ఆకర్షణీయమైన విడుదలలు: కొనసాగింపులో ముందున్న మహీంద్రా XUV500 AT @15.36 లక్షలు

సవరించబడిన పైన Nov 27, 2015 07:53 PM ద్వారా Manish for మహీంద్రా ఎక్స్యూవి500

  • 7 సమీక్షలు
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

జైపూర్:

మహీంద్రా XUV5OO ఆటోమాటిక్

క్రెటా యొక్క డీజిల్ ఆటోమెటిక్ ప్రాముఖ్యత చూశాక, మహీంద్రా నేడు XUV5OO కొరకు ఆటోమేటిక్ వేరియంట్ ని ప్రారంభించింది. ఈ వాహనం ఈ సంవత్సరం ప్రారంభించబడిన స్కార్పియో యొక్క 6-స్పీడ్ ఆటోమేటిక్ యూనిట్ ని పంచుకుంటుంది. ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ XUV5OO యొక్క W8, W10 మరియు W10 AWD వేరియంట్లలో లభ్యమవుతుంది. ధరలు గురించి మాట్లాడుకుంటే, ఈ వేరియంట్ రూ.15.36 లక్షల ధర వద్ద(ఎక్స్-షోరూమ్, నావీ ముంబై) లో ప్రారంభించబడింది.

మరింత చదవండి రూ.15.36 లక్షల ధర వద్ద ప్రారంభించబడిన మహీంద్రా XUV5OO ఆటోమాటిక్

మరింత శక్తివంతమైన టాటా సఫారి స్ట్రోం

టాటా చివరకు ఎంతగానో ఎదురుచూస్తున్న సఫారి స్ట్రోం యొక్క అత్యంత శక్తివంతమైన వెర్షన్ ని రూ.13,52 లక్షలు (ఎక్స్-షోరూమ్) ధర వద్ద విడుదల చేసింది. యాంత్రికంగా, ఈ వెర్షన్ Varicor 400 2.2 లీటర్ 4 సిలిండర్ ఇంజిన్ తో అమర్చబడి మునుపటి దానితో పోలిస్తే 25% అదనపు టార్క్ (400 ఎన్ఎమ్)ని అందించగలిగే సామర్ధ్యంతో ఉంటుంది. ఇది ఒక మెరుగైన గేర్బాక్స్ ని కూడా పొంది ఉండి 156ps గరిష్ట శక్తి అందిస్తుంది. అయితే, ఈ తాజా పెంపు VX వేరియంట్ (4 × 2 ఆకృతీకరణ లో) మాత్రమే అందించబడుతుంది. అయితే, 4x4 వేరియంట్ తరువాత దశలో అదే పొందుతుందని భావిస్తున్నారు

మరింత చదవండి రూ. 13.52 లక్షల ధర వద్ద ప్రారంభించబడిన మరింత శక్తివంతమైన టాటా సఫారి స్ట్రోం

మెర్సిడెస్ - AMG GT- S

మెర్సిడెస్ బెంజ్ ఇండియా దాని ఫ్లాగ్‌షిప్ మోడల్ AMG GT- S ని రూ. 2.4 కోట్ల ధర వద్ద (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ)లో ప్రారంభించింది. ఇది ఈ ఏడాది ప్రారంభించబడుతున్న 5 వ ఏఎంజి. ఇది పూర్తిగా మెర్సిడెస్ AMG శాఖ చే అభివృద్ధి చేయబడినది. SLS AMG స్థానంలో ఈ సూపర్‌కారు కొత్త 4.0 లీటర్ ట్విన్ టర్బోV8 ఇంజిన్ చే అమర్చబడి 510ps శక్తిని మరియు 650Nm టార్క్ ని అందిస్తుంది.

