• English
  • Login / Register

టాటా నెక్సాన్ పెట్రోల్ వర్సెస్ డీజిల్ - రియల్- వరల్డ్ మైలేజ్ పోలిక

టాటా నెక్సన్ 2017-2020 కోసం dinesh ద్వారా జూన్ 21, 2019 10:23 am ప్రచురించబడింది

  • 23 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

ఊహించినట్లుగా, డీజిల్ నెక్సాన్ దాని పెట్రోల్ కౌంటర్ కంటే పొదుపైన వాహనంగా ఉంటుంది. కానీ ఎంత పొదుపుగా ఉంటుందనేది తెలుసుకుందాం?

Tata Nexon Petrol vs Diesel

టాటా లైనప్లో అత్యధికంగా అమ్ముడవుతున్న రెండవ కారు - నెక్సాన్. ఇది నెలకు సగటున 5,000 యూనిట్ల అమ్మకాలు జరుపుతుంది. ఇది భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన సబ్ -4 మీటర్ల ఎస్యూవి లలో ఒకటి. పెట్రోల్ మరియు డీజిల్ వేరియంట్ల ధరలను చూసినట్లయితే, వరుసగా రూ .6.23 లక్షలు మరియు రూ 7.26 లక్షల రూపాయలతో ప్రారంభమవుతుండటంతో, నెక్సాన్ దేశంలో అత్యంత సరసమైన కాంపాక్ట్ ఎస్యూవీ మరియు బడ్జెట్లో హై-రైడర్ కోసం చూస్తున్న వారికి మంచి ఎంపిక (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్ ఎక్స్ -షోరూమ్ ఢిల్లీ).

  • మారుతి విటారా బ్రెజ్జా వర్సెస్ హోండా డబ్ల్యూ ఆర్- వి వర్సెస్ టాటా నెక్సాన్: రియల్- వరల్డ్ పెర్ఫార్మెన్స్ & మైలేజ్

Tata Nexon

నెక్సాన్- 1.2 పెట్రోల్ మరియు 1.5 డీజిల్ ఇంజన్ ఎంపికలతో అందుబాటులో ఉంది ముందుగా 1.2- లీటర్ పెట్రోల్ ఇంజన్ విషయానికి వస్తే, 3- సిలిండర్ యూనిట్. ఇది 110 పిఎస్ గరిష్ట శక్తిని మరియు 170 ఎన్ఎమ్ గల గరిష్ట టార్క్ లను విడుదల చేస్తుంది. మరోవైపు, డీజిల్ ఇంజన్ అయిన 1.5- లీటర్ ఇంజన్ విషయానికి వస్తే, 4- సిలిండర్ యూనిట్. ఇది 110 పిఎస్ పవర్ ను మరియు 250 ఎన్ఎమ్ గల గరిష్ట టార్క్ ను విడుదల చేస్తుంది. ఈ రెండు ఇంజన్లు, 6- స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ లేదా 6- స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ లతో జత చేయబడి ఉంటాయి. అందుబాటులో ఉన్న ఇంజిన్ ఎంపికలతో మేము నెక్సాన్ను పరీక్షించాము మరియు ఇక్కడ మేము కనుగొన్న విషయాలను మీతో పంచుకుంటాము.

ఇది కూడా చదవండి: టాటా నెక్సాన్ పెట్రోల్ వర్సెస్ డీజిల్: రియల్- వరల్డ్ పెర్ఫార్మెన్స్ పోలిక

 

క్లెయిమ్ చేసిన మైలేజ్

పరీక్షించిన మైలేజ్ (సిటీలో)

పరీక్షించిన మైలేజ్ (రహదారిలో)

