• English
  • Login / Register

ముసుగు లేకుండా కనిపించిన టాటా సఫారి ఫేస్ؚలిఫ్ట్-ఇంటీరియర్ వివరాలు

టాటా సఫారి కోసం shreyash ద్వారా జూలై 28, 2023 08:35 pm ప్రచురించబడింది

  • 5.5K Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

టాటా సఫారీ ఫేస్ؚలిఫ్ట్ క్యాబిన్ నవీకరించిన సెంటర్ కన్సోల్ మరియు మధ్యలో డిస్ప్లేతో టాటా అవిన్యా నుండి ప్రేరణ పొందిన 4-స్పోక్ స్టీరింగ్ వీల్ؚను పొందుతుంది

2024 Tata Safari spied

  • కొత్త సెంటర్ కన్సోల్ؚలో భాగంగా 2024 టాటా సఫారీ టచ్ؚస్క్రీన్ హౌసింగ్ కూడా సవరించబడవచ్చు.

  • ఈ SUV వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, 10.25-అంగుళాల టచ్ؚస్క్రీన్ మరియు పనోరమిక్ సన్ؚరూఫ్ؚలతో రావచ్చు.

  • దీని భద్రత కిట్ؚలో అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ మరియు ఆరు ఎయిర్ బ్యాగ్ؚలను ప్రామాణికంగా అందించవచ్చు. 

  • ప్రస్తుత సఫారీలో ఉన్నట్లుగానే 2-లీటర్ డీజిల్ ఇంజన్ؚను కొనసాగిస్తుంది.

  • 2023 ఆటో ఎక్స్ؚపోలో ప్రదర్శించబడిన 1.5-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ؚను కూడా 2024 టాటా సఫారి పొందవచ్చు.

  • వచ్చే సంవత్సరంలో దీని విక్రయాలు ఉండవచ్చు, ధర రూ.16 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభం కావచ్చు.

2024 ప్రారంభంలో విడుదల అవుతుందని ఆశిస్తున్న టాటా సఫారీ ఫేస్ؚలిఫ్ట్ విడుదలకు ముందు పూర్తిగా పరీక్షించబడుతోంది. ఇంతకు ముందు దీని నవీకరించిన ఇంటీరియర్ కెమెరాకు చిక్కగా, తాజా రహస్య చిత్రాలు ఎటువంటి ముసుగు లేకుండా దిని ఇంటీరియర్‌ను చూపుతున్నాయి, కొత్త సెంటర్ కన్సోల్ మరియు స్టీరింగ్ వీల్ డిజైన్ؚను స్పష్టంగా ఈ చిత్రాలలో చూడవచ్చు.

రీడిజైన్ చేసిన సెంటర్ కన్సోల్

Tata Safari Facelift Interior

సెంటర్ కన్సోల్ؚకు అందించిన ముఖ్యమైన అప్ؚడేట్ؚలను ఈ చిత్రాలలో చూడవచ్చు, ఇందులో రీస్టైల్ చేసిన సెంటర్ AC వెంట్ؚలు మరియు 10.25-అంగుళాల టచ్ؚస్క్రీన్ యూనిట్ కోసం సవరించిన హౌసింగ్ కూడా ఉండవచ్చు. దీని క్రింద కొత్త క్లైమేట్ కంట్రోల్ సెట్అప్ ఉంది, ఇది హాప్టిక్ కంట్రోల్ؚలతో వస్తుందని అంచనా.

చిత్రాలలో కనిపించిన మరొక ముఖ్యమైన విషయం, టాటా అవిన్యా కాన్సెప్ట్ నుండి ప్రేరణ పొందిన పూర్తిగా కొత్తదైన 4-స్పోక్ؚల స్టీరింగ్ వీల్. ఈ వీల్ మధ్యలో డిస్ప్లేను కలిగి ఉంటుంది, బహుశా ప్రకాశించే టాటా లోగో మరియు అదనపు డ్రైవింగ్ సమాచారాన్ని ఇందులో చూపవచ్చు. మునుపటి రహస్య చిత్రాలలో చూస్తినట్లు, కొత్త డ్రైవ్ మోడ్ సెలక్టర్ؚను కూడా పొందుతుంది, టాటా నెక్సాన్ EV మాక్స్ؚలో ఉన్నటు వంటి డిస్ప్లే ఉండవచ్చు. అంతేకాకుండా దాని వెనుక, ఒక కొత్త గేర్ సెలక్టర్ కూడా కనిపిస్తోంది. 

ఆశించగలిగిన ఫీచర్‌లు

Tata Safari cabin

2024 టాటా సఫారీ ప్రస్తుత వర్షన్ నుండి అనేక ఫీచర్‌లను కొనసాగిస్తుంది, వీటిలో డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే, 9-స్పీకర్ JBL సౌండ్ సిస్టమ్, వైర్ؚలెస్ ఫోన్ ఛార్జర్, ఎయిర్ ప్యూరిఫయ్యర్, అంబియాంట్ లైటింగ్ؚతో పనోరమిక్ సన్ؚరూఫ్, 6-వే పవర్-అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్, వెంటిలేటెడ్ ముందు మరియు మధ్య వరుస సీట్లు (6-సీటర్ కాన్ఫిగరేషన్ؚలో మాత్రమే మధ్య వరుస సీట్లు ఉంటాయి) ఉంటాయి. 

ప్రస్తుత సఫారిలో ఇప్పటికే ఫార్వర్డ్-కొలిజన్ వార్నింగ్, బ్లైండ్-స్పాట్ మానిటరింగ్, ఆటో ఎమర్జెన్సీ బ్రేకింగ్ వంటి అడ్వాన్సెడ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ (ADAS) ఫీచర్‌లతో వస్తుంది. ఈ నవీకరణలో సఫారి అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ మరియు ఆరు ఎయిర్ బ్యాగ్ؚలను ప్రామాణికంగా పొందవచ్చు. ఇందులో కొనసాగించే భద్రత ఫీచర్‌లలో ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS) మరియు 360-డిగ్రీల కెమెరా ఉండవచ్చు. 

ఇది కూడా చదవండి: మరొకసారి కనిపించిన టాటా నెక్సాన్ ఫేస్ లిఫ్ట్ టెస్ట్ మోడల్ 

పవర్ؚట్రెయిన్ పరిశీలన

Tata Safari engine

నవీకరించిన SUV, ప్రస్తుత మోడల్ؚలో ఉన్న 2-లీటర్ డీజిల్ ఇంజన్ؚను నిలుపుకోవచ్చు (170PS మరియు 350Nm). ఈ యూనిట్ 6-స్పీడ్ మాన్యువల్ లేదా 6-స్పీడ్ ఆటోమ్యాటిక్ ట్రాన్స్ؚమిషన్ؚతో జోడించబడుతుంది.

అప్‌డేట్ చేయబడిన సఫారీని టాటా కొత్త 1.5-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ؚతో అందించవచ్చు, ఇది 2023 ఆటో ఎక్స్ؚపోలో ప్రదర్శించబడింది. ఈ ఇంజన్ 170PS మరియు 280Nmలను విడుదల చేస్తుంది, మరియు DCT ట్రాన్స్ؚమిషన్ؚతో జోడించబడవచ్చు.

అంచనా ధర మరియు పోటీదారులు 

నవీకరించిన టాటా సఫారి ప్రారంభ ధర రూ.16 లక్షలు (ఎక్స్-షోరూమ్) ఉంటుందని అంచనా. ఇది MG హెక్టార్ ప్లస్, మహీంద్రా XUV700 మరియు హ్యుందాయ్ ఆల్కాజార్ؚలతో పోటీని కొనసాగిస్తుంది.

చిత్రం మూలం

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your Comment on Tata సఫారి

Read Full News

సరిపోల్చడానికి & పరిశీలించడానికి ఒకే లాంటి కార్లు

*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర

ట్రెండింగ్‌లో ఉంది ఎస్యూవి కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience