Choose your suitable option for better User experience.
  • English
  • Login / Register

ఫాస్ట్ ఛార్జర్ ఉపయోగించి Kia EV6 పూర్తిగా ఛార్జ్ కావడానికి ఎంత సమయం పడుతుంది?

కియా ఈవి6 కోసం rohit ద్వారా నవంబర్ 23, 2023 05:05 pm ప్రచురించబడింది

  • 81 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

కియా EV6 బ్యాటరీ ప్యాక్ DC ఫాస్ట్ ఛార్జర్ ను ఉపయోగించి కేవలం 20 నిమిషాల్లో 0 నుంచి 50 శాతం వరకు ఛార్జ్ చేయగలదు.

Kia EV6 charging

కియా EV6 భారతదేశంలో కంపెనీ యొక్క మొదటి ఎలక్ట్రిక్ కారు, ఇది జూన్ 2022 లో విడుదలైంది. ఈ ఎలక్ట్రిక్ వాహనం 77.4 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్తో లభిస్తుంది మరియు రెండు పవర్ట్రెయిన్ ఎంపికలతో వస్తుంది: సింగిల్ మోటార్ రేర్-వీల్ డ్రైవ్ (229 PS/350 Nm) మరియు డ్యూయల్ మోటార్ ఆల్-వీల్ డ్రైవ్ (325 PS/605 Nm). EV6 కారు ARAI సర్టిఫైడ్ పరిధి 708 కిలోమీటర్లు. ఇటీవల, కియా EV 6 యొక్క టాప్ ఆల్-వీల్ డ్రైవ్ వేరియంట్లను మేము పరీక్షించాము, ఇది DC ఫాస్ట్ ఛార్జర్ ద్వారా కారు 0 నుండి 100 శాతం ఛార్జ్ చేయడానికి ఎంత సమయం పడుతుందో మేము డాక్యుమెంట్ చేసాము.

ఛార్జింగ్ సమయం

మేము టెస్ట్ చేస్తునప్పుడు, బ్యాటరీ 0 శాతం ఉన్నప్పుడు మేము కియా EV6 ను 120 కిలోవాట్ల DC ఫాస్ట్ ఛార్జర్కు కనెక్ట్ చేసాము. ఈ ప్రీమియం ఎలక్ట్రిక్ కారు పూర్తిగా ఛార్జ్ కావడానికి ఎంత సమయం పట్టిందో మనం మరింత తెలుసుకుందాం.

ఛార్జింగ్ శాతం

ఛార్జింగ్ రేటు

సమయం

50 శాతం వరకు

118 కిలోవాట్లు - 119 కిలోవాట్లు

20 నిమిషాలు

51 - 55 శాతం

118 కిలోవాట్లు - 119 కిలోవాట్లు

2 నిమిషాలు

56 - 60 శాతం

118 కిలోవాట్లు - 119 కిలోవాట్లు

3 నిమిషాలు

61 - 65 శాతం

118 కిలోవాట్లు - 119 కిలోవాట్లు

3 నిమిషాలు

66 - 70 శాతం

118 కిలోవాట్లు - 119 కిలోవాట్లు

2 నిమిషాలు

71 - 75 శాతం

118 కిలోవాట్లు - 119 కిలోవాట్లు

2 నిమిషాలు

76 - 80 శాతం

118 కిలోవాట్లు - 119 కిలోవాట్లు

2 నిమిషాలు

81 - 85 శాతం

118 కిలోవాట్లు

5 నిమిషాలు

86 - 90 శాతం

60 కిలోవాట్లు

4 నిమిషాలు

91 - 95 శాతం

35 కిలోవాట్లు - 40 కిలోవాట్లు

7 నిమిషాలు

96 - 98 శాతం

29 కిలోవాట్లు - 30 కిలోవాట్లు

5 నిమిషాలు

99 - 100 శాతం

22 కిలోవాట్లు

5 నిమిషాలు

ముఖ్యాంశాలు

  • కియా EV6 120 కిలోవాట్ల DC ఫాస్ట్ ఛార్జర్ ద్వారా 0 నుంచి 100 శాతం ఛార్జ్ చేయడానికి గంట పట్టింది.

  • ఈ కారు బ్యాటరీ ఫస్ట్ హాఫ్ లో త్వరగా ఛార్జ్ కాగా, సెకండాఫ్ లో ఛార్జింగ్ కావడానికి దాదాపు రెట్టింపు సమయం పట్టింది. మొత్తం మీద, 0 నుండి 90 శాతం ఛార్జ్ చేయడానికి 45 నిమిషాలు పట్టింది, అంటే 1 శాతం ఛార్జ్ చేయడానికి సగటున అర నిమిషం మాత్రమే పట్టింది.

  • ఒకానొక దశలో ఛార్జింగ్ రేటు 118 కిలోవాట్ల నుంచి 7 కిలోవాట్లకు పడిపోయినా కొద్ది నిమిషాల్లోనే మళ్లీ పెరిగింది.

Kia EV6 charging

  • బ్యాటరీ 85 శాతం ఛార్జ్ అయిన తరువాత దాని ఛార్జింగ్ రేటు 60 కిలోవాట్లకు పడిపోయింది మరియు దాదాపు ప్రతి 5 సెకన్లకు నెమ్మదిగా తగ్గుతుంది, అత్యల్పంగా నమోదైన ఛార్జింగ్ రేటు 41 కిలోవాట్లు.

  • దీని బ్యాటరీ 90 శాతం ఉన్నప్పుడు, దాని ఛార్జింగ్ వేగం 40 కిలోవాట్ల నుండి 35 కిలోవాట్లకు తగ్గింది, 93 శాతం వద్ద దాని ఛార్జింగ్ వేగం 29 కిలోవాట్లు అయ్యింది.

  • 95 నుండి 98 శాతం ఛార్జింగ్ రేటు 22 కిలోవాట్లు మరియు 99 నుండి 100 శాతం ఛార్జింగ్ రేటు 29 కిలోవాట్ / 30 కిలోవాట్లు ఉన్నప్పుడు దాని చివరి 5 శాతం ఛార్జింగ్ 10 నిమిషాల్లో పూర్తయింది.

ఛార్జింగ్ రేటు ఎందుకు తగ్గుతుంది?

ఎలక్ట్రిక్ కారు బ్యాటరీ 80 శాతానికి చేరుకున్నప్పుడు, ఛార్జింగ్ ఆటోమేటిక్గా తగ్గుతుంది. మీరు DC ఫాస్ట్ ఛార్జర్ ఉపయోగించినప్పుడు మరియు బ్యాటరీ వేడెక్కడం ప్రారంభించినప్పుడు ఇది సాధారణంగా కనిపిస్తుంది, ఇది బ్యాటరీ యొక్క సుదీర్ఘ జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. నెమ్మదిగా ఛార్జింగ్ చేయడం వల్ల వేడెక్కడాన్ని నివారించవచ్చు మరియు మీ బ్యాటరీని మంచి స్థితిలో ఉంచవచ్చు. బ్యాటరీ ప్యాక్ కణాల సమూహం వంటిది, నెమ్మదిగా ఛార్జింగ్ చేయడం వల్ల ఈ కణాలన్నీ సమానంగా ఛార్జ్ చేయబడతాయి.

ఇది కూడా చదవండి: ఎలక్ట్రిక్ కార్ల తయారీదారులు 0-80% ఛార్జింగ్ సమయాన్ని మాత్రమే ఎందుకు ఇస్తారో ఎప్పుడైనా ఆలోచించారా? వివరణ ఇదీ..

ధర మరియు ప్రత్యర్థులు

Kia EV6 charging

కియా EV6 ధర రూ.60.95 లక్షల నుంచి రూ.65.95 లక్షల మధ్యలో (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) ఉంది. ఇది మరింత సరసమైన హ్యుందాయ్ అయోనిక్ 5 తో నేరుగా పోటీ పడుతుంది. ధర విషయానికొస్తే, ఇది BMW i4, వోల్వో XC40 రీఛార్జ్ మరియు రాబోయే స్కోడా ఎన్యాక్ iV వంటి వాటికి పోటీగా ఉంటుంది.

మరింత చదవండి: కియా EV6 ఆటోమేటిక్

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your Comment పైన కియా ఈవి6

Read Full News

explore మరిన్ని on కియా ఈవి6

సరిపోల్చడానికి & పరిశీలించడానికి ఒకే లాంటి కార్లు

*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర

ట్రెండింగ్‌లో ఉంది ఎలక్ట్రిక్ కార్లు

  • పాపులర్
  • రాబోయేవి
×
We need your సిటీ to customize your experience