ఢిల్లీలో కొత్త డీలర్షిప్ ని ప్రారంభించిన వోక్స్వాగన్
జూన్ 24, 2015 12:37 pm akshit ద్వారా ప్రచురించబడింది
- 17 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
ఢిల్లీ: వోక్స్వ్యాగన్ ఇండియా, న్యూఢిల్లీలో ఒక కొత్త డీలర్షిప్ ను ప్రారంభించింది. దీనిని వోక్స్వ్యాగన్ రాజధానిగా పిలుస్తారు. ఈ జర్మన్ కార్ల షోరూం, ఢిల్లీ ఎన్సీఆర్ లో 9 స్థానం లో మరియు భారతదేశంలో 118 వ స్థానం లో ఉంది.
ఈ షోరూం, మోహన్ కో-ఆపరేటివ్ ఇండస్ట్రియల్ ఎస్టేట్ దగ్గర, మెయిన్ మథుర రోడ్ వద్ద కలదు. ఈ వోక్స్వ్యాగన్ కాపిటల్, ల్యాండ్మార్క్ గ్రూప్ భాగంగా ఉంది. దేశంలోనే అతిపెద్ద ఆటోమోటివ్ డీలర్షిప్. దీనితో పాటు అమ్మకాల తరువాత సౌకర్యాలను కూడా కలిగి ఉంది. ఈ సౌకర్యాలు దేశంలో ముంబై, ఢిల్లీ, గుజరాత్, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్ లో కలవు.
"ఇది కార్ల కోసం ఒక పెద్ద డిస్ప్లే ఏరియా లాంటిది, వోక్స్వాగన్ యొక్క గ్లోబల్ బ్రాండ్ ప్రమాణాలను ప్రాతినిధ్యం వహిస్తుంది, మరియు సుశిక్షితులైన మరియు సమర్థవంతమైన అమ్మకాలు మరియు అమ్మకాలు తర్వాత కోసం సిబ్బంది, వోక్స్వ్యాగన్ కాపిటల్ వినియోగదారులకు ఒక ప్రపంచ స్థాయి అనుభవాన్ని అందించడానికే ఈ షోరూం ను ప్రారంబించాము అని" వోక్స్వ్యాగన్ పేర్కొంది.
ఈ డీలర్షిప్, 25 బేవర్క్ షాప్ లను కలిగి ఉంది. దీనిలో సాధారణ మరమ్మత్తు మరియు నిర్వహణ, అలాగే కార్ బాడీ పెయింట్ మరమ్మత్తు పని వంటివి జరుగుతాయి.
ప్రారంభ సందర్భంగా వోక్స్ వ్యాగన్ ప్యాసింజర్ కార్స్ ఇండియా డైరెక్టర్ మైఖేల్ మేయర్ మాట్లాడుతూ " ఇది ఈ ప్రాంతంలో మా 9 వ డీలర్ షిప్ అన్నారు. కొత్తగా ప్రారంభించిన ఈ వోక్స్ వ్యాగన్ కార్లు రాజధాని ఢిల్లీ & ఎన్ సి ఆర్ లలో విజయవంతంగా విక్రయించబడుతున్నాయి. ఇక్కడ వోక్స్ వ్యాగన్ ప్యాసింజర్ కార్లు స్థిరంగా, ప్రోత్సాహకరంగా అధిక డిమాండ్ ను కలిగి ఉన్నాయి". అని ఆయన వాఖ్యానించారు.
మేము ఆటో మార్క్ మోటార్స్ ప్రెవేట్ లిమిటెడ్ తో చాలా కాలంగా అనుబంధం కలిగి ఉన్నాము. మరియు వారు లోపం లేని బ్రాండ్ అనుభవం తో మా గౌరవప్రదమైన వినియోగదారులకు వారు అందించే సేవల పట్ల మేము నమ్మకాన్ని కలిగి ఉన్నాము. ఇది వోక్స్ వ్యాగన్ యొక్క ప్రపంచవ్యాప్త ప్రమాణాలను గొప్పగా అందిస్తుంది అని ఆయన జోడించారు.