టాటా నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్ బాగా దగ్గరగా మా కంట పడింది; 2020 ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించబడుతుందా?
టాటా నెక్సన్ 2017-2020 కోసం dhruv ద్వారా అక్టోబర్ 21, 2019 04:46 pm ప్రచురించబడింది
- 39 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
టాటా యొక్క సబ్ -4 మీటర్ SUV కొత్త సొగసైన హెడ్ లాంప్స్‌తో మనకి కనపడనున్నది
- నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్ రీ-డిజైన్ చేసిన ఫ్రంట్ ఎండ్‌ను కలిగి ఉంది, ఇది ప్రస్తుత మోడల్ కంటే చాలా పదునుగా కనిపిస్తుంది.
- టెస్ట్ మ్యూల్ ప్రస్తుత-జెన్ నెక్సాన్ వలె అదే అల్లాయ్ వీల్స్ ని ధరించింది.
- నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్ BS6 ఇంజిన్ తో వస్తుందని ఆశిస్తున్నాము.
- ఇది 2020 లో జరిగే ఆటో ఎక్స్‌పో లో ప్రవేశించాలి.
టాటా నెక్సాన్ కు ఫేస్ లిఫ్ట్ ఇవ్వడానికి కృషి చేస్తోంది మరియు మరోసారి మేము దాని టెస్ట్ మ్యూల్ ను గుర్తించాము. మేము అన్ని కోణాల నుండి కారును చక్కగా చూడగలిగాము మరియు ఫేస్‌లిఫ్టెడ్ నెక్సాన్ నుండి మీరు ఆశించేటువంటి మార్పులు ఏమున్నాయో ఇక్కడ చూడవచ్చు.
కారు ముందు భాగంలో ఇప్పుడు పదునైన స్టైలింగ్ ఉంది, దీని వలన ఇది చూడడానికి బాగా అగ్రసివ్ గా కనిపిస్తుంది. హెడ్‌ల్యాంప్‌లు సొగసైనవిగా మారాయి మరియు గ్రిల్ కూడా ప్రస్తుతం ఉన్న హనీకోంబ్ డిజైన్ నుండి కొద్దిగా మారబోతుంది.
దీని యొక్క ప్రొఫైల్ ని గనుక మనం చూసినట్లయితే, ఫేస్‌లిఫ్టెడ్ నెక్సాన్ యొక్క టెస్ట్ మ్యూల్ ఫ్రంట్ ఎండ్ మినహాయిస్తే, కరెంట్-జెన్ నెక్సాన్ లాగా ఉంది. ఇది విలక్షణమైన కొత్త హెడ్‌ల్యాంప్‌ను పొందుతుంది. టెస్ట్ మ్యూల్‌లోని అల్లాయ్ వీల్స్ ప్రస్తుత కారు మాదిరిగానే ఉంటాయి.
వెనుక వైపు, టెయిల్ లాంప్ ప్రస్తుత సెటప్ మాదిరిగానే కనిపిస్తుంది, కాని మొత్తం కారు వెనుక భాగంలో కామోలో కప్పబడి ఉంది. అందువల్ల, టాటా వెనుక బంపర్ డిజైన్ ను సర్దుబాటు చేస్తుందని మేము అనుమానిస్తున్నాము.
ఇది కూడా చదవండి: టాటా నెక్సాన్ EV డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ని పొందనుంది, లాంచ్ ఫిబ్రవరి 2020 లో ఉంటుందని అంచనా
మేము లోపలి భాగాన్ని చూడలేకపోయినప్పటికీ, టాటా పార్ట్-డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, కొత్త స్టీరింగ్ వీల్, క్రూయిజ్ కంట్రోల్, యాంబియంట్ లైటింగ్ మరియు మరికొన్ని అదనపు లక్షణాలను అందిస్తుందని మేము ఆశిస్తున్నాము. ఎందుకంటే ఈ ఫీచర్లు రాబోయే ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ ఆల్ట్రోజ్ లో లభిస్తాయి.
ఫేస్‌లిఫ్టెడ్ నెక్సాన్ 2020 ఆటో ఎక్స్‌పోకు చేరుకుంటుంది మరియు 1.2 లీటర్ టర్బో-పెట్రోల్ లేదా 1.5-లీటర్ డీజిల్ నుండి ఎంచుకునే అవకాశం ఉంది. అయితే, ఈ రెండు ఇంజన్లు ఆ సమయానికి BS6 ఉద్గార ప్రమాణాలకు అనుగుణంగా ఉంటాయని మేము ఆశిస్తున్నాము.
ఫేస్‌లిఫ్టెడ్ నెక్సాన్‌కు BS 6 నిబంధనలకు అనుగుణంగా రూ .20,000 నుంచి లక్ష రూపాయల ప్రీమియం ధర ఉంటుందని మేము ఆశిస్తున్నాము. అలాగే, మీరు నెక్సాన్ యొక్క ఎలక్ట్రిక్ వెర్షన్ కోసం చూస్తున్నట్లయితే, అది 2020 మొదటి భాగంలో అయిపోతుంది మరియు ఫేస్‌లిఫ్టెడ్ నెక్సాన్ పై ఆధారపడి ఉంటుంది.
మరింత చదవండి: టాటా నెక్సాన్ AMT
0 out of 0 found this helpful