTE Sport Hybrid Concept

ఇంజిన్ :

ఈ కాన్సెప్ట్ 1.6 లీటర్ TSI ఇంజిన్ ని కలిగియుండి 400Nm టార్క్ తో పాటూ 295ps శక్తిని అందిస్తుంది. ఇంధన ఆధారిత పవర్హౌస్ సహాయంతో కారు ముందు మరియు వెనుక రెండు విద్యుత్ మోటార్లు ఉన్నాయి. ఈ మోటార్ 113ps శక్తిని మరియు 670Nm టార్క్ ని అందిస్తుంది. ఈ కారు "GTE మోడ్" లో నడుస్తుంది. మూడు కలిసి పనిచేసి 4.3 సెకన్లలో 0-100km/h చేరుకుంటుంది మరియు గరిష్టంగా 280km/h వేగం వెళ్ళగల సామర్ధ్యాన్ని చేరుకోగలదు.

Volkswagen Golf GTE Sport Hybrid Concept

బాహ్య స్వరూపాలు:

గోల్ఫ్ GTE స్పోర్ట్ యొక్క డిజైన్ భవిష్యత్తులో గోల్ఫ్ GTE మోడల్స్ ఎలా ఉంటాయో వివరిస్తుంది. ఈ కారు ఏకైక రెండు స్థాయిల సి-పిల్లర్ ఆకృతిని కలిగి ఉంటుంది. ఇది చూడడానికి అకర్షణీయంగా ఉండడం మాత్రమే కాకుండా ఏరోడైనమిక్ డౌన్ఫోర్స్ కి దోహదం చేస్తుంది మరియు వెనుక బ్రేకుల శీతలీకరణకు తోడ్పడుతుంది. గోల్ఫ్ GTE స్పోర్ట్ యొక్క బాడీ ఎక్కువగా తేలికైన కార్బన్ ఫైబర్ తో తయారుచేయబడి ఉంటుంది. అలానే కారు ముందర 235/35 టైర్లతో మరియు వెనుక 275/30 టైర్లతో అమర్చబడియున్న 20-అంగుళాల అల్యూమినియం-అల్లాయ్ వీల్స్ తో నడపబడుతుంది.

Volkswagen Golf GTE Sport Hybrid Concept

బాడీ / వీల్స్
కాన్సెప్ 2-డోర్, 2-సీటర్ కూపే
పొడవు x వెడల్పు x ఎత్తు 162.5 x 73.6 x 48.6ఇంచులు
వీల్బేస్ 98.6ఇంచులు
టైర్లు ముందు /వెనుక 235/35 R20 / 275/30 R20
డ్రైవ్
డ్రైవ్ సిస్టమ్ ప్లగ్ ఇన్- హైబ్రిడ్
డ్రైవ్ ట్రైన్ ఆల్-వీల్ డ్రైవ్ ("విద్యుత్ ప్రోప్‌షాఫ్ట్ ")
పెట్రోల్ ఇంజన్ 1.6 TSI, 295 hp / 400 Nm
ఎలక్ట్రిక్ మోటార్స్ 113 hp
సిస్టం పవర్ 395 hp
సిస్టం టార్క్ 670 Nm
గేర్బాక్స్ 6-స్పీడ్ DSG
బ్యాటరీ టైప్ లిథియం-అయాన్
నిర్వహణ / ఇంధన సామర్ధ్యం
గరిష్ఠ వేగం 280 km/h
0-100 km/h 4.3 s
ఇంధన వినియోగం 50 km/l
ఎలక్ట్రిక్ పరిధి 50 km

Share via

Enable notifications to stay updated with exclusive offers, car news, and more from CarDekho!

ట్రెండింగ్‌లో ఉంది కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
కొత్త వేరియంట్
Rs.30.40 - 37.90 లక్షలు*
కొత్త వేరియంట్
Rs.2.84 - 3.12 సి ఆర్*
కొత్త వేరియంట్
ఫేస్లిఫ్ట్
Rs.1.03 సి ఆర్*
కొత్త వేరియంట్
Rs.11.11 - 20.50 లక్షలు*
*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర