• English
    • Login / Register

    టయోటా రైజ్ జపాన్‌లో వెల్లడించబడింది; మారుతి విటారా బ్రెజ్జా, హ్యుందాయ్ వెన్యూ కి పోటీగా రానున్నది

    toyota raize కోసం sonny ద్వారా నవంబర్ 11, 2019 02:07 pm ప్రచురించబడింది

    • 34 Views
    • ఒక వ్యాఖ్యను వ్రాయండి

    కొత్త సబ్ -4m SUV భారతదేశంలో ఇలాంటి ఉత్పత్తికి ఒక ప్రివ్యూ గా నిలవనుంది

    •  టయోటా రైజ్ ఒక చిన్నSUV, డైహత్సు ద్వారా నిర్మితమయ్యి మారుతి బ్రెజ్జా అంత పొడవు ఉంటుంది.
    •  CVT ఆటోమేటిక్‌ తో 1.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ ద్వారా పవర్ ని అందుకుంటుంది.
    •  డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్‌ తో 9-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ ను పొందుతుంది.
    •  రైజ్ భారతదేశంలో రాబోయే టయోటా-సుజుకి షేర్డ్ సబ్ -4m SUV యొక్క రూపాన్ని తెలియజేసే ప్రివ్యూ లా ఉంటుంది.
    •  టయోటా తన సహ-అభివృద్ధి చెందిన చిన్న SUV ని 2022 నాటికి ఇక్కడ విడుదల చేయనుంది.

    Toyota Raize Revealed In Japan; Could Rival Maruti Vitara Brezza, Hyundai Venue

     టయోటా రైజ్ సబ్ -4 మీటర్ SUV ని జపాన్‌ లో అధికారికంగా ప్రవేశపెట్టారు. ఇది టయోటా అనుబంధ సంస్థ డైహట్సు అభివృద్ధి చేసిన మోడల్ పై ఆధారపడింది మరియు DNGA ఆర్కిటెక్చర్ ఆధారంగా రూపుదిద్దుకుంది. ‘రైజ్ ఇన్ ఇట్స్ నేటివ్ మార్కెట్’ అని కూడా పిలువబడే రైజ్, భారతదేశానికి 2022 టయోటా-సుజుకి సబ్ -4m SUV యొక్క ప్రివ్యూ గా నిలవనున్నది. 

     

    టొయోటా రైజ్

    మారుతి విటారా బ్రెజ్జా

    హ్యుందాయి వెన్యూ

    పొడవు

    3995mm

    3995mm

    3995mm

    వెడల్పు

    1695mm

    1790mm

    1770mm

    ఎత్తు

    1620mm

    1640mm

    1605mm

    వీల్బేస్

    2525mm

    2500mm

    2500mm

    మిని. గ్రౌండ్ క్లియరెన్స్

    185mm

    198mm(unladen)

     

    బూట్ స్థలం 

    369లీటర్స్

    328 లీటర్స్

    350 లీటర్స్

    Toyota Raize Revealed In Japan; Could Rival Maruti Vitara Brezza, Hyundai Venue

    పరిమాణం పరంగా, రైజ్ అనేది ప్రస్తుత-జనరేషన్ బ్రెజ్జా మరియు వెన్యూ ల వలే అదే పొడవు, అయితే ఎక్కువ వీల్‌బేస్ మరియు ఎక్కువ బూట్ స్థలాన్ని కలిగి ఉంటుంది. మారుతి మోడల్, టయోటా మోడల్ కంటే 105mm వెడల్పు మరియు 20mm ఎక్కువ పొడవు ఉంటుంది. వెన్యూ 85mm వెడల్పుగా ఉంటుంది, కానీ ఎత్తులో 15mm తక్కువ ఉంటుంది.

    టయోటా మరియు సుజుకి భారత్ కోసం  షేర్డ్ మోడళ్ల జాబితాలో తరువాతి జనరేషన్ విటారా బ్రెజ్జాను చేర్చాలని ఇప్పటికే ప్రకటించాయి. సహ-అభివృద్ధి చెందిన సబ్ -4m SUV ని 2022 నాటికి టయోటా బెంగళూరు ప్లాంట్‌ లో నిర్మిస్తారు. ఇది చూడడానికి  బ్రెజ్జా లేదా భారతదేశంలోని మరే ఇతర సబ్ -4m SUV కి అయినా సమానంగా ఉండవచ్చని మేము భావిస్తున్నాము. 

    Toyota Raize Revealed In Japan; Could Rival Maruti Vitara Brezza, Hyundai Venue

    జపాన్‌ లో,  టయోటా సబ్-కాంపాక్ట్ SUV  1.0-లీటర్ టర్బోచార్జ్డ్ యూనిట్‌ తో CVT ఆటోమేటిక్‌ తో జతచేయబడుతుంది. ఈ ఇంజిన్ 98 Ps పవర్ ని మరియు 140Nm టార్క్ ని ఉత్పత్తి చేయడానికి ట్యూన్ చేయబడింది. ఏదేమైనా, టయోటా మరియు సుజుకి మధ్య షేర్ చేయబడే మోడల్ మాన్యువల్ మరియు ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ల ఎంపికతో మారుతి సుజుకి పెట్రోల్ పవర్ట్రెయిన్ ని కలిగి ఉంటుంది. రైజ్‌ కు ఫోర్-వీల్-డ్రైవ్ ఆప్షన్ కూడా లభిస్తుంది, ఇది భారతదేశంలో సబ్ -4m SUV లో అందించే అవకాశం లేదు.

    Toyota Raize Revealed In Japan; Could Rival Maruti Vitara Brezza, Hyundai Venue

    రైజ్ ఆల్-బ్లాక్ ఇంటీరియర్‌ ను పొందుతుంది మరియు టాప్ వేరియంట్‌ లకు ఎరుపు ఆక్సెంట్స్ కూడా లభిస్తాయి. ఇది కొలిజన్ వార్నింగ్, క్రాష్ అవాయిడన్స్ బ్రేకింగ్, పార్కింగ్ అసిస్ట్ మరియు క్రూయిజ్ కంట్రోల్ కలిగి ఉంటుంది. ఇది ఫ్రీ స్టాండింగ్ 9-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, LED డిజిటల్ స్పీడోమీటర్ మరియు ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ కోసం 7-ఇంచ్ TFT కలర్ డిస్‌ప్లేను పొందుతుంది.

    మారుతి తో పంచుకున్న టయోటా యొక్క సబ్ -4m SUV, హ్యుందాయ్ వెన్యూ, కియా QXI, టాటా నెక్సాన్ మరియు మహీంద్రా XUV 300 వంటి వాటికి ప్రత్యర్థి అవుతుంది. దీని ధర రూ .7 లక్షల నుంచి రూ .11 లక్షల పరిధిలో ఉంటుంది.

    was this article helpful ?

    Write your Comment on Toyota raize

    6 వ్యాఖ్యలు
    1
    V
    venkat
    Feb 11, 2025, 12:44:27 PM

    when are going to launch in india?

    Read More...
      సమాధానం
      Write a Reply
      1
      M
      matt kolett
      Dec 24, 2024, 7:25:39 AM

      Waiting patiently

      Read More...
        సమాధానం
        Write a Reply
        1
        B
        bijender singh
        Jul 29, 2024, 2:36:45 PM

        India mai launch hogi kya

        Read More...
          సమాధానం
          Write a Reply

          ట్రెండింగ్‌లో ఉంది ఎస్యూవి కార్లు

          • లేటెస్ట్
          • రాబోయేవి
          • పాపులర్
          ×
          We need your సిటీ to customize your experience