• English
  • Login / Register

మారుతి సుజుకి యొక్క కొత్త కాంపాక్ట్ ఎస్యువి యొక్క అధికారిక నామం విటారా బ్రెజ్జా

జనవరి 11, 2016 04:42 pm manish ద్వారా ప్రచురించబడింది

  • 24 Views
  • 15 వ్యాఖ్యలు
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

Maruti Suzuki Vitara Brezza

మారుతి సుజుకి అధికారికంగా ఫిబ్రవరి 5 వ తేది నుండి 9 నోయిడా లో జరుగనున్న 2016 భారత ఆటో ఎక్స్పోలో దాని రాబోయే కాంపాక్ట్ ఎస్యువి ను ఆవిష్కరించనున్నట్లు ప్రకటించింది. భారతదేశం యొక్క అతిపెద్ద వాహన తయారీదారుడు కూడా ఈ కారు ను 'విటారా బ్రెజ్జా' అను పేరుతో (గ్రాండ్ విటారా కు పోలిక కాదు) ఆవిష్కరించనున్నట్లు తెలిపారు. అంతేకాకుండా మారుతి కూడా కాంపాక్ట్ ఎస్యువి అయిన విటారా బ్రెజ్జా యొక్క టీజర్ చిత్రాన్ని విడుదల చేయబోతుంది అని ప్రకటించింది మరియు ఈ విటారా బ్రెజ్జా ను, 2016 ఆటో ఎక్స్పో అనంతరం రెండు వారాల తరువాతి కాలంలో ప్రారంబించన్నున్నట్లు ప్రకటించారు.

ఈ వాహనం కలిగి ఉన్న కళా సౌందర్యకరమైన అంశాలు ఏమిటంటే, స్లోపింగ్ రూఫ్ లైన్, అప్రైట్ హుడ్, రైసింగ్ బెల్ట్ లైన్, గుండ్రని దీర్ఘచతురస్రాకార వీల్ ఆర్చులు, అధిక గ్రౌండ్ క్లియరెన్స్, బై జినాన్ ప్రొజక్టార్ మరియు కోణీయ ఆకృతిని కలిగిన టైల్ ల్యాంప్లు వంటి అంశాలను కలిగి ఉంది. ముందుగా విడుదల అయిన మారుతి ఎస్ క్రాస్ వాహనంలో ఉండే అదే క్రోం ఫినిషింగ్ ను కలిగిన గ్రిల్, విటారా బ్రెజ్జ వాహనంలో అందించబడుతుంది.

Maruti Suzuki Vitara Brezza (interiors)

చిత్ర మూలం: ఇండియన్ ఆటో బ్లాగ్

ఈ వాహనం యొక్క రూపకల్పన గురించి మాట్లాడటానికి వస్తే, మారుతి సుజుకి సంస్థ మాట్లాడుతూ, "చదరపు వీల్ ఆర్చులతో సమతుల్య నిష్పత్తిలో మద్దతు ఇస్తుంది అన్నాడు, షాట్ ఓవర్ హేంగ్స్, అధిక గ్రౌండ్ క్లియరెన్స్, అప్రైట్ హుద్స్ వంటి అంశాలు వాహనానికి ఆత్మవిశ్వాస వైఖరిని అందిస్తాయి అని వ్యాఖ్యానించారు. బెల్ట్ మరియు రోకర్ లైన్లు అలాగే రూఫ్ లైన్ స్లోప్లు వంటివి వాహనం యొక్క వెనుక భాగానికి డైనమిక్ లుక్ ను అందిస్తాయి.

వీటన్నింటితో పాటు మారుతి సుజుకి సంస్థ వారు మరిన్ని అంశాలను జోడించారు అవి ఏమిటంటే, ఈ వాహనం యొక్క ఉపరితలం చాలా సహజంగా ఉంటుంది అన్నారు అంతేకాకుండా, మరింత అందంగా శిల్పాలతో చెక్కబడి ఉంటుంది. ర్యాప్ రౌండ్ గ్రీన్ హౌస్ పైన ఉండే ఫ్లోటింగ్ రూఫ్ త్వరగా గురించే విధంగా ఉంటుంది మరియు ఇది, దృశ్య డ్రామాను మరింత పెంచుతుంది అలాగే ఈ అన్ని అంశాలు, ఈ విటారా బ్రెజ్జా వాహనాన్ని ప్రత్యేకంగా కనపడేలా చేస్తాయి.

ఈ వాహనం యొక్క లోపలి భాగం గురించి చెప్పాలంటే, ముందుగా ఆన్లైన్ లో విడుదల అయిన గూడచర్య చిత్రాలను గమనించవచ్చు. ఆ అంశాలు వరుసగా, మారుతి యొక్క 7 అంగుళాల స్మార్ట్ ప్లే సమాచార వ్యవస్థ మరియు ఆపిల్ కార్ప్లే వంటి అంశాలు అందించబడతాయి. ఈ కాంపాక్ట్ ఎస్యివి వాహనంలో, బాలెనో / స్విఫ్ట్ / సియాజ్ వాహనాలలో ఉండే స్టీరింగ్ వీల్ అందించబడుతుంది మరియు సంస్థ యొక్క మారుతి సుజుకి ఎస్ క్రాస్ వాహనంలో ఉండే స్టీరింగ్ వీల్ తో పాటు క్రూజ్ నియంత్రణ అందించబడుతుంది.

హుడ్ క్రింది భాగం విషయానికి వస్తే, ఈ విటారా బ్రెజ్జా వాహనంలో మారుతి లో ఇప్పటికే ఉండే 1.2 లీటర్ మరియు 1.4 లీటర్ పెట్రోల్ పవర్ ప్లాంట్స్ తో పాటు ఫియాట్ నుండి తీసుకోబడిన 1.3 లీటర్ డిడి ఐ ఎస్ డీజిల్ ఇంజన్ ఈ కాంపాక్ట్ ఎస్యువి వాహనంలో అందించబడతాయి. విటారా బ్రెజ్జా వాహనం, మారుతి ప్రీమియం నెక్సా డీలర్ షిప్ల ద్వారా అమ్ముడవుతాయి మరియు పోటీతత్వం విషయానికి వస్తే, ఈ వాహనం ఫోర్డ్ ఈకోస్పోర్ట్ మరియు మహీంద్రా టియువి300 వంటి వాహనాలతో పోటీ పడుతుంది. అంతేకాకుండా దీని యొక్క ధర, పోటీ పడే వాహనాలకు పోటీగా ఉంటుంది.

ఇది కూడా చదవండి:

బాలెనో లాగానే మారుతి సుజుకి వై బీ ఏ కూడా తన సెగ్మెంట్ ని అధిగమిస్తుందా

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your Comment on Marut i XA Alpha

Read Full News

ట్రెండింగ్‌లో ఉంది కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience