• login / register

టాటా హారియర్ వేరియంట్స్ ఎక్స్ప్లెయిన్డ్: ఎక్స్ఈ, ఎక్స్ఎం, ఎక్స్టి, ఎక్స్జెడ్

published on మార్చి 07, 2019 10:29 am by sonny కోసం టాటా హారియర్

 • 17 సమీక్షలు
 • ఒక వ్యాఖ్యను వ్రాయండి

Tata Harrier Variants Explained: XE, XM, XT, XZ

ఎంతగానో ఎదురుచూస్తున్న టాటా ఫ్లాగ్షిప్ ఎస్యువి హారియర్, చిట్టచివరకు భారతదేశంలో ప్రవేశించింది. ఈ ఎస్యువి, ఎక్స్ఈ, ఎక్స్ఎం, ఎక్స్టి మరియు ఎక్స్జెడ్ వేరియంట్ లలో కొనుగోలుదారులకు అందుబాటులో ఉంది - ఈ టాటా హారియర్ ధర రూ. 12.69 లక్షల నుండి రూ .16.25 లక్షలు (ఎక్స్-షోరూమ్ ముంబై) ధరకే లభిస్తుంది. ఈ కారుకి, 6- స్పీడ్ మాన్యువల్ గేర్బాక్స్ తో జత చేయబడిన 2.0- లీటర్ డీజిల్ ఇంజిన్ తో పవర్ట్రెయిన్ ఎంపికతో మాత్రమే అందుబాటులో ఉంది. ఫియట్ ఆధారిత ఈ ఇంజిన్, గరిష్టంగా 140 పిఎస్ శక్తిని మరియు 350 ఎన్ఎం గల టార్క్ లను ఉత్పత్తి చేస్తుంది. ప్రతి వేరియంట్ వాటి ఫీచర్ల ద్వారా ధరల మధ్య తేడాను పరిమితం చేస్తుంది. ఇక్కడ కొన్ని విషయాలను మీకు అందించాము వాటిలో మీ అవసరాలకు సరిపోయే ఉత్తమమైనదాన్ని ఎంపిక చేసుకోండి.

రంగు ఎంపికలు

 • కాలిస్టో కోపర్
 • థర్మిస్టో గోల్డ్
 • ఆర్కుస్ వైట్
 • టెలిస్టొర్ గ్రే
 • ఏరియల్ సిల్వర్

Tata Harrier

ప్రామాణిక సేఫ్టీ కిట్

 • డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బాగ్స్
 • ఏబిఎస్ తో ఈబిడి
 • వెనుక పార్కింగ్ సెన్సార్లు
 • సీట్ బెల్ట్ రిమైండర్ (డ్రైవర్ మరియు సహ ప్రయాణీకుడు)
 • ఆటో డోర్ లాక్
 • పెరీమెట్రిక్ అలారం వ్యవస్థ

టాటా హారియర్ ఎక్స్ఈ: అన్ని ప్రాదమిక అంశాలను కలిగి ఉంటుంది; మధ్యస్థ పరిమాణం కలిగిన ఎస్యువి ఆకర్షణీయమైన ధరను కలిగి ఉంది.

ధర

ఎక్స్ ఈ

రూ. 12.69 లక్షలు

Tata Harrier

లైట్లు: హాలోజన్ ప్రొజక్టార్ హెడ్ల్యాంప్స్ మరియు బల్బ్- టైప్ డ్యూయల్ ఫంక్షన్ టర్న్ ఇండికేటర్స్, ఎల్ఈడి ఎలిమెంట్స్ తో కూడిన టైల్ ల్యాంప్స్.

ఎక్స్టీరియర్స్: ఇంటిగ్రేటెడ్ టర్న్ ఇండికేటర్స్ తో ఓఆర్విఎం లు, మరియు సైడ్ క్లాడింగ్.

కంఫర్ట్: టిల్ట్ మరియు టెలీస్కోపిక్- సర్దుబాటు స్టీరింగ్ వీల్, పవర్ విండోస్, మాన్యువల్ ఏసి తో రేర్ వెంట్స్, సర్దుబాటు ముందు మరియు వెనుక హెడ్ రెస్ట్లు, సన్గ్లాస్ మరియు అంబ్రెల్లా హోల్డర్, 4- మార్గాల్లో మాన్యువల్ సర్దుబాటు కలిగిన డ్రైవర్ సీట్లు

ఆడియో: అందుబాటులో లేదు

వీల్స్: 16 అంగుళాల స్టీల్ వీల్స్

రంగులు: ఓర్కుస్ వైట్లో మాత్రమే అందుబాటులో ఉంది.

ఇది కొనుగోలు చేయడానికి ఉత్తమమైనదేనా?

ఒక మధ్యస్థాయి ఎస్యూవి కొనడానికి చూస్తున్న ప్రజలకు, ఈ దిగువ శ్రేణి హారియర్ అనేక ప్రామాణిక భద్రతా లక్షణాలు మరియు ప్రాథమిక సౌకర్యాల సరసమైన మొత్తాలను కలిగి ఉంది. ఒక మూడవ వ్యవస్థ యూనిట్ వంటి ఆడియో వ్యవస్థ లేకపోవడం ఒక బాదాకరమైన విషయం అని చెప్పవచ్చు, ఇది తదుపరి వేరియంట్ నుండి అందుబాటులో ఉంటుంది. దానిని కొనుగోలు చేయడం కోసం ఒక లక్షల ధర తేడాతో అందుబాటులో ఉంది. కానీ ఇది తెలుపు రంగులో మాత్రమే కొనుగోలుదారులకు లభ్యమౌతుంది. ఈ ఎక్స్ ఈ వేరియంట్, కొనుగోలుదరులకు తక్కువ ఆకర్షణీయంగా కనబడుతుంది.

Tata Harrier Variants Explained: XE, XM, XT, XZ

టాటా హారియర్ ఎక్స్ఎం: దిగువ శ్రేణి వేరియంట్

ఎక్స్ఎం ధర:

రూ. 13.75 లక్షలు

ఎక్స్ఈ వేరియంట్ కు గల వ్యత్యాసం - రూ. 1.06 లక్షలు

ఎక్స్ఈ వేరియంట్ లో అందించబడిన అంశాల్తో పాటు ఈ క్రింది వాటిని అందిస్తుంది

సేఫ్టీ: ఇన్ఫోటేన్మెంట్ సిస్టమ్ పై ప్రదర్శనతో కూడిన వెనుక పార్కింగ్ సెన్సార్స్, ఫాలో మీ హోమ్- హెడ్ లాంప్స్, వెనుక వైపర్ మరియు వాషర్.

లైట్స్: ఫ్రంట్ ఫాగ్ లాంప్స్.

ఇంటీరియర్స్: ఏసి వెంట్ లపై సాటిన్ ఫినిషింగ్ మరియు డాష్బోర్డ్ పై అలాగే రేర్ షెల్ఫ్ పై క్రోమ్ చేరికలు.

సేఫ్టీ: రిమోట్ సెంట్రల్ లాకింగ్, విద్యుత్ తో సర్దుబాటయ్యే ఓఆర్విఎంలు, స్టీరింగ్ వీల్ పై నియంత్రణలు, 6- మార్గాలలో మాన్యువల్ గా సర్దుబాటయ్యే డ్రైవర్ సీటు, డ్రైవ్ మోడ్లు (ఎకో, స్పోర్ట్ మరియు సిటీ)

ఇన్ఫోటైన్మెంట్: 7 స్పీకర్లతో 7- అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ యూనిట్, ఆడియో ప్లే బ్యాక్ కోసం బ్లూటూత్ కనెక్టివిటీ.

రంగులు: కాలిస్టో కోపర్ లో అందుబాటులో లేదు.

Tata Harrier

ఇది కొనుగోలు చేయడానికి ఉత్తమమైనదేనా?

ఈ వేరియంట్, దిగువ శ్రేణి వేరియంట్ అయిన ఎక్స్ఈ కంటే ఒక లక్ష ఎక్కువ ఖరీదైనది, ఇది మరిన్ని అదనపు ఫీచర్లతో అందించబడే కారు. అవి వరుసగా, ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, ఫ్రంట్ ఫాగ్ లాంప్స్, డ్రైవ్ మోడ్లు, వెనుక వైపర్ మరియు వాషర్ వంటి అన్ని ఉపయోగకరమైన ఫీచర్లు అందించబడ్డాయి, కానీ ఈ కారుని ఇప్పటికీ పూర్తి ప్యాకేజీ కోసం తయారు చేయలేదు. ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఆపిల్ కార్ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో మద్దతును సులభతరం చేయదు మరియు ఓఆర్విఎం లు ఇప్పటికీ మానవీయంగా మాత్రమే ముడుచుకుంటాయి. మీరు తక్కువ బడ్జెట్లో ఉన్నట్లయితే, మీ కోసం హారియర్ యొక్క ఈ వేరియంట్ అన్నివిదాల మీకు కావలసిన అన్ని ప్రాథమిక సౌలభ్య లక్షణాలతో అందుబాటులో ఉంది.

Tata Harrier

టాటా హారియర్ ఎక్స్టి : అవసరమైన ఫీచర్లను అందిస్తుంది, కొనదగినది

ఎక్స్టి ధర:

రూ 14.95 లక్షలు

ఎక్స్ఎం కు, ఈ వేరియంట్ కు గల మద్య వ్యత్యాసం - రూ 1.25 లక్షలు

ఎక్స్ఎం వేరియంట్లో అందించబడిన అంశాలతో పాటు ఈ క్రింది అంశాలను అందిస్తుంది

సేఫ్టీ: రేర్ పార్కింగ్ కెమెరా, ఆటో హెడ్ల్యాంప్స్, వెనుక డిఫోగ్గర్.

లైట్లు: టర్న్ ఇండికేటర్లతో కూడిన ఎల్ఈడి డిఆర్ఎల్ఎస్ లు.

ఇంటీరియర్స్: డాష్బోర్డ్ పై ఫాక్స్ వుడ్ ఫినిషింగ్ మరియు సాఫ్ట్- టచ్ మెటీరియల్స్.

కంఫొర్ట్స్: పుష్- బటన్ స్టార్ట్ - స్టాప్, ఆటో క్లైమేట్ కంట్రోల్, విద్యుత్ తో మడవగలిగే మరియు సర్దుబాటయ్యే ఓఆర్విఎంలు, 8- మార్గాలలో మాన్యువల్ గా సర్దుబాటయ్యే డ్రైవర్ సీటు, క్రూజ్ కంట్రోల్, శీతలీకరణ గ్లోవ్ బాక్స్, వెనుక ఆర్మ్రెస్ట్ తో కప్ హోల్డర్లు మరియు రైన్ -సెన్సింగ్ వైపర్స్.

ఇన్ఫోటైన్మెంట్: 7- అంగుళాల టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ యూనిట్తో పాటు ఎనిమిది స్పీకర్లతో ఆపిల్ కార్ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో కంపాటబిలిటీ, వీడియో ప్లేబ్యాక్ యూఎస్బీ మరియు టాటాస్ కనెక్టినెట్ అప్లికేషన్ సూట్.

వీల్స్: 17 అంగుళాల అల్లాయ్ వీల్స్.

Tata Harrier

ఇది కొనుగోలు చేయడానికి ఉత్తమమైనదేనా?

మరోసారి ఈ వేరియంట్ కు మరియు దీని ముందు వేరియంట్ కు మధ్య గల వ్యత్యాసం రూ. 1 లక్షలకు పైగా ఉంది. అయినప్పటికీ, హారియర్ ఎక్స్టి అనేది కొనుగోలు చేయదగినది అగ్ర శ్రేణి వేరియంట్ అయిన ఎక్స్ జెడ్ వేరియంట్లో ఇచ్చిన అన్ని గంటలు మరియు ఈలలు లేకుండా వాహనం కావాలనుకుంటే డబ్బుకు తగిన వాహనం అని పరిగణించవచ్చు. హారియర్ ఎక్స్టి లో, వెనుకవైపు పార్కింగ్ కెమెరా, ఆటో ఎసి, క్రూజ్ కంట్రోల్, రైన్ -సెన్సింగ్ వైపర్స్, అల్లాయ్ వీల్స్ మరియు ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్ప్లే కంపాటబిలిటీ మరియు యాప్ సూట్ కలిగి ఉన్న ఒక టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ యూనిట్ వంటివి అందించబడతాయి. 1.25 లక్షల రూపాయల ధరల ఎక్కువ వ్యత్యాసంతో మరింత ఎక్కువ ఆనందాన్ని పొందవచ్చు. ఏమైనప్పటికీ, రూ. 15 లక్షల కన్నా తక్కువ ధర కలిగిన ట్యాగ్తో, ఎక్స్ టి అనేక ఫీచర్లతో అందించబడుతుంది మరియు ఇది నిరాశపరిచే విధంగా ఉండదు.

Tata Harrier

టాటా హారియర్ ఎక్స్ జెడ్ : అన్ని బెల్స్ మరియు ఈలలతో కొనుగోలుదారులకు అందుబాటులో ఉంది; దాని ప్రత్యర్థుల కన్నా మరింత సరసమైనది.

ఎక్స్ జెడ్ ధర:

రూ 16.25 లక్షలు

ఎక్టి కు, ఈ వేరియంట్ కు మధ్య గల వ్యత్యాసం - రూ 1.35 లక్షలు

క్స్టి వేరియంట్ లో అందించిన అన్ని అంశాలతో పాటు ఈ క్రింది ఫీచర్లు కూడా అందించబడతాయి

సేఫ్టీ: ఆరు ఎయిర్ బాగ్లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, ఐసోఫిక్స్ చైల్డ్ సీటు మౌంట్లు, హిల్ హోల్డ్ కంట్రోల్, హిల్ డీసెంట్ కంట్రోల్, రోల్ ఓవర్ మిటిగేషన్, కార్నర్ స్టెబిలిటీ కంట్రోల్, ఎలక్ట్రానిక్ ట్రాక్షన్ కంట్రోల్, హైడ్రాలిక్ బ్రేక్ అసిస్ట్ మరియు బ్రేక్ డిస్క్ వైపింగ్ వ్యవస్థ.

లైట్లు: జినాన్ హెచ్ఐడి ప్రొజక్టార్ హెడ్ల్యాంప్స్ మరియు కార్నరింగ్ ఫంక్షన్ తో ఫ్రంట్ ఫాగ్ లాంప్స్.

ఎక్స్టీరియర్స్: లోగో ప్రొజెక్షన్తో ఓఆర్విఎం లు మరియు షార్క్ ఫిన్ యాంటెన్నా.

ఇంటీరియర్: ఓక్ బ్రౌన్ రంగు థీం, చిల్లులు కలిగిన లెధర్ అపోలిస్ట్రీ తో పాటు లెధర్ తో చుట్టబడిన స్టీరింగ్ వీల్ మరియు గేర్ నాబ్.

కంఫర్ట్స్: 60:40 స్ప్లిట్ వెనుక సీట్లు, ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ లోపల 7- అంగుళాల కలర్ టిఎఫ్టి ప్రదర్శన, ఇన్ఫోటైన్మెంట్ వివరాలు అలాగే టెర్రైన్ స్పందన రీతులు (సాధారణ, తడి, కఠినమైన).

ఇన్ఫోటైన్మెంట్: 9- స్పీకర్ జెబిఎల్ సౌండ్ సిస్టమ్తో 8.8- అంగుళాల టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ యూనిట్, ఆపిల్ కార్ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో అనుకూలతలను కూడా పొందుతుంది.

Tata Harrier

హారియర్ యొక్క అగ్ర శ్రేణి వేరియంట్ మునుపటి వేరియంట్ కన్నా రూ .1.35 లక్షల ఎక్కువ ధరను కలిగి ఉంది.

మీరు జీప్ కంపాస్ దిగువ శ్రేణి లేదా మహీంద్రా ఎక్స్యూవి500 యొక్క మధ్యస్థ వేరియంట్ లాంటివి కొనుగోలు చేయాలనుకున్నట్లైతే, అప్పుడు మీరు హారియర్ యొక్క డీర్కో వేరియంట్ ను మేము సూచిస్తున్నాము. ఈ వేరియంట్ లో ఆరు ఎయిర్ బాగ్ లతో పాటు, రోల్ ఓవర్ మిటిగేషన్ మరియు కార్నర్ స్థిరత్వ నియంత్రణ వంటి చురుకైన భద్రతా వ్యవస్థలతో సహా జోడించిన భద్రత అంశాలు అందించబడుతున్నాయి. అంతేకాకుండా దినిలో ఒక పెద్ద ఇన్ఫోటైన్మెంట్ డిస్ప్లే అధనంగా పొందుతాము, వీటన్నింటితో పాటు పెద్దది మరియు మరింత సమాచారాన్ని అందించే ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, హెచ్ ఐడి ప్రొజక్టార్ హెడ్ల్యాంప్స్, ఆకర్షణీయమైన ఇంటీరియర్స్ మరియు ఈ ఎస్పి- ఆధారిత టెర్రైన్ స్పందన వ్యవస్థ కూడా పొందుతారు.

ద్వారా ప్రచురించబడినది

Write your Comment పైన టాటా హారియర్

2 వ్యాఖ్యలు
1
Y
yogesh naik
Jun 24, 2020 9:24:55 AM

Please update this Article, taking into consideration the Automatic Varients.

Read More...
  సమాధానం
  Write a Reply
  1
  B
  bala m
  Jul 12, 2019 12:09:46 PM

  Recent price hike of 30-50k is not justifiable. it's only exploiting the supply Vs demand gap.

  Read More...
   సమాధానం
   Write a Reply
   Read Full News
   ఎక్కువ మొత్తంలో పొదుపు!!
   % ! find best deals on used టాటా cars వరకు సేవ్ చేయండి
   వీక్షించండి ఉపయోగించిన <MODELNAME> లో {0}

   సరిపోల్చడానికి & పరిశీలించడానికి ఒకే లాంటి కార్లు

   Ex-showroom Price New Delhi
   • ట్రెండింగ్
   • ఇటీవల
   ×
   మీ నగరం ఏది?