కొత్త డార్క్ ఎడిషన్ؚను పొందనున్న టాటా నెక్సాన్ EV మాక్స్

టాటా నెక్సన్ ఈవి మాక్స్ 2022-2023 కోసం tarun ద్వారా ఏప్రిల్ 18, 2023 10:34 am ప్రచురించబడింది

  • 49 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

సాధారణ నెక్సాన్ EV మాక్స్‌తో పోలిస్తే డార్క్ ఎడిషన్ؚలో కూడా కొన్ని ప్రత్యేకమైన ఫీచర్‌లు ఉంటాయి

Tata Nexon EV Max Dark Edition

  • డార్క్ ఎడిషన్ కేవలం నెక్సాన్ EV మాక్స్ XZ+ లక్స్ వేరియెంట్ؚలో మాత్రమే లభిస్తుంది. 

  • మిడ్ؚనైట్ బ్లాక్ షేడ్, చార్ కోల్ గ్రే ఆలాయ్‌లు మరియు పూర్తి నలుపు రంగు క్యాబిన్ؚతో వస్తుంది. 

  • కొత్త ఫీచర్‌లలో 10.25-అంగుళాల టచ్ؚస్క్రీన్ సిస్టమ్ మరియు వైర్ؚలెస్ అండ్రాయిడ్ ఆటో మరియు యాపిల్ కార్ؚప్లే కూడా ఉంటాయి. 

  • ప్రస్తుత ఫీచర్‌లలో ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, క్రూజ్ కంట్రోల్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్‌లు, ESC మరియు ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ వంటివి ఉంటాయి. 

  • 453 కిలోమీటర్‌ల క్లెయిమ్ చేసిన పరిధితో ఒకే విధమైన 40.5kWh బ్యాటరీ ప్యాక్ؚతో వస్తుంది. 

ప్రజాదరణ పొందిన తమ డార్క్ ఎడిషన్ శ్రేణికి టాటా మరొక మోడల్‌ను పరిచయం చేసింది, నెక్సాన్ EV మాక్స్ ఈ సమూహంలో కొత్తగా చేరింది. నెక్సాన్ EV ప్రైమ్ ఇప్పటికే పూర్తి నలుపు రంగు ఎంపికతో వస్తుండగా, మాక్స్ టాప్-స్పే XZ+ లక్స్ వేరియెంట్‌లలో కూడా ఈ రంగుల ఎంపిక అందుబాటులో ఉంటుంది. నెక్సాన్ EV మాక్స్ؚ ప్రస్తుతం రూ.16.49 లక్షల నుండి రూ.19.54 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్) ధరతో అందిస్తున్నారు. 

ధర తనిఖీ

Tata Nexon EV Max Dark Edition

వేరియెంట్ 

డార్క్ 

రెగ్యులర్ 

తేడా

XZ+ లక్స్ 

రూ.19.04 లక్షలు 

రూ. 18.49 లక్షలు 

రూ. 55,000

XZ+ లక్స్ 7.2kW AC ఛార్జర్

రూ.19.54 లక్షలు 

రూ. 18.99 లక్షలు 

రూ. 55,000

అన్నీ ఎక్స్-షోరూమ్ ధరలు 

తన సంబంధిత వేరియెంట్ కంటే డార్క్ ఎడిషన్ రూ.55,000 ఎక్కువ ధరతో వస్తుంది. XZ+ వేరియెంట్‌తో పోలిస్తే, ఇది రూ.2.05 లక్షల వరకు అధికంగా ఉంటుంది. 

కొత్త ఫీచర్‌లు

నెక్సాన్ EV మాక్స్ؚకు కొత్త డార్క్ ఎడిషన్ అందించే భారీ జోడింపులో భాగంగా, ఈ కారు తయారీదారు వైర్ؚలెస్ అండ్రాయిడ్ ఆటో మరియు యాపిల్ కార్ ప్లేతో కొత్త 10.25-అంగుళాల టచ్ؚస్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ మరియు ఆరు ప్రాంతీయ భాషలలో 180 కంటే ఎక్కువ వాయిస్ కమాండ్‌లతో వస్తుంది. ఇది టాప్-స్పెక్ వేరియెంట్ కాబట్టి ఎలక్ట్రిక్ సన్ؚరూఫ్, రెయిన్-సెన్సింగ్ వైపర్ؚలు, హైట్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్‌లు, వైర్ؚలెస్ ఫోన్ ఛార్జర్, క్రూజ్ కంట్రోల్ వంటి ఫీచర్‌లను పొందుతుంది. ఇది ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ؚలో 7-అంగుళాల డిస్ప్లే, రిమోట్ ఫంక్షన్‌లతో కనెక్టెడ్ కార్ ఫీచర్‌లను కూడా పొందుతుంది.

Tata Nexon EV Max Dark Edition

డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగ్ؚలు, వెనుక పార్కింగ్ కెమెరా, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రాం, ట్రాక్షన్ కంట్రోల్, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, మరియు టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ؚలు భద్రతా ఫీచర్‌లలో ఉంటాయి. 

ఎక్స్ؚటీరియర్ 

నెక్సాన్ EV మాక్స్ కూడా ఇతర డార్క్ ఎడిషన్ మోడల్‌లలో పొందే సాధారణ అప్‌డేట్ؚలు అన్నిటినీ పొందనుంది. ఇది ఇప్పుడు మిడ్‌నైట్ బ్లాక్ రంగుؚతో వస్తుంది మరియు గ్రిల్ కింద, విండో లైన్ పైన సాటిన్ బ్లాక్ స్ట్రిప్, చార్ؚకోల్ గ్రే అలాయ్ మరియు ఫెండర్ؚలపై “#డార్క్” బ్యాడ్జ్ؚలను కలిగి ఉంటుంది. ICE-ఆధారిత నెక్సాన్ మరియు EV మధ్య తేడాను గమనించే విధంగా బ్లూ యాక్సెంట్ؚలను కలిగి ఉంటుంది.

Tata Nexon EV Max Dark Edition

ఇంటీరియర్ 

మాక్స్ డార్క్ ఎడిషన్ క్యాబిన్ పూర్తి నలుపు రంగు థీమ్ؚతో, డ్యాష్‌బోర్డుపై మెరిసే బ్లాక్ ఫినిష్ؚతో వస్తుంది. లెదర్ సీట్‌లు మరియు డోర్ వేరియెంట్ؚలు కూడా ట్రై-యారో ఎలిమెంట్ؚలుతో నలుపు రంగును కూడా పొందనున్నాయి. ఇది సాధారణ వర్షన్ నలుపు రంగు మరియు గోధుమరంగు థీమ్ స్థానంలో వస్తుంది. ఇక్కడ కూడా, ఇది ఎలక్ట్రిఫైడ్ కారు అని గుర్తించే విధంగా బ్లూ హైలైట్ؚను చూడవచ్చు. 

ఇది కూడా చదవండి: రూ.20 లక్షల కంటే తక్కువ ధరతో, పూర్తి నలుపులో ఉండే ఈ 7 కార్‌లతో మీ స్టైల్‌ؚను వ్యక్తీకరించండి 

బ్యాటరీ మరియు పరిధి 

మెకానికల్ పరంగా నెక్సాన్ EV మాక్స్ డార్క్ ఎడిషన్‌లో ఎటువంటి మార్పులు ఉండవు. ARAI క్లెయిమ్ చేసిన 453 కిలోమీటర్‌ల పరిధిని అందించే 40.5kWh బ్యాటరి ప్యాక్‌తో వస్తుంది. దీని ఎలక్ట్రిక్ మోటార్ 143PS పవర్ మరియు 250Nm టార్క్‌ను అందిస్తుంది, ఇది EV సున్నా నుండి 100kmph వరకు అందుకునేందుకు తొమ్మిది కంటే తక్కువ సెకన్‌ల సమయం పడుతుంది. ఎంచుకునేందుకు నాలుగు స్థాయిల రీజనరేటివ్ బ్రేకింగ్ మరియు మూడు డ్రైవ్ మోడ్ؚలు(ఈకో, సిటీ, స్పోర్ట్స్) మాక్స్‌లో ఉంటాయి.

Tata Nexon EV Max Dark Edition

7.2kW AC ఛార్జర్ؚతో (ప్రామాణికం కాదు), ఇది సుమారు 6.5 గంటలలో ఛార్జ్ అవుతుంది. 50kW DC ఫాస్ట్ ఛార్జర్ؚతో, నెక్సాన్ EV మాక్స్ సున్నా నుండి 80 శాతం టాప్అప్ కోసం సుమారుగా 56 నిమిషాలు పడుతుంది. 

పోటీదారులు 

ధర రూ.15.99 లక్షల నుండి రూ.18.99 లక్షల (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) వరకు ఉన్న మహీంద్రా XUV400, నెక్సాన్ EV మాక్స్ؚకు ఉన్న ఏకైక పోటీదారు మరియు సారూప్య పనితీరు, పరిధిని కలిగి ఉంటుంది. ఈ రెండు ఎలక్ట్రిక్ SUVలు హ్యుందాయ్ కోనా ఎలక్ట్రిక్ మరియు MG ZS EV వంటి వాటికి చవకైన ప్రత్యామ్నాయం. 

ఇక్కడ మరింత చదవండి: టాటా నెక్సాన్ EV మాక్స్ ఆటోమ్యాటిక్

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your Comment పైన టాటా నెక్సన్ EV మాక్స్ 2022-2023

Read Full News

explore similar కార్లు

ట్రెండింగ్‌లో ఉంది ఎలక్ట్రిక్ కార్లు

  • పాపులర్
  • రాబోయేవి
×
We need your సిటీ to customize your experience