టాటా నెక్సన్ గ్లోబల్ ఎన్ క్యాప్ క్రాష్ టెస్ట్ లో 5- స్టార్ రేటింగ్ను స్కోర్ చేసింది
టాటా నెక్సన్ 2017-2020 కోసం dhruv ద్వారా ఏప్రిల్ 18, 2019 12:16 pm ప్రచురించబడింది
- 21 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
-
నెక్సాన్ రేటింగ్ ను పెంచడానికి, నిష్క్రియాత్మక భద్రతా సామగ్రిని అదనంగా అందించడం జరిగింది.
-
నెక్సాన్ ఐదు నక్షత్రాల రేటింగ్ ను సాధించడానికి సైడ్ ఇంపాక్ట్ క్రాష్ పరీక్ష పాస్ అవ్వడం కూడా అవసరం.
-
ద్వంద్వ ఎయిర్బ్యాగ్లు మరియు ఏబిఎస్ లు నెక్సాన్ యొక్క అన్ని రకాల వేరియంట్ లలో ప్రామాణికంగా అందించబడతాయి.
ఈ సంవత్సరం మొదట్లో, గ్లోబల్ ఎంక్యాప్ వారు దాని # సఫెర్కార్స్ ఇండియా ప్రచారంలో భాగంగా టాటా నెక్సన్ ఎస్యువి ని క్రాష్ టెస్ట్ చేసింది. అప్పట్లో, నెక్సాన్ వయోజన ప్రయాణికుల రక్షణ విభాగంలో నాలుగు నక్షత్రాలను సాదించింది. టాటా నెక్సాన్ లో రెండు మార్పులు చేసినప్పటి నుంచి, ఇప్పటి ఎస్యూవి వయోజన యజమానుల కు రక్షణను కల్పిస్తూ ఐదు నక్షత్రాల రేటింగ్ను అందించింది.
వయోజన యజమానుల రక్షణ ప్రకారం నాలుగు నక్షత్రాల నుండి ఐదు నక్షత్రాల రేటింగ్ కు పెరిగింది, అయితే, పిల్ల రక్షణ కోసం అదే మూడు నక్షత్రాల రేటింగ్ ను కలిగి ఉంది. నెక్సాన్ యొక్క అన్ని రకాల వేరియంట్ లలో డ్రైవర్ కు మరియు ముందు ప్రయాణీకుడి కోసం సీట్ బెల్ట్ రిమైండర్ ప్రామానికంగా అందించబడింది దినీ కారణంగా (ఎస్బీఅర్) రేటింగ్ పెరిగింది అని చెప్పవచ్చు.
టాటా నెక్సన్ |
ముందు రేటింగ్ |
ప్రస్తుత రేటింగ్ |
అడల్ట్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ |
4 స్టార్లు |
5 స్టార్లు |
చైల్డ్ ఆక్యుపెంట్ ప్రొటక్షన్ |
3 స్టార్లు |
3 స్టార్లు |
నెక్సాన్, రక్షణ కల్పించడానికి యుఎన్95 సైడ్ క్రాష్ తెస్ట్ కూడా పాస్ అయ్యింది. ఈ పరీక్ష డిసెంబర్ 7, 2018 తరువాత తయారు చేయబడిన నెక్సన్ యొక్క అన్ని యూనిట్లకు చెల్లుతుంది. టాటా నెక్సాన్ యొక్క అన్ని వేరియంట్లలో ఏబిఎస్ మరియు ద్వంద్వ ఎయిర్బ్యాగ్ లు ప్రామాణికంగా అందించబడుతున్నాయి, అయితే ఐసోఫిక్స్ చైల్డ్ సీటు మౌట్లు, ఎక్స్జెడ్ + మరియు ఎక్స్ జెడ్ ఏ + వేరియంట్ లకు మాత్రమే పరిమితం చేయబడ్డాయి.
భారతదేశంలో ప్రయాణీకుల కార్ల కోసం పెరుగుతున్న భద్రతా రేటింగ్కు అనుగుణంగా గ్లోబల్ ఎన్ క్యాప్ యొక్క పరీక్ష విజయవంతంగా ముగిసినందున ఎక్కువ విక్రయాలను చోటు చేసుకుంది. దేశంలో కార్ల తయారీదారులు ఇప్పుడు సురక్షితమైన కార్లను తయారు చేస్తున్నారు. ప్రమాదంలో ఉన్నవారికి మంచి భద్రత కల్పించబడుతుంది.
మరింత చదవండి: నెక్సాన్ ఏఎంటి