• English
  • Login / Register

ఈకోస్పోర్ట్ మరియు టియువి 300 వాహనాలను మొదటి రోజు నుండి అదిగమిస్తున్న విటారా బ్రెజ్జా

మారుతి విటారా బ్రెజా 2016-2020 కోసం raunak ద్వారా జనవరి 25, 2016 01:33 pm ప్రచురించబడింది

  • 17 Views
  • 1 వ్యాఖ్యలు
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

Vitara Brezza

విటారా బ్రెజ్జా, వివిధ మారుతి టీజర్ లను రాబట్టుకుంటుంది మరియు ఇది ఒక మంచి ఉత్పత్తి గా కనిపిస్తుంది. డిసెంబర్ మధ్యలో వైబిఏ వాహనం గురించి ఒక కథనాన్ని చేశాడు మరియు ఇది, బాలెనో  వలే ఈ విభాగంలో అదిగమిస్తుంది. ఈ వాహనానికి నామకరణం చేయకముందు, వైబిఏ అను అంతర్గత కోడ్ నామం, మారుతి నుండి రాబోయే కాంపాక్ట్ ఎస్యువి అయిన విటారా బ్రెజ్జా యొక్క నామం గా ఉండేది. ఇప్పుడు ఇది, చాలా స్పష్టంగా ఉంది. ఈ వాహనం యొక్క టీజర్లను చూస్తున్నట్లైతే, ఫోర్డ్ ఈకోస్పోర్ట్ మరియు మహింద్రా టియువి 300 వంటి వాహనాలకు గట్టి పోటీను ఇస్తుంది. అది ఎందుకో చూద్దాం?  

Vitara Brezza    

ముందుగా ఈ వాహనం యొక్క బాహ్య భాగం నుండి ప్రారంభిస్తే, దృశ్య పరంగా ఈ వాహనం నియంత్రణ లేని విజయాన్ని సాదించింది మరియు ఇది, ఫోర్డ్ ఈకోస్పోర్ట్ వాహనానికి ఒక పెద్ద ఉదాహరణ అని చెప్పవచ్చు. ఈ సంస్థ, ఈ విభాగంలో ఇప్పటి వరకు ఎప్పుడూ అందించ లేని అనేక దృశ్య ఆనందదాయకమైన లక్షణాలను ఈ విటారా బ్రెజ్జా వాహనానికి అందిస్తోంది. భారతదేశంలో ఇప్పటికీ అందుబాటులో లేదు కానీ, సుజుకి సంస్థ యూకె లో ఉండే స్విఫ్ట్ మరియు విటారా వాహనాలలో కాంట్రాస్టింగ్ రూఫ్ ను అందిస్తుంది మరియు ఇది చూడటానికి మరింత అద్భుతంగా ఉంది. ఇవే కాకుండా, ఈ విభాగంలో ఉండే కాంపాక్ట్ ఎస్యువి అయిన విటారా బ్రెజ్జా, మొదటి ప్రొజక్టార్ హెడ్ ల్యాంప్స్ (బాలెనో వాహనం లో ఉండే బై జినాన్) తో పాటు డే టైం రన్నింగ్ లైట్ల తో వస్తుంది. ఈ వాహనానికి, ఆడంభరమైన 16 అంగుళాల 5- ట్విన్ స్పోక్ అల్లాయ్ వీల్స్ ను అందించడం జరిగింది. టైల్ ల్యాంప్స్ గురించి మాట్లాడటానికి వస్తే, ఎల్ ఈ డి లను అందించే అవకాశం ఉంది అని భావిస్తున్నారు.   

Vitara Brezza

ఈ వాహనం యొక్క అంతర్గత భాగం గురించి మాట్లాడటానికి వస్తే, ఈ వాహనం ఈ విభాగంలో మొదటి టచ్ స్క్రీన్ తో పాటు సుజుకి యొక్క 7-అంగుళాల స్మార్ట్ ప్లే సమాచార వ్యవస్థ తో గతంలో గూడచర్యం చెయ్యబడింది. యాంత్రికంగా చెప్పాలంటే, ఈ వాహనానికి సియాజ్ / ఎర్టిగా వాహనాలలో ఉండే మొదటి డీజిల్ హైబ్రిడ్ పవర్ ట్రైన్ ను అందించడం జరిగింది మరియు ఈ ఇంజన్ ఈ విభాగంలో, ఉత్తమ ఇంధన సామర్ధ్యాన్ని అందిస్తుంది. భద్రత పరంగా చెప్పాలంటే, ఈ వాహనం ఈ విభాగంలో మొదటి ప్రామాణిక డ్యూయల్ ముందు ఎయిర్ బాగ్ లతో పాటు ఏబిఎస్ మరియు ఈబిడి లతో వస్తుంది. ధర గురించి చెప్పాలంటే, మారుతి వారు ఈ వాహనానికి, బాలెనో వంటి వాహనానికి పోటీ గా ధర ను అందించే అవకాశం ఉంది అని భావిస్తున్నారు. కాబట్టి ఈ వాహనం, నిజంగా ఇక్కడ ఒక విజేత గా ఉంది! మరిన్ని వివరాల కోసం వేచి ఉండండి.

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your Comment on Maruti Vitara బ్రెజ్జా 2016-2020

Read Full News

ట్రెండింగ్‌లో ఉంది ఎస్యూవి కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience