టియువి300: మహీంద్రా పట్టణ మార్కెట్ పై దృష్టి పెట్టనుందా?
మహీంద్రా, వారి రెండవ ప్రయత్నం సబ్- 4మీటర్ల ఎస్యూవి అరేనా తో పినిన్ఫారిన నుండివచ్చిన ఒక కొత్త ప్లాట్ ఫాం, ఇంజిన్ మరియు డిజైన్ ఇన్పుట్లతో సిద్ధంగా ఉంది. టియువి 300 ఆకట్టుకునే విధంగా కనిపిస్తోంది.
జైపూర్: మహీంద్రా బొలెరో ఒక విజయవంతమైన ఉపయోగపడే వాహనం కానీ దాని అమ్మకాలు ప్రధానంగా టైర్ 2 3 నగరాలలో మరియు గ్రామీణ మార్కెట్ల నుంచి వచ్చాయి. ఇది పొడవు 4మీటర్లు పైగా ఉన్నప్పటికీ కూడా ఆర్థికంగా వృద్ధి చెందలేదు. కానీ టియువి300 తో మహీంద్రా పట్టణ మార్కెట్ ను ఆక్రమించాలని చూస్తుంది. ముఖ్యంగా కాంపాక్ట్ ఎస్యూవి మన దేశంలో ప్రధానమైనది మరియు ప్రీమియం వాహనంగా చెప్పవచ్చు. ఇది బొలేరో కన్నా చాలా శక్తివంతమైన వాహనంగా మరియు దీని సబ్-4మీటర్ల కొలతల కారణంగా దీని యొక్క ధర పోటీ పడే విధంగా ఉంటుందని భావిస్తున్నారు. ఈ టియువి300 భారతదేశంలో ఫోర్డ్ ఎకోస్పోర్ట్ తో పోటీ పడనుంది. అంతేకాకుండా, మహీంద్రా ఒక ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఉత్పత్తి మరియు దీని ఎల్ హెచ్ డి వెర్షన్ ను భారతదేశం నుండి ఎగుమతి చేసుకుంటారు అని మహీంద్రా సంస్థ తెలిపింది. కాబట్టి , మహీంద్రా రాబోయే టియువి300 తో పట్టణ మార్కెట్ లో ఏ మేరకు విక్రయాలు జరుపుతుందో మనం చూద్దాం!