టాటా కైట్ 5 కాంపాక్ట్ సెడాన్ - చిత్రాల గ్యాలరీ!
ఫిబ్రవరి 05, 2016 12:14 pm raunak ద్వారా ప్రచురించబడింది
- 17 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
మైదానంలో పెద్ద మీడియా సిబ్బంది తో # first2expo- ఆటో ఎక్స్పో 2016 యొక్క విశేషాలని కార్దేకో అందరికీ విసృతంగా అందిస్తుంది.
టాటా కొనసాగుతున్న 2016 భారత ఆటో ఎక్స్పోలో కైట్ 5 కాంపాక్ట్ సెడాన్ ఉత్పత్తిని వెర్షన్ ని వెల్లడించింది. ఇది జైకా యొక్క కాంపాక్ట్ సెడాన్ కానీ సూక్ష్మ మార్పులు మరియు భిన్నమైన వెనుక భాగంతో ఆకర్షణీయంగా ఉంది. సాంకేతికంగా ఇది ఇండిగో ECS భర్తీ చేస్తుంది మరియు జెస్ట్ వాహనం యొక్క క్రింద స్థాయిలో ఉంది. కైట్ 5 ఈ కాంపాక్ట్ సెడాన్ యొక్క కోడ్ నేం గా ఉంది, ఈ వాహనం కూడా జైకా లా కొత్త నేం ని అందుకోగలదని ఆశించడమైనది.
ఈ వాహనం కొత్త డీజిల్ మరియు కొత్త పెట్రోల్ ఇంజిన్లను కలిగి ఉంది. ఈ ఇంజిన్లను టాటా సంస్థ జైకా వాహనానికి అందించింది. హ్యాచ్బ్యాక్ వలే డీజిల్ ఇంజిన్ 1.05 లీటర్ రెవోటార్క్ 3-సిలిండర్ ఇంజిన్ ని అందిస్తుంది. రెవొటార్క్ అనేది డీజిల్ ఇంజిన్ల యొక్క కొత్త ఫ్యామిలీ, ముందు చెప్పుకున్నట్టుగా టాటా దీనిని జైకాలో అందించింది. అయితే, 1.2 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ ఇంజిన్ రెవొటార్క్ ఫ్యామిలీ లో రెండవ ఇంజిన్. లక్షణాలు పరంగా, కైట్ 5 ఎక్కువగా జైకాలో ఉన్న ప్రతీదీ కలిగి ఉంది. అయితే, కైట్ 5 ప్రొజెక్టర్ హెడ్ల్యాంప్స్, 15-ఇంచ్ అలాయ్స్, ఒక పెద్ద స్క్రీన్ సమాచార వినోద వ్యవస్థ వంటి అదనపు లక్షణాలను కలిగి ఉంది.