మరింత చదవండి రూ. 2.4 కోట్ల ధర వద్ద ప్రారంభించబడిన మెర్సిడెస్ - AMG GT- S

లంబోర్ఘిని హొరెకెన్ LP580-2

Lamborghini Huracan LP580-2

లంబోర్ఘిని 2015 అటో షో లాస్ ఏంజెల్స్ లో తమ RWD హోరాకెన్ LP580-2 ను ప్రదర్శించిన తరువాత భారతదేశంలో ఇప్పుడు ప్రవేశపెట్టబడింది. ఈ కారు రూ.2.99 కోట్ల ధర వద్ద(ఎక్స్-షో రూం డిల్లీ) అందించబడుతుంది. ప్రామాణికమైన AWD వ్యవస్థ పై వచ్చిన డ్రైవింగ్ ఏక్సలరేషన్ లోటు పాటులను సరి చేసుకుంటూ ఈ ఇటాలియన్ కారు తయారీదారులు గత రెండు రోజుల క్రితం ఈ కారుని భారతదేశంలో ప్రవేశపెట్టారు.

మరింత చదవండి లంబోర్ఘిని హొరెకెన్ LP580-2 RWD రూ. 2.99 కోట్లు ధరతో ప్రవేశపెట్టబడినది

మారుతి  బాలెనో

మారుతి సుజికి ఎంతగానో ఎదురుచూస్తున్న ప్రీమియం హ్యాచ్బ్యాక్ ని నేడు భారత మార్కెట్లోనికి రూ. 4.99 లక్షల ధర వద్ద ప్రారంభించింది. ఇది ఎస్-క్రాస్ తరువాత భారతదేశం యొక్క అతిపెద్ద కార్ల తయారీ సంస్థ అందిస్తున్న రెండవ వాహనం. అదే నెక్సా ప్రీమియం డీలర్షిప్ల ద్వారా ప్రత్యేకంగా అమ్మకం అవుతుంది.

ఒక దశాబ్దం క్రితం యొక్క సెడాన్ నుండి పేరుని తీసుకొని బాలెనో గా పిలవబడుతున్న వాహనం హ్యుందాయ్ ఐ 20 ఎలైట్, ఫోక్స్వ్యాగన్ పోలో మరియు హోండా జాజ్ వంటి వాటితో పోటీకి సిద్ధంగా ఉంది. ఈ ఉన్నత నిర్దేశాలు గల మోడల్ బెల్స్ మరియు విజిల్స్, ప్రొజెక్టర్లు మరియు పగటిపూట నడుస్తున్న లైట్లు, వాతావరణ నియంత్రణ సమాచారం, కలర్ టిఎఫ్టి స్క్రీన్, వెనుక పార్కింగ్ కెమెరా తో 7 అంగుళాల టచ్ స్క్రీన్, సాటిలైట్ నావిగేసహన్ వ్యవస్థ మరియు విభాగంలో మొదటి ఆపిల్ కార్ప్లే తో అందించబడుతున్నది.

మరింత చదవండి  మారుతి సుజుకి బాలెనో రూ. 4.99 లక్షల ధర వద్ద ప్రారంభించబడినది

షెవ్రొలే ట్రెయిల్‌బ్లేజర్

 షెవ్రొలే వారు వారి ఎస్‌యూవీ ట్రెయిల్‌బ్లేజర్ ని రూ. 26.4 లక్షలకు విడుదల చేశారు.  ఇది ఈ కంపెనీ వారికి కాప్టివా తరువాత రెండవ ప్రీమియం ఎస్‌యూవీ మరియూ ప్రస్తుతం సీబీయూ ఉత్పత్తిగా ఉండనుంది. ఇందులో 2.8-లీటర్ డ్యూరామ్యాక్స్ ఇంజిను ఉండి ఇది 200ps శక్తి ఇంకా 500Nm టార్క్ విడుదల చేయగలదు. ఇది సెగ్‌మెంట్ కి లీడర్ అయిన టొయోటా ఫార్చునర్  సామర్ధ్యం కంటే 30ps/157Nm  ఎక్కువ. కాకపోతే, ట్రెయిల్‌బ్లేజర్ కేవలం 2 వీల్ డ్రైవ్ లో లభించి దీనికి 6-స్పీడ్ ఆటోమాటిక్ ట్రాన్స్మిషన్ జత చేసి ఉంటుంది.

