ఫిగో అస్పైర్ లా ఎక్కువ పవర్ ను ఇచ్చే 1.5 లీటర్ టిడిసి ఐ తో రాబోతున్న అప్డేటెడ్ ఈకోస్పోర్ట్
ఫోర్డ్ ఎకోస్పోర్ట్ 2015-2021 కోసం raunak ద్వారా జూలై 15, 2015 03:08 pm ప్రచురించబడింది
- 13 Views
- 2 వ్యాఖ్యలు
- ఒక వ్యాఖ్యను వ్రాయ ండి
జైపూర్: ఫోర్డ్ సంస్థ, యూరప్ లో ఇప్పటికే నవీకరించబడిన ఈకోస్పోర్ట్ ను ప్రదర్శించారు మరియు ఇది ఇటీవల అక్కడ అమ్మకానికి వెళ్ళింది. కంపెనీ కూడా రాబోయే నెలల్లో భారతదేశం లో ఈ నవీకరించబడిన ఈకోస్పోర్ట్ ను ప్రారంభించనున్నట్లు తెలిపారు మరియు ఇది, అంతర్గత మరియు యాంత్రిక నవీకరణల తో పాటు నవీకరించబడిన 1.5 లీటర్ టిడిసి ఐ డీజిల్ ఇంజన్ తో రాబోతుంది. అయితే, యూరప్ లో ఈ ఈకోస్పోర్ట్ వెనుక భాగం లో ఉన్న విడి చక్రాన్ని తొలగించే విధంగా ఆప్షనల్ గా అమర్చారు. అదే భారతదేశం విషయానికి వస్తే, ఈ ఈకోస్పోర్ట్ వెనుక భాగంలో ఒక స్పేర్ వీల్ తో రాబోతుంది.
ఈ 1.5 లీటర్ టిడిసి ఐ డీజిల్ ఇంజన్, కొత్త అస్పైర్ లా, పాత దాని కంటే ఈ నవీకరించబడిన ఈ కోస్పోర్ట్, 10 PS ఎక్కువ పవర్ ను విడిదల చేస్తుంది. అంటే, 3750 rpm వద్ద 100 PS పవర్ ను ఉత్పత్తి చేస్తుంది. అదే విధంగా, 1750 నుండి 3000 rpm మద్య 215 Nm గల పీక్ టార్క్ ను విడుదల చేస్తుంది. ముందు వలనే ఈ ఇంజన్ కూడా, దీని యొక్క టార్క్ ను, 5- స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ ద్వారా ముందు వీల్స్ కు పంపిణీ చేస్తుంది. అంతేకాకుండా, ఈ ఇంజన్ ను నవీకరించడం వలన అస్పైర్ కు దగ్గరగా, 25.83 kmpl మైలేజ్ ను అందిస్తుంది.
ఇతర నవీకరణల గురించి మాట్లాడటానికి వస్తే, యూరో స్పెక్ లో చేసిన మార్పులు, భారతదేశంలో కి రాబోయే ఈకోస్పోర్ట్ లో కూడా వస్తాయని భావిస్తున్నారు. ఐరోపాలో దీనిని కొత్త స్టీరింగ్ వీల్ పై (వెండి బదులుగా) పియానో నలుపు చేరికలు మరియు క్రోమ్ డిటైలింగ్ తో అందిస్తుంది. అంతేకాకుండా, సింక్స్ ప్రదర్శన కూడా నవీకరించబడింది మరియు 4- అంగుళాల కలర్ డిస్ప్లే తో రాబోతుంది. మరింత కొత్త మరియు మందంగా ధ్వని మొద్దుబారిన వస్తువులతో తయారుచేయడం వలన ఎన్ వి హెచ్ స్థాయిలను తగ్గించవచ్చు.
ఇది సవరించిన స్ప్రింగ్స్, డంపర్లను, రేర్ టోరిసన్ బీమ్ తో పాటు నవీకరించబడిన ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ మరియు ఎలక్ట్రానిక్ పవర్ అసిస్టెడ్ స్టీరింగ్ సెట్టింగులతో రాబోతుంది. ఈ నవీకరించిన ఈకోస్పోర్ట్ లో డ్రైవింగ్ డైనమిక్స్ లో 'పురోభివృద్దిని' కలిగి ఉంటుందని ఫోర్డ్ వాగ్ధానం ఇచ్చింది.