రాబోయే ఏర్టిగా Dreza బహిర్గతం అయ్యింది.
మారుతి ఎర్టిగా 2015-2022 కోసం konark ద్వారా డిసెంబర్ 24, 2015 09:49 am ప్రచురించబడింది
- 19 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
ఇండోనేషియన్ మార్కెట్ లో, జపనీస్ సుజుకి కార్ల తయారీదారుడు ఏర్టిగా లైన్ అప్ లో కొత్త వేరియంట్ ని ప్రారంభించాలని అనుకుంటోంది. అది ఎర్టిగా Dreza గా పిలవబడుతుంది. అధికారికంగా ఆరంభించే ముందు ఈ వాహనం అనేక ఆన్లైన్ పోర్టల్ లో ప్రజల ఆకర్షణకు గురిఅయింది. Dreza మరియుDreza GS అనే రెండు వేరియంట్ రూపాలలో ఇది ఇప్పుడు అందుబాటులో ఉంది. దీని MPV ఇప్పుడు మూడు భాహ్య పెయింట్ జాబ్స్ తో రాబోతోంది. అవి బ్లాక్, గ్రే, వైట్ మరియు వైలెట్ షేడ్ (GS ట్రిమ్). ఈ వాహనం యొక్క పొడవు కుడా చాలా పెంచడం జరిగింది. ప్రామాణిక వేరియంట్ యొక్క పొడవు 4,265mm. అయితే దీనితో పోలిస్తే కొత్త ఎర్టిగా Dreza పొడవు 4,325mm గా నవీకరించబడింది.
సౌందర్యపరంగా చూసినట్లయితే Dreza ఎడిషన్ యొక్క ముందు భాగం పునఃరూపకల్పన చేయబడినటువంటి గ్రిల్ మరియు ఫ్రంట్ బంపర్ , పగటిపూట నడిచే కొత్త ఎల్ ఈ డి లైట్లు, మరియు కొత్త ఫాగ్ లైట్ల ని కలిగినటువంటి కొత్త క్రోమ్ లిప్ వంటి ఫీచర్ల చే నవీకరించబడింది. ప్రక్క ప్రొఫైల్ ని చూసినట్లయితే కొత్తగా రూపకల్పన చేయబడినటువంటి అల్లాయ్ చక్రాలు మరియు సైడ్ సిల్ గార్డ్ లు మరియు స్పాయిలర్ చే బిగించబడిన రూఫ్, అధిక మౌంటెడ్ స్టాప్ లైట్, మరియు 'Dreza' మోనికర్ లు దీని వెనుక భాగం యొక్క ప్రధాన ప్రత్యేకతలు.
లోపలి వైపు చూస్తే MPV ఒక టు-టోన్ సీట్ అపొలిస్ట్రి, వుడ్ ప్యానల్ ని కలిగినటువంటి ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ , ఆన్ద్రాయిడ్ ఫోన్ సింక్ ని కలిగినటువంటి 9 అంగుళాల టచ్స్క్రీన్ సమాచార వినోద వ్యవస్థ మరియు ఆపిల్ కార్ ప్లే వంటి ఫీచర్లని కొత్తగా ప్రారంబించబడిన బలేనో లో చూడవచ్చు. ABSని కలిగిన EBD మరియు ఎయిర్ బాగ్స్ అన్ని వేరియంట్లలో ప్రామాణికంగా ఉంటాయని భావిస్తున్నారు.
ఇప్పటిదాకా ఎటువంటి యాంత్రిక నవీకరణలను ప్రవేశపెట్టలేదు. ఈ కారు K సిరీస్ లో పరీక్షించినటువంటి ఇంజిన్ నే ఉపయోగించబోతోంది. ఇటీవల భారత మార్కెట్లో ఎర్టిగా SHVS టెక్నాలజీ తో నవీకరించబడుతోంది. ఈ వేరియంట్ ఇండియన్ లైన్ అప్ కి జోడించ బడుతుందని భావిస్తున్నారు.
ఇది కుడా చదవండి .