టాటా నెక్సాన్ పెట్రోల్

17 కెఎంపిఎల్  

14.03 కెఎంపిఎల్

17.89 కెఎంపిఎల్

టాటా నెక్సాన్ డీజిల్

21.5 కెఎంపిఎల్

16.80 కెఎంపిఎల్

23.97 కెఎంపిఎల్

 తయారీదారుడు కధనం ప్రకారం, నెక్సాన్ యొక్క పెట్రోల్ మరియు డీజిల్ వేరియంట్ల మైలేజీలను వరుసగా చూసినట్లయితే 17 కిలోమీటర్లు మరియు 21.5 కిలోమీటర్ల మైలేజీ గా ఉన్నాయి. అయినప్పటికీ, వాస్తవ ప్రపంచ పరిస్థితులలో పరీక్షించినప్పుడు, నగరంలో వారి మైలేజ్ గణాంకాలు తక్కువగా ఉన్నాయి, ఇక్కడ పెట్రోల్ నెక్సాన్ 14.03 కిలోమీటర్లు తిరిగి ఇవ్వగా, డీజిల్ నెక్సాన్ 16.80 కిలోమీటర్ల మైలేజీని నిర్వహించింది. ఈ వాహనం యొక్క మైలేజీను రహదారిలో చూసినట్లయితే పెట్రోల్ ఎస్యూవీ 17.89 కిలోమీటర్ల మైలేజీని, డీజిల్ ఎస్యువి 23.97 కిలోమీటర్ల మైలేజీ ని అందిస్తున్నాయి, ఈ రెండు వాహనాలు తమ దావా వేసిన గణాంకాలను అధిగమించారు. ఊహించినట్లుగా, డీజిల్ నెక్సాన్ దాని పెట్రోల్ కౌంటర్ కంటే పొదుపైన కారు గా ఉంది, ఇది నగరంలో 2.77 కిలోమీటర్లు మరియు రహదారి పై 6.08 కిలోమీటర్ల ఎక్కువ మైలేజ్ ను అందిస్తుంది.

Tata Nexon

ఏఆర్ఏఐ పరీక్షించిన గణాంకాల ప్రకారం, నెక్సాన్ దాని తరగతిలో అత్యంత పొదుపు గల ఎస్యువి కాదు. ఇది, 24.3 కిలోమీటర్ల మైలేజ్ కలిగిన డీజిల్ ఇంజన్ విటారా బ్రెజ్జా కంటే అత్యంత ఇంధన సామర్థ్యం కలిగిన కారు కాదు, దీని తరువాత స్థానంలో ఫోర్డ్ ఎకోస్పోర్ట్ 23 కిలోమీటర్ల వద్ద ఉంది. పెట్రోల్ సబ్ -4 మీటర్ల ఎస్యూవిల విషయానికి వస్తే, ఎకోస్పోర్ట్ మరియు నెక్సాన్ వాహనాలు 17 కిలోమీటర్లతో ఒకేలా క్లెయిమ్ చేయబడ్డాయి. మరోవైపు, విటారా బ్రెజ్జా ప్రస్తుతానికి పెట్రోల్ ఇంజిన్ తో అందుబాటులో లేదు. ఫిబ్రవరిలో విడుదల కానున్న ఎక్స్యూవి 300 తో మహీంద్రా రంగంలోకి దిగనుంది మరియు ఇది కొత్త 1.2- లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ మరియు 1.5- లీటర్ డీజిల్ ఇంజిన్ లతో శక్తిని ఇవ్వనుంది.

ఇది కూడా చదవండి: ప్రొడక్షన్- స్పెక్ టాటా 45 ఎక్స్ బహిర్గతం; ఇది ఎలైట్ ఐ 20, బాలెనో లకు ప్రత్యర్థి

మరింత చదవండి: నెక్సాన్ ఆన్ రోడ్ ధర

was this article helpful ?

Write your Comment on Tata నెక్సన్ 2017-2020

2 వ్యాఖ్యలు
1
K
kawal s
May 19, 2021, 11:29:59 PM

Nexon real milegeage City 11.00, highway 13.10

Read More...
    సమాధానం
    Write a Reply
    1
    C
    caji d'cruz
    Aug 1, 2019, 12:26:11 PM

    Nexon Petrol in city giving 14 km/l is nonsense !

    Read More...
      సమాధానం
      Write a Reply

      ట్రెండింగ్‌లో ఉంది ఎస్యూవి కార్లు

      • లేటెస్ట్
      • రాబోయేవి
      • పాపులర్
      ×
      We need your సిటీ to customize your experience