మొదటి సారిగా టాటా కైట్ వారి ప్రకటన: ఇందులో లియోనెల్ మెస్సీ కనపడ్డారు
నవంబర్ 04, 2015 02:55 pm అభిజీత్ ద్వారా ప్రచురించబడింది
- 17 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
జైపూర్:
టాటా వారి రాబోయే హ్యాచ్‌బ్యాక్ అయిన కైట్ యొక్క అధికారిక ప్రకటనలో అంతర్జాతీయ ఎంబాసడర్ అయిన లియోనెల్ మెస్సీ కనపడటం జరిగింది. టాటా వారి #మేడ్ఆఫ్‌గ్రేట్ కార్యక్రమంలో భాగంగా ఈ ప్రకటన అంతర్జాతీయంగా ప్రదర్శింపబడుతోంది మరియూ కంపెనీకి అంతర్జాతీయ గుర్తింపుని పెంచనుంది.
ఈ వాహనం హ్యాచ్‌బ్యాక్ మరియూ సెడాన్ రూపాలలో లభిస్తూ, సెలెరియో, షెవ్రొలే, బీట్ వగైరాలతో తలపడనుంది. సెడాన్ విషయంలో ఎటువంటి పోటీ ప్రస్తుతానికి లేదు. ప్రకటనలో నారింజ రంగు కైట్ కనపడుతుంది. ఇందులో ముందు భాగం, హెడ్‌ల్యాంప్ క్లస్టర్, టెయిల్ ల్యాంప్స్ క్లస్టర్ మరియూ వెనుక వైపు డోర్ హ్యాండల్ వంటివి కనపడ్డాయి.
హెడ్‌ల్యాంప్ క్లస్టర్ కి నలుపు ట్విన్-పాడ్ తో వేరు హెడ్‌ల్యాంప్ మరియూ ఇండికేటర్లు ఉండగా, సిగ్నేచర్ టాటా గ్రిల్లుని చూడవచ్చు. టెయిల్-ల్యాంప్ యూనిట్ మరింత సమకాలీన శైలిలో ఉండి క్రింద రెడ్ లైట్ ఉంటుంది.
కారు ని ఇటలీ మరియూ యునైటెడ్ కింగ్‌డం లోని డిజైనింగ్ స్టూడియోలో నిర్మించి అంతర్జాతీయ ఉత్పత్తిగా అందించడం జరుగుతుంది. ఈ కారు ఆటో ఎక్స్‌పోలో ఆరంగ్రేటం అవుతుంది కానీ టాటా వారు ఇంకా 3 నెలలు ఉండగానే ప్రకటన అందిస్తున్నారు.
ఇప్పటికి అయితే కారు ఆకర్షణీయంగా కనపడుతోంది మరియూ టాటా వారు దీని ధర సరసంగానే నిర్ధారిస్తారని అంచనా. దీనిని రూ.3.5 నుండి 5.5 లక్షల ధరకి అందిస్తారని మా అంచనా.