• English
    • Login / Register

    టాటా కైట్ అధికారిక చిత్రణ బహిర్గతం

    నవంబర్ 16, 2015 05:38 pm nabeel ద్వారా ప్రచురించబడింది

    • 15 Views
    • ఒక వ్యాఖ్యను వ్రాయండి

    జైపూర్: ప్రకటన విడుదల అయిన వెంటనే, రాబోయే కైట్ హ్యాచ్‌బ్యాక్ యొక్క అధికారిక చిత్రణని టాటా వారు బహిర్గతం చేశారు. ఈ కారు హ్యాచ్‌బ్యాక్ ఇంకా సెడాన్ రూపంలో అందుబాటులో ఉంది. ఇవి సెలెరియో, వాగన్ ఆర్, షెవ్రొలే బీట్ వంటి వాటితో తలపడనున్నాయి. సెడాన్ కి మాత్రం ఎటువంటి పోటీ దాని విభాగంలో లేదు. టాటా వారు ధరను రూ. 3.5 నుండి 5.5 లక్షల పరిధిలో అందించనున్నారు. 

    ఈ కారు ఇటలీ ఇంకా యునైటెడ్ కింగ్‌డంలోని టాటా వారి డిజైన్ స్టూడియోలో తయారు చేయబడి, అంతర్జాతీయంగా అమ్మకానికి అందుబాటులో ఉంటుంది. ఈ హ్యాచ్‌బ్యాక్ 2016 ఆటో ఎక్స్‌పో లో ఆవిష్కారం అవ్వవలసి ఉండగా ప్రకటన రావడం కారణంగా, టాటా వారు విడుదల ఇంకాస్త ముందుగానే చేసే అవకాశం ఉంది. కైట్ ఎక్స్ఓ వేదిక ఆధారంగా నిర్మించబడి మరియూ టాటా వారి గుజరాత్ సదుపాయంలో నిర్మాణం పొందవచ్చును.  ప్రకటన లో టెయిల్ ల్యాంప్ డిజైన్ కొత్తగా ఉండి, బ్రేక్ లైట్ కి ఇప్పుడు క్లియర్ లెన్స్ అందించడం జరిగింది. హెడ్ లైట్ క్లస్టర్ కి ట్విన్-పాడ్ డిజైన్ ఉండి, ఇండికేటర్స్ కి వర్వేరు అమరికలు ఉంటాయి. గ్రిల్లు ఇతర మోడల్స్ మాదిరిగానే ఉన్నా, కాస్తా ఆకర్షణీయంగా ఉన్నాయి.  

    కైట్ యొక్క తాజా ప్రకటన లో టాటా వారి అంతర్జాతీయ రాయబారి అయిన లియోనెల్ మెస్సీ కనపడ్డారు. ఇది టాటా వారి మేడ్ ఆఫ్ గ్రేట్ అనే కార్యక్రమంలో భాగం.

    was this article helpful ?

    Write your Comment on Tata Kite Hatch

    కార్ వార్తలు

    ట్రెండింగ్‌లో ఉంది కార్లు

    • లేటెస్ట్
    • రాబోయేవి
    • పాపులర్
    ×
    We need your సిటీ to customize your experience