మరింత చదవండి షెవ్రొలే ట్రెయిల్‌బ్లేజర్ రూ. 26.4 లక్షలకు విడుదల అయ్యింది

ఫియట్ అబార్త్ పుంటో ఈవో మరియూ అవ్వెంచురా

ఫియట్ ఇండియా వారు అబార్త్ పుంటో ఈవో హ్యాచ్ బ్యాక్ ని  ఇంకా అవ్వెంచురా పవరడ్ బై అబార్త్ క్రాస్-ఓవర్ ని ఈరోజు విడుదల చేశారు. ఈ 'స్కార్పియన్ స్టంగ్' హ్యాచ్ బ్యాక్ కి 1.4-లీటర్ టర్బో చార్జడ్ టీ-జెట్ పెట్రోల్ యూనిట్ ఉండి ఇది 145bhp శక్తి  విడుదల చేస్తుంది.  అవ్వెంచుర ఇదే ఇంజిను కలిగి 140bhp శక్తిని విడుదల చేస్తుంది. 595 కాంపిటియోజోన్ లా కాకుండా, రెండిటికీ కి 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ జత చేయబడి ఇది 100 మార్క్ ని కేవలం 8.8  సెకనుల్లో (పుంటో) ఇంకా 9.9 సెకనుల్లో (అవ్వెంచురా) లో  చేరుకుంటుంది.

మరింత చదవండి ఫియట్ అబార్త్ పుంటో ఈవో మరియూ అవ్వెంచురా లు రెండు రూ. 9.95 లక్షల ధరకు విడుదల అయ్యాయి

స్విఫ్ట్ గ్లోరీ ఎడిషన్

పండుగ సీజన్లలో కొత్త కార్లు మరియు ప్రత్యేఖ ఎడిషన్లు ప్రారంభమవుతున్నాయంటే ఆశ్చర్యపోవలసిన అవసరం లేదు. మారుతి చివరిగా లిమిటెడ్ గ్లోరీ ఎడిషన్ స్విఫ్ట్ ప్రారంభంతో క్లబ్ లో చేరింది. యాంత్రికంగా, 1.2 లీటర్ కె-సిరీస్ పెట్రోల్ మరియు 1.3 లీటర్ మల్టీజెట్ డీజిల్ ఇంజిన్ తో అమర్చబడి 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ తో జతచేయబడి ఉంది.

మరింత చదవండి స్విఫ్ట్ గ్లోరీ ఎడిషన్ ని రూ. 5.28 లక్షలు వద్ద ప్రారంభించిన మారుతి సంస్థ

రెనాల్ట్ క్విడ్

ఫ్రెంచ్ కార్ల తయారీ సంస్థ రెనాల్ట్, ఎంతో ఆశక్తిగా ఎదురుచూస్తున్న రెనాల్ట్ క్విడ్ ని నేడు ప్రారంభించింది. క్విడ్ ఎస్యువి లుక్ ని కలిగియుండి ఆకర్షణీయంగా ఉన్న కారణంగా 2015 లో వినియోగదారులు ఎంతగానో ఎదురుచూస్తున్న కారు ఇది. ఈ కారు రూ 2.56 లక్షల (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) ధర వద్ద విడుదలయ్యి 25.17kmpl మైలేజ్ ని అందిస్తుంది. రెనాల్ట్ క్విడ్ ప్రత్యేఖ అనువర్తనాలు కలిగియున్న భారతదేశం లో మొదటి కారు మరియు ఇది కారు యొక్క లక్షణాలు, ఉపకరణాలు మరియు కారు యొక్క 360 డిగ్రీ వీక్షణను యాప్ ద్వారా బ్రౌజ్ చేసుకునేందుకు అనుమతిస్తుంది. క్విడ్ యొక్క పోటీని యాప్ ద్వారా కూడా పోల్చవచ్చు మరియు దాని ద్వారా వినియోగదారులు కారుని బుక్ చేసుకోవచ్చు.     

మరింత చదవండి రూ. 2.56 లక్షల వద్ద క్విడ్ ని ప్రారంభించిన రెనాల్ట్ సంస్థ

ద్వారా ప్రచురించబడినది

Write your Comment పైన మహీంద్రా ఎక్స్యూవి500

Read Full News

సరిపోల్చడానికి & పరిశీలించడానికి ఒకే లాంటి కార్లు

ఎక్స్-షోరూమ్ ధర కొత్త ధర
  • ట్రెండింగ్
  • ఇటీవల
×
మీ నగరం ఏది?