పెద్ద బెంట్లీ రానుంది, బెంటేగా ఎస్యూవీ ని విడుదల కు పూర్వమే ఆవిష్కృతం చేశారు (వీడియోలు)

modified on సెప్టెంబర్ 09, 2015 02:32 pm by nabeel కోసం బెంట్లీ బెంటెగా 2015-2021

  • 10 సమీక్షలు
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

ఫ్రాంక్ఫర్ట్ మోటర్ షో దగ్గర పడుతున్నందున బెంట్లీ వారు అభిమానులకి ఏదైనా అందించాలన్న ఆలోచనతో ముందుకు వచ్చారు. ఎట్టకేలకు వారు బెంట్లీ ఎస్యూవీ అయిన బెంటేగా తో ముందుకు వచ్చారు. ఇది ఈ ఆటో దిగ్గజం యొక్క మొదటి ఎస్యూవీ మరియూ ఒక 6-లీటర్ వ్12 భారీ ఇంజినుతో "వేగవంతమైన, అత్యంత శక్తివంతమైన, విలాసవంతమైన మరియూ అత్యంత ప్రత్యేకమైన ఎస్యూవీ" గా పేరొందుతుంది. ఈ కారు త్వరలోనే 2015 ఫ్రాంక్ఫర్ట్ మోటర్ షో లో విడుదల అవుతుంది.

బెంట్లీ వారు సరికొత్త 6.0-లీటర్ వ్12 ట్విన్-టర్బో చార్జ్డ్ ఇంజినుని వారి ఎస్యూవీ కోసమై అభివృద్ది చేసారు. ఇది 608పీఎస్ ని మరియూ 900ఎనెం యొక్క టార్క్ ని ఉత్పత్తి చేయగలదు. ఇందులో 8-స్పీడ్ ట్రాన్స్మిషన్ ఉండటంతో ఈ శక్తి అన్ని వీల్స్ కి అందుతుంది. ఇది ఏమి చేస్తుంది అంటే, దీని పోటీని బద్దలు కొడుతూ గంటకి 100 కీ.మీ వేగాన్ని కేవలం 4.1 సెకనుల్లో చేరుకుంటుంది మరియూ గంటకు 301 కీ.మీ గరిష్ట వేగాన్ని చేరగలదు.

పైగా, ఈ ఇంజిను కి సిలిండర్ డీ-ఆక్టివేషన్, ఆటోమాటిక్ కోస్టింగ్ మరియూ ఒక స్టార్ట్-స్టాప్ సిస్టము కలిగి ఉన్నాయి. ఈ ఎస్యూవీ డీజిల్ లో మరియూ హైబ్రీడ్ వేరియంట్ లలో త్వరలోనే అందుబాటులోకి రావొచ్చు. బెంట్లీ వారి డ్రైవింగ్ డైనమిక్స్ మోడ్ తో ఒక ఆప్షనల్ రెస్పాన్సివ్ ఆఫ్-రోడ్ సెట్టింగ్ ఉంటుంది మరియూ దీనికి 8 డ్రైవింగ్ మోడ్స్ తో డైల్ ద్వారా అందుబాటులో ఉంటుంది.

లోపలివైపు, బెంట్లీ మీరు ఊహించినటువంటి విధంగానే విలాశవంతమైన సెడాన్ గా మరియు మరింత ప్రయోజనాలతో ఉంది. ఈ బ్రాండ్ బెంటేగా వుడ్, మెటల్ మరియు లెథర్ తో కూడినటువంటి అంతర్భాగాలతో ప్రపంచంలో మునుపెన్నడూ లేనటువంటి అత్యుత్తమ ఆటోమొబైల్ ఇంటీరియర్ గా చెప్పబడుతుంది. బెంటేగా యొక్క 18-మార్గాలలో  సర్ద్దుబాటు చేయగల వెనుక సీట్లు మరియు లెదర్ ట్రింస్ కి 15 రంగు ఎంపికలు, హీటింగ్ తో 22-మార్గాలలో సర్దుబాటు ముందు సీట్లు, వెంటిలేషన్ మరియు మసాజ్ వ్యవస్థ ఇంకా చాలా లక్షణాలు ఉన్నాయి. ఈ ఎస్యువి, 60జిబి నిల్వా స్థలం మరియు 30 భాషలు కలిగినటువంటి ఒక 8-అంగుళాల టచ్స్క్రీన్ వ్యవస్థ డ్యాష్బోర్డ్ పైన కలిగి ఉంది. వెనుక ప్రయాణికుల కోసం 4జి తో 10.2-అంగుళాల ఆండ్రాయిడ్ టాబ్లెట్, వైఫై మరియు బ్లూటూత్ ని కలిగి ఉంది.

ధ్వని విషయానికి వస్తే, బెంట్లీ 18 స్పీకర్లు మరియు 'సూపర్ ట్విట్టర్ల' తో 1,950 వాట్లు కలిగిన "అత్యధిక ఆడియో ఫ్రీక్వెన్సీ" గల ఉన్నత శ్రేణి వ్యవస్థను అందిస్తుంది. బయటవైపు, బెంటేగా నాలుగు ఎల్ ఇడి హెడ్లైట్లు మరియు ఒక గ్లాస్ రూఫ్ తో బెంట్లీ రూపానికి సంతకం లా కనిపిస్తుంది. కారు కింద అల్యూమినియం తో రూపొందించినటువంటి 20 లేదా 22 అంగుళాల అలాయ్ వీల్స్ ఆప్షనల్ గా అందించబడుతుంది. స్టీల్ తో పోలిస్తే అల్యూమినియం తో తయారుచేయడం వలన  236 కిలోలు ఆదా చేయవచ్చు.

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your Comment పైన బెంట్లీ బెంటెగా 2015-2021

Read Full News

trendingకాంక్వెస్ట్ ఎస్యూవి

  • లేటెస్ట్
  • ఉపకమింగ్
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience