టయోటా ఇన్నోవా క్రిస్టా లో దాగి ఉన్న అద్భుతాలు?
టయోటా ఇనోవా క్రిస్టా 2016-2020 కోసం nabeel ద్వారా ఫిబ్రవరి 12, 2016 03:01 pm ప్రచురించబడింది
- 19 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
2016 ఆటో ఎక్స్పోలో విడుదలైన మరొక సంచలనం టొయోటా ఇన్నోవా క్రిస్టా. అప్పటికే భారత ప్రజల మనుస్సుని తెలుసుకున్న ఈ కొత్త ఇన్నోవా ఈవెంట్ లో ఆకర్షణగా నిలిచింది. ఈ కారు చూడడానికి కొత్తగా మరియు ఆకర్షణీయంగా ఉంది. దీనిని నేరుగా చూసిన వారు దీనిని ఇష్టపడకుండా ఉండలేరు. ఈ కారు పరిమాణం లోనే కాదు స్టేటస్ లో కూడా పెరిగిందండోయి!
ప్రపంచంలో అతిపెద్ద వాహన తయారీసంస్థ టొయోటా, ప్రపంచం మొత్తంలో మంచి ప్రజాధారణ కలిగి ఉంది. ఇప్పుడు ఇది భారతదేశంలో కూడా తన సత్తా చాటుకుంటుంది. టొయోటా దేశంలో విస్తృత కార్లను కలిగి లేనప్పటికీ, ముఖ్యమైన ప్రాంతాలలో మాత్రం తప్పకుండా కార్లను కలిగి ఉంది. భారతదేశంలో దీనికి మొదట క్వాలిస్ ద్వారా భారీ విజయం లభించగా తరువాత ఇన్నోవా కి తరలింది. భారతీయులు ఎంపివి లను కొత్త రూపంలోనే కాకుండా అందరికీ తెలిసిన పాత రూపంలో ఉన్నా కూడా అంఘీకరిస్తారు. భారతదేశం లో గత రెండు తరాల విజయం తర్వాత, జపనీస్ ఆటో దిగ్గజం మళ్ళీ దీనితో మ్యాజిక్ చేసేందుకు సిద్ధంగా ఉంది. టొయోటా కొత్త ఇన్నోవా ఎటువంటి అంశాలను రహస్యంగా ఉంచిందో ఇక చూద్దామా!
లుక్స్:
లుక్స్ పరంగా చెప్పలంటే, టొయోటా ఈ ఎంపివి ని చాలా అందంగా తీర్చిదిద్దేందుకు అద్భుతమైన కృషి చేసిందని చెప్పవచ్చు. ఎందుకంటే, ఎంపివి చూడడానికి అంత ఆకర్షణీయంగా ఉండదని అందరికీ తెలిసిన విషయమే, కానీ ఇన్నోవా ఈ వాహనాన్ని కనీసం ముందరి భాగం నుండి అయినా చూడడానికి ఆకర్షణీయంగా కనిపించేలా బాగానే మేనేజ్ చేసింది. దీనిలో కొత్త హెడ్లైట్ క్లస్టర్ రెండు షైనీ స్ట్రిప్స్ మధ్య అందంగా ఉంది. హెగ్జాగొనల్ ఎయిర్ డ్యామ్ పెద్దదిగా ఉండి కారుకి ఒక ఉత్తేజకరమైన రూపాన్ని జోడించింది. దీనిలో హెడ్ల్యాంప్ క్లస్టర్ మూడు పార్ట్ లను కలిగి ఉంది. వాటిలో ప్రొజక్టర్స్ మరియు ఎల్ ఇడి లైట్లను చదరపు అమరికలో అమర్చబడి ఉంటాయి.
రెండు స్లాట్లతో కలిసిఉండే ఈ గ్రిల్ పెద్ద టొయోటా యొక్క చిహ్నాన్ని కలిగి ఉంది. ఇది బోనెట్ పైన బలమైన బోర్డర్ లైన్లతో కారు ఒక ప్రవాహం వంటి డిజన్ ని కలిగి ఉంది. ఈ కారు ని సైడ్ నుంచి చూస్తే ఇన్నోవా నిస్సందేహంగా చాలా పొడవుగా కనిపిస్తుంది. సి-పిల్లర్ దిశగా పదునైన గ్లాస్ లేఅవుట్ ఇన్నోవా కు ఒక కొత్త రూపాన్ని ఇచ్చినట్లు గా ఉంది. అంతేకాకుండా అలాయ్స్ మిశ్రమాలు కూడా ప్రతీ దానిలో చేర్చడం అనేది ఈ ఎంపివి ని మరింత ప్రత్యేకంగా చేసింది. బూమేరాంగ్ ఆకారంలో ఉన్న టెయిల్ లైట్ క్లస్టర్ వెనుక భాగం యొక్క ప్రధాన ఆకర్షణగా ఉంది మరియు రూఫ్ స్పాయిలర్ కూడా దీనిలో ముఖ్య ఆకర్షణగా చెప్పవచ్చు.
కారు లోపలి భాగాలలో చాలా విశేషాలు దాగి ఉన్నాయి. టొయోటా కారు ఏదో సాధారణ ఇంటీరియర్స్ అందజేశాం అన్నట్టు కాకుండా అద్భుతంగా అందించింది. కారు లోపలి భాగాలు చాలా ఖరీదు గా ఉంటాయి. ఈ కారులో కొత్త లేవుట్ వుడ్ ఫినిష్ మరియు నావిగేషన్ తో 7 అంగుళాల టచ్ స్క్రీన్ సమాచార వినోద వ్యవస్థ అందించడం జరిగింది.
ఈ కారు డాష్ బోర్డ్ యొక్క మొత్తం లేవుట్ డ్రైవర్ మీద కేంద్రీకరించబడింది మరియు సమర్ధవంతమైనది. ఈ డాష్బోర్డ్ పైన ఆడియో కాల్స్ మరియు క్రూజ్ కంట్రోల్స్ అందించబడుతున్నాయి. ఈ కారులో ప్రతీదీ పరిపూర్ణంగా మరియు ప్రీమియం ప్యాకేజీతో భారత వినియోగదారులకు అందించబడుతుంది. ఇక అదృష్టవంతులు ఎవరు?
ఇంజిన్:
టొయోటా ఇన్నోవా అన్నీ కొత్త ఇంజిన్లను అందిస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేసిందని చెప్పవచ్చు. ఈ వాహనం 2.4-లీటర్ 2GD FTV నాలుగు సిలిండర్ డీజిల్ ఇంజన్ ని ప్రామాణికంగా మరియు 2.8 లీటర్ Z వేరియంట్లని కూడా ఆటో కెస్పోలో ప్రదర్శించి ఒక శక్తివంతమైన టాప్ ఎండ్ వేరియంట్ గా సూచన ఇచ్చింది. దీనిలో 2.4 లీటర్ వేరియంట్ 342Nm టార్క్ తో పాటూ 142bhp శక్తిని అందిస్తుంది మరియు సుమారు 14-16kmpl మైలేజ్ ని అందిస్తుందని భావిస్తున్నారు. దీనిలో 2 రకాల ట్రాన్స్మిషన్ ఎంపికలు అందించబడుతున్నాయి, అవి 5-స్పీడ్ మాన్యువల్ మరియు 6-స్పీడ్ ఆటోమెటిక్ సీక్వెన్షియల్ షిఫ్ట్ మరియు క్రూజ్ కంట్రోల్.
లక్షణాల సమూహం:
లోపలి భాగాలు:కొత్త ఇన్నోవా అనేక లక్షణాలతో నిండి ఉంది. వాటిలో లెథర్ ఇంటీరియర్, పరిసరాల లైటింగ్, వెనుక ఆటో కూలర్ తో ఆటోమెటిక్ క్లైమేట్ కంట్రోల్, విద్యుత్ తో సర్దుబాటు చేయగల డ్రైవర్ సీటు, సులభంగా మూసివేయగల బూట్ గేట్, నావిగేష తో 7-అంగుళాల టచ్ స్క్రీన్ సమాచార వినోద వ్యవస్థ, స్మార్ట్ ఎంట్రీ మరియు పుష్ బటన్ బటన్ స్టార్ట్ వంటి లక్షణాలు అందించబడ్డాయి.
వెలుపల భాగం: ఇన్నోవా 17 అంగుళాల అలాయ్ వీల్స్ ని కలిగి, అభివృద్ధి పరిచిన సస్పెన్ష వ్యవస్థతో మంచి నియంత్రణను అందిస్తుంది. దీని బాహ్య భాగలలో మూడు కొత్త రంగులు మరియు క్రోమ్ విండో లైనింగ్ అందించబడుతున్నాయి.
భద్రతా & కొలతలు:
ఇన్నోవా క్రిస్టా ఫ్రంట్ డ్యుయల్ SRS ఎయిర్బ్యాగ్స్, ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ తో యాంటి లాక్ బ్రేకింగ్ సిస్టమ్ మరియు బ్రేక్ అసిస్ట్ ని ప్రామాణికంగా అన్ని వేరియంట్లలో అందించబడుతుంది. కొత్త ఇన్నోవా 4735mm(పాత దాని కంటే 150mm పొడవు ఎక్కువ ఉంది), వెడల్పు 1830mm మరియు ఎత్తు 1795mm(ముందరి దాని కంటే 35mm తక్కువ ఉంది). దీని యొక్క వీల్బేస్ పాతదానితో సమానంగా 2750mm కలిగి ఉంది.
ప్యాకేజీ:
ముందు చెప్పిన విధంగా శక్తివంతమైన ఇన్నోవా పెరిగింది. ఇది పెద్దది, వేగవంతమైనది మరియు ముందరి దాని కంటే మరింత ప్రీమియంగా ఉంది. ఈ మెరుగుదలలు అన్నీ కూడా ఖర్చుతో వస్తాయి. ఇన్నోవా రూ.22 లక్షల అధిక ధర వద్ద వస్తుందని ఊహిస్తున్నాము. ఈ కారు చాలా అద్భుతంగా ఉంటుంది, కానీ ఇది భారతీయ ఆలోచనా విధానానికి తగ్గట్టుగా ఉంది. ప్రజలు ఒక ప్రీమియం ఉత్పత్తిగా ఈ ప్రయాణికుల MPV ని అంగీకరిస్తారో లేదో చూడాలి. అలాగే, ఇన్నోవా క్రిస్టా యొక్క వివరణాత్మక గ్యాలరీ చూడండి.