టాటా హారియర్ ధరలు రూ .45,000 వరకు పెరిగాయి
టాటా హారియర్ 2019-2023 కోసం rohit ద్వారా జనవరి 18, 2020 04:47 pm ప్రచురించబడింది
- 58 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
ధరలు పెరిగినప్పటికీ, ఈ SUV మునుపటిలాగే అదే BS 4 ఇంజన్ మరియు లక్షణాలతో అందించబడుతుంది
- హారియర్ ఇప్పుడు రూ .3.43 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) ధరని కలిగి ఉంది.
- ఇది అదే 2.0-లీటర్ డీజిల్ ఇంజన్ (140Ps / 350Nm) తో కొనసాగుతోంది.
- BS6-కంప్లైంట్ హారియర్ ఆటో ఎక్స్‌పో 2020 లో లాంచ్ అవుతుందని భావిస్తున్నాము.
- హ్యుందాయ్-సోర్స్డ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ను కూడా హారియర్ త్వరలో అందుకోనున్నది.
- BS 6 పవర్‌ట్రెయిన్‌ను ప్రవేశపెట్టడంతో ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది.
- టాటా ఈ షోలో గ్రావిటాస్ (7-సీట్ల హారియర్) ను కూడా