• English
  • Login / Register

టాటా నెక్సన్ కాంపాక్ట్ SUV మొట్ట మొదటిసారి బహిర్గతమైనది

టాటా నెక్సన్ 2017-2020 కోసం raunak ద్వారా డిసెంబర్ 08, 2015 05:00 pm ప్రచురించబడింది

  • 20 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

జైపూర్:

2016లో జరిగే ఇండియన్ ఆటో ఎక్స్-పో  లో నెక్సన్ యొక్క అన్ని పెట్రోల్ మరియు డీజిల్ వేరియెంట్ లను బహిర్గతపరచగలమని టాటా కంపెనీ ఆశిస్తుంది.

2014 ఆటో ఎక్స్-పో  లో టాటా తెలిపిన మొదటి కాన్సెప్ట్ కారు, నెక్సన్ మొదటిసారి కనిపించింది. టాటా తమ మొట్ట మొదటి కాంప్యాక్ట్ SUVఅయిన నెక్సన్ ని టెస్ట్ చేయడం ప్రారంభించింది. ఈ వాహనము ఫోర్డ్ ఇకో -స్పోర్ట్, మహీంద్రా TUV-౩00 మరియు కొత్తగా రానున్న మారుతి యొక్క SUVతో పోటీ పడనుంది. 2016లో జరిగే ఆటో ఎక్స్-పో లో టాటా దీనిని ప్రదర్శనకి ఉంచే అవకాశం ఉంది,అయితే 2016 రెండవ అర్ధబాగంలో ఈ వాహనమును లాంచ్ చేసే అవకాశం ఉంది. కానీ దీని అధికారిక పేరును కంపెనీ ఇంకా ప్రకటించలేదు. ఇప్పటి వరకు అయితే దీనిని నెక్సన్ గా పరిగణిద్దాం! 

ఈ టెస్ట్ వాహనము మొత్తం బయటకి కనిపించకుండా చేసినా, నెక్సన్  కాన్సెప్ట్ మరియు కొత్తగా వచ్చిన జైకా మోడల్ ల  నుండి కారు డిజైన్ మాత్రం అంచనా వేయగలం. టాటా యొక్క డిజైన్ " నెక్స్ట్ డిజైన్ ఫిలాసఫీ " గణనీయంగా పెరిగింది! నెక్సన్ మరియు జైకాలతో అది ఇంకా ముందుకి కొనసాగింది. నెక్సన్ కాన్సెప్ట్ వెర్షన్ తో పోలిస్తే ఈ కారు అనేక అంశాలను పంచుకుంది.  ఖచ్చితంగా ఇది  ఉత్తమంగా నిలుస్తున్న సబ్-4M SUVలలో మొదటిగా ఉంటుంది. అంతేకాకుండా నెక్సన్ క్యాబిన్ మల్టీ ఫంక్షనల్ స్టీరింగ్ వీల్, కనెక్ట్ నెక్స్ట్ టచ్ స్క్రీన్ సమాచార వినోద వ్యవస్థ వంటివాటిని కలిగి ఉంటుంది. వీటిని  జైకా,జెస్ట్ లలో కూడా పొందుపరిచారు.

ఇక ఇంజన్ ఎంపికలో ,నివేదిక ప్రకారం టర్బో చార్జ్డ్ వెర్షన్ యొక్క కొత్త అల్యూమినియం 1.2 లీటర్ పెట్రోల్ఇంజన్ తో మరియు డీజిల్ ఇంజన్ ల  రెవొటార్క్   కుటుంబం నుండి ఒక కొత్త 1.5-లీటర్ డీజిల్ ఇంజన్ తో  పాటు 1.05 లీటర్ డీజిల్  ఇంజన్ తో జైకా అందుబాటులో ఉంది. ఈ మోటార్ జెస్ట్ మరియు బోల్ట్ కార్ల యొక్క 1.2-లీటర్ రెవట్రొన్ ఇంజన్ కంటే చాలా శక్తివంతమైనది. ఈ డీజిల్ఇంజన్ 100bhp కంటే ఎక్కువ శక్తిని మరియు  గణనీయంగా 200NM టార్క్ ని అందించగలిగి రెనో డస్టర్ 110ps ని పోలి ఉంటుంది. ట్రాన్స్మిషన్  విషయానికొస్తే డీజిల్ వెర్షన్ లో 6-స్పీడ్ మ్యాన్యూవల్ సిస్టమ్,పెట్రోల్ వెర్షన్ లో 5-స్పీడ్ మ్యాన్యూవల్ సిస్టమ్ తో అందుబాటులో ఉంది. అయితే టాటా AMTఆప్షన్ ని అందిచే అవకాశం ఉంది,దానికోసం వేచి చూడండి.

సిఫార్సు చేయబడినవి: 

టాటా జికా లక్షణాలు మరియు నిర్దేశాలు బహిర్గతం

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

Write your Comment on Tata నెక్సన్ 2017-2020

Read Full News

ట్రెండింగ్‌లో ఉంది ఎస్యూవి కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience