Login or Register కోసం ఉత్తమ CarDekho experience
Login

ఈ DC2-డిజైన్డ్ కస్టమ్ క్రాస్ؚఓవర్ నిజానికి ఒక లగ్జరీ SUV

వోల్వో ఎక్స్ 90 కోసం rohit ద్వారా మే 17, 2023 05:48 pm ప్రచురించబడింది

గల్ؚవింగ్ డోర్‌లతో ఈ రీడిజైన్ ప్రజాదరణ పొందిన రూపం కాకపోయినా ఖచ్చితంగా ప్రత్యేకమైనది.

వివిధ కారు తయారీదారుల ప్రామాణిక కార్‌లను భారీగా కస్టమైజేషన్ؚ చేయడంలో దిలీప్ చాబ్రియా DC2 డిజైన్ స్టూడియో ప్రఖ్యాతి చెందింది. సాధారణంగా కనిపించే వాటి కంటే ఏదైనా ప్రత్యేకంగా సృష్టించే ప్రయత్నంలో వీరు అందించే విచిత్రమైన డిజైన్‌లు ఎగతాళికి గురి కావడం లేదా నిలిపివేయబడటం జరుగుతుంది.

ప్రస్తుతం, ఈ డిజైన్ హౌస్ వారి చేతిలో పడిన కొత్త వాహనం నవీకరణ పొందని వోల్వో XC90. ఫలితంగా తయారైన కస్టమ్ కూపే క్రాస్ ఓవర్ చాలా మందికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. వీటిలో ఏది బాగుందో లేదా బాగాలేదో కనుగొనడానికి ప్రయత్నిద్దాం, ముందుగా బాగాలేనివి చూద్దాం:

బాగాలేనివి

ఖచ్చితంగా, DC2 ఈ SUVని సొంత కారు తయారీదారు గుర్తుపట్టలేనట్లుగా మార్చేసింది, కానీ ఇది ఆహ్లాదకరంగా లేకపోవడంతో తయారైన వెంటనే ఇది వ్యతిరేక వ్యాఖ్యలను అందుకుంది. ఎందుకంటే కొన్ని సంవత్సరాలుగా XC90తో సహా వోల్వో కార్‌లు ప్రపంచ మార్కెట్‌లో సొగసైన మరియు ఉత్తమంగా కనిపించే మోడల్‌లుగా పేరు గాంచాయి.

View this post on Instagram

A post shared by DC2 Dilip Chhabria (@dc2dilipchhabria)

కొన్ని ధృడమైన వివరాలతో క్రాస్ؚఓవర్ కూపేలా కనిపించడానికి ఈ డిజైన్ హౌస్ SUV ఎక్స్ؚటీరియర్ؚను పూర్తిగా మార్చేసింది, దీనితో వోల్వో తన ఆకర్షణీయమైన రూపాన్ని పూర్తిగా కోల్పోయింది. నాజూకైన డిజైన్ మరియు ఐకానిక్ LED లైటింగ్ డీటైల్స్ؚతో వోల్వో SUV స్టైలిష్ అప్పీల్ؚను పొందితే, కస్టమ్-బిల్ట్ క్రాస్ؚఓవర్‌లో ఇవి ఏవీ లేవు.

బదులుగా, ఇందులో ముందు వైపు భారీ మేష్ వంటి నమూనా కలిగి ఉంది, మా అభిప్రాయం ప్రకారం ఇది SUV తన అందాన్ని కోల్పోయేలా చేసి, మరింత దృఢమైన మరియు పాతదిగా కనిపించే రూపాన్ని ఇచ్చింది. ఈ ధృడమైన డిజైన్ థీమ్ వాహనం రెండు పక్కల కూడా కొనసాగింది, భారీ ఆఫ్-రోడింగ్ టైర్‌లను కలిగి ఉన్న సమానంగా లేని పెద్ద వీల్ ఆర్చ్‌లు ఉన్నాయి. ఈ కస్టమ్ కార్ కేవలం రెండు భారీ రూఫ్-హింజెడ్ డోర్‌లను (గల్-వింగ్ రకం) మరియు రేస్ కార్‌లలో కనిపించే చిన్న మరియు తెరవగలిగే విండో ఏరియాలను కలిగి ఉండే గ్లాస్ ప్యానెల్ؚలతో వస్తుంది.

వెనుక వైపు, ఈ XC90-ఆధారిత కూపే SUV, వెనుక మిడ్-ఇంజన్ కలిగి ఉండే స్పోర్ట్స్ కార్‌లలో ఉన్నట్లుగా ట్విన్-అవుట్ؚలెట్ؚలకు దారితీసే ఉబ్బిన రేర్ గ్లాస్ ప్యానెల్ؚను కలిగి ఉంది. కనెక్టెడ్ టెయిల్ లైట్ లు ఉన్నప్పటికీ, కొత్త ఆఫరింగ్ؚలలో కారు తయారీదారు అందించిన వాటిలో కనీసం సగం ఆకర్షణీయంగా కూడా ఇవి లేవు. ఈ కూపే దారుణమైన అంశాలలో బహుశా అతి దారుణమైన అంశానికి వస్తే, దిగువ వెనుక భాగంలో రెండు పెద్ద చతురస్ర ఎగ్జాస్ట్ؚలను కలిగి ఉన్న హనీకోంబ్ నమూనా భారీగా మరియు అసహ్యంగా కనిపిస్తోంది.

ఇది కూడా చదవండి: రూ. 10 లక్షల కంటే తక్కువ ధరలో 7 భారీ సెకండ్ హ్యాండ్ SUVలు

బాగున్నవి

ఈ కారు ఇంటీరియర్ؚలను చూసినప్పుడు మాత్రమే ఇది వోల్వో XC90 SUV అని నమ్మగలరు. ఈ కస్టమ్ SUV 4-సీటర్‌ల లేఅవుట్ؚను కలిగి అద్భుతమైన వేరియెంట్‌పై ఆధారపడింది. DC2 దీనికి క్యాబిన్ అంతటా యంబియెంట్ లైటింగ్ؚతో ఎరుపు ఇంటీరియర్ మరియు అప్ؚహోల్ؚస్ట్రీలను అందించింది. నైట్ క్లబ్ లాంజ్ ఆకర్షణ కోసం పనోరమిక్ సన్ؚరూఫ్ؚను అందించలేదు.

డిజైన్ స్టూడియో SUV అసలైన డ్యాష్‌బోర్డ్ లేఅవుట్‌ను ఎక్కువగా మార్చలేదు. కస్టమ్-మేడ్ మోడల్ؚలో వోల్వో అందించిన AC వెంట్ؚలు మరియు నిలువుగా ఉన్న టచ్ؚస్క్రీన్ సిస్టమ్ అదే విధంగా ఉన్నాయి. దీని స్టీరింగ్ వీల్ నేరుగా XC90 నుంచి తీసుకున్నారు అయితే ఎరుపు మరియు నలుపు రంగులతో చుట్టబడి ఉంది, మధ్య కన్సోల్ؚలో కూడా ఎరుపు రంగు స్టిచింగ్ ఉంది. ఈ లగ్జరీ క్రియేషన్ స్వీడిష్ డోనర్ SUV అందించిన పవర్-అడ్జస్టబుల్ ముందు సీట్ లను నిలుపుకుంది.

ఇంతకు ముందు విస్తృతంగా మార్చిన మధ్య కన్సోల్ మరియు వెనుక ప్రయాణీకులకు ఎక్విప్మెంట్ؚతో వచ్చిన కొన్ని అనుకూలీకరించిన మోడల్‌ల విధంగా కాకుండా, DC2 ఇక్కడ ఎక్కువ మార్పులు చేయలేదు. డ్యాష్ؚబోర్డ్ ఎలిమెంట్ؚల కిష్టమైన ఇంటిగ్రేషన్ మరియు కారులో ఉన్న కంప్యూటర్‌ల కారణంగా ఈ భాగాన్ని అలాగే విడిచి పెట్టారని భావిస్తున్నాము; Mk.V టయోటా సుప్రా కూడా వీటిని ప్రస్తుత BMW Z4లో పంచుకుంది.

ఇది కూడా చదవండి: ప్రతి పెంపుడు జంతువుల యజమాని తెలుసుకోవలసిన కారు సంరక్షణ చిట్కాలు: ‘పూర్తిగా’ శుభ్రం

ఈ మేక్ؚఓవర్ؚకు అయిన ఖర్చు ఎంత?

ఈ అనుకూలీకరణకు అయిన ఖచ్చితమైన ఖర్చును DC2 వెల్లడించలేదు, అయితే ఇది ప్రామాణిక XC90 ధర రూ.98.5 లక్షల కంటే ఖచ్చితంగా ఎక్కువ ఉంటుందని విశ్వసిస్తున్నాము, దీని వలన ఇది రూ.1-కోటి విభాగంలోకి చేరవచ్చు (ఎక్స్-షోరూమ్). వోల్వో డోనర్ కార్ పవర్ؚట్రెయిన్ మరియు పర్ఫార్మెన్స్ అవుట్ؚపుట్ మార్పుల గురించి ఎటువంటి వివరాలు అందుబాటులో లేవు. అదృష్టవశాత్తు, దీన్ని ఖరీదు చేసే వారి సంఖ్య ఎక్కువగా ఉండదని భావిస్తున్నాము, కాబట్టి దీన్ని మన రోడ్లపై చూసే బాధ మనకు ఉండకపోవచ్చు.

ఈ కస్టమైజేషన్ గురించి మీ అభిప్రాయం ఏమిటి, ఏ ఇతర మార్పులను మీరు దీనిలో చూడాలని కోరుకుంటారు? కామెంట్‌లలో తెలియజేయండి.

ఇక్కడ మరింత చదవండి: XC90 ఆటోమ్యాటిక్

r
ద్వారా ప్రచురించబడినది

rohit

  • 21 సమీక్షలు
  • 0 Comments

Write your Comment పైన వోల్వో XC 90

Read Full News

ట్రెండింగ్‌లో ఉందిఎస్యూవి కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర