టాటా టియాగో EVని పూర్తిగా ఛార్జింగ్ చేయడానికి పట్టే సమయం
టియాగో EVని DC ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్ؚలో ప్లగ్ చేసి, వాస్తవ పరిస్థితులలో ఛార్జింగ్ సమయాన్ని రికార్డ్ చేశాము
టాటా టియాగో EV గత సంవత్సరం సెప్టెంబర్‌లో విడుదలైంది. ఆ సమయంలో ఇది భారతదేశంలోనే అత్యంత చవకైన ఎలక్ట్రిక్ హ్యాచ్ؚబ్యాక్‌గా ఉంది, ప్రస్తుత సంవత్సరం మే నెలలో వచ్చిన MG కామెట్ EV దీనికంటే మరింత చవకైనదిగా నిలుస్తుంది. టాటా టియాగో EV రెండు బ్యాటరీ ఎంపికలతో వస్తుంది: 19.2 kWh మరియు 24kWh – క్లెయిమ్ చేసిన వీటి పరిధి వరుసగా 250కిమీ మరియు 315కిమీగా ఉంది. AC మరియు DC ఛార్జింగ్ؚలు రెండిటికీ మద్దతు ఇస్తుంది. ఇటీవల, భారీ బ్యాటరీ ప్యాక్ వర్షన్ గల టియాగో EVని అందిస్తున్నారు. DC ఫాస్ట్ ఛార్జర్ؚను ఉపయోగించి 10 నుండి 100 వరకు ఛార్జ్ చేయడానికి ఎంత సమయం పడుతుందో మేము తనిఖీ చేశాము.
ఛార్జింగ్ సమయం
వాస్తవ స్థితిలో ఛార్జింగ్ సమయం వాహన స్థితి, ఆంబియెంట్ ఉష్ణోగ్రతలు మరియు ఛార్జర్ నుండి ఫ్లో రేట్ వంటి అనేక కారకాలపై ఆధారపడి ఉంటుంది. ఇది ఎంత వేగంగా ఛార్జ్ అవుతుందో చూడటానికి టియాగో EVని మేం 120kW DC ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్ؚకు తీసుకువెళ్లాము. అయితే, మొత్తం ఛార్జింగ్ ప్రక్రియలో టియాగో EV గరిష్ట ఛార్జింగ్ రేటు 18kWగా ఉంది.
ఇది కూడా చదవండి: సిట్రోయెన్ eC3 ఎలక్ట్రిక్ హ్యాచ్ؚబ్యాక్ వాస్తవ ప్రపంచ ఛార్జింగ్ టెస్ట్
10 నుండి 100 శాతం వరకు వివరణాత్మక ఛార్జింగ్ సమయాలు.
ఛార్జింగ్ శాతం |
ఛార్జింగ్ రేట్ |
సమయం |
10 - 15 శాతం |
17kW |
4 నిమిషాలు |
15 - 20 శాతం |
18kW |
4 నిమిషాలు |
20 - 25 శాతం |
18kW |
4 నిమిషాలు |
25 - 30 శాతం |
17kW |
4 నిమిషాలు |
30 – 35 శాతం |
17kW |
4 నిమిషాలు |
35 - 40 శాతం |
17kW |
4 నిమిషాలు |
40 - 45 శాతం |
17kW |
4 నిమిషాలు |
45 - 50 శాతం |
18kW |
4 నిమిషాలు |
50 - 55 శాతం |
18kW |
4 నిమిషాలు |
55 - 60 శాతం |
18kW |
4 నిమిషాలు |
60 - 65 శాతం |
18kW |
4 నిమిషాలు |
65 - 70 శాతం |
17kW |
4 నిమిషాలు |
70 – 75 శాతం |
17kW |
5 నిమిషాలు |
75 - 80 శాతం |
17kW |
4 నిమిషాలు |
80 - 85 శాతం |
18kW |
4 నిమిషాలు |
85 - 90 శాతం |
13kW |
5 నిమిషాలు |
90 - 95 శాతం |
7kW |
7 నిమిషాలు |
95 - 100 శాతం |
2kW |
26 నిమిషాలు |
ముఖ్యాంశాలు
-
టియాగో EVని ప్లగ్ చేసిన తరువాత దీని బ్యాటరీ ప్రతి నాలుగు నిమిషాలకు ఐదు శాతం ఛార్జ్ అయ్యింది.
-
బ్యాటరీలో 85 శాతం ఛార్జింగ్ వచ్చేవరకు టియాగో EV 18kW రేటుతో ఛార్జ్ అయ్యింది, అక్కడి నుండి తగ్గుతూ వచ్చింది.
-
ఛార్జింగ్ రేటు 13kWకి తగ్గింది మరియు తదుపరి 5 శాతం ఛార్జింగ్ؚకు అదనంగా మరొక నిమిషం పట్టింది.
-
90 శాతం వద్ద, ఛార్జింగ్ రేటు 7kWకు తగ్గింది మరియు 95 శాతం వద్దకు చేరడానికి కారుకు ఏడు నిమిషాలు పట్టింది.
-
95 శాతం నుండి, ఛార్జింగ్ రేట్ వేగంగా తగ్గుతూ 2kWకి చేరుకుంది. ఈ ఛార్జింగ్ రేటుతో పూర్తి ఛార్జింగ్ సామర్ధ్యానికి చేరుకోడానికి కారుకు 26 నిమిషాలు పట్టింది.
-
మా పరీక్షలో, 10 నుండి 80 శాతానికి ఛార్జింగ్ కావడానికి 57 నిమిషాలు పట్టింది, ఇది కారు తయారీదారు క్లెయిమ్ చేసిన 58-నిమిషాలకు దాదాపుగా సమానం.
-
80 నుండి 100 శాతం ఛార్జింగ్ కావడానికి మరొక 42 నిమిషాలు పట్టింది.
ఛార్జింగ్ వేగంలో ఈ తగ్గుదల ఎందుకు?
ప్రతి కారు తయారీదారు తమ కస్టమర్‌కు కేవలం 10 నుండి 80 శాతం ఛార్జింగ్ సమయం గురించి మాత్రమే తెలియచేస్తారు ఎందుకంటే ఇది ఆప్టిమల్ బ్యాటరీ ఛార్జింగ్ బ్రాకెట్. మా పరీక్షల ప్రకారం, చివరి 20 శాతం ఛార్జింగ్ؚకు చాలా సమయం పట్టినట్లు స్పష్టమైంది, ఇది ఎందుకంటే 80 శాతం తరువాత ఛార్జింగ్ రేటు తగ్గిపోవడం మొదలవుతుంది. దీనికి కారణం DC ఫాస్ట్ ఛార్జర్ؚను ఉపయోగించినప్పుడు, బ్యాటరీ ప్యాక్ వేడెక్కుతుంది, ఇది బ్యాటరీ ఆరోగ్యానికి మంచిది కాదు. ఛార్జింగ్ వేగం తగ్గడం వలన అధికంగా వేడెక్కడం ఉండదు మరియు బ్యాటరీ పాడవకుండా ఉండడాన్ని నివారించవచ్చు.
పవర్‌ట్రెయిన్
టాటా టియాగో EV రెండు బ్యాటరీ ప్యాక్ ఎంపికలతో వస్తుంది: 19.2kW మరియు 24kW. ఇవి రెండూ ఎలక్ట్రిక్ మోటార్ؚతో జోడించబడతాయి మరియు చిన్న బ్యాటరీతో 61PS/110Nm మరియు పెద్ద బ్యాటరీతో 75PS/114Nm శక్తిని విడుదల చేస్తుంది.
ధర పోటీదారులు
టియాగో EVని టాటా రూ.8.69 లక్షల నుండి రూ.12.04 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరతో విక్రయిస్తుంది. ఎంట్రీ-లెవెల్ EV సిట్రోయెన్ eC3 మరియు MG కామెట్ EVలతో నేరుగా పోటీ పడుతుంది. మన విస్తృత వాస్తవ ప్రపంచ పరీక్షలో టియాగో EV ఎంత పరిధిని అందిస్తుందో తెలుకోవడానికి వేచి ఉండండి.
ఇక్కడ మరింత చదవండి: టియాగో EV ఆటోమ్యాటిక్
Write your Comment on Tata Tia గో EV
How can we go beyond 300 kilometres What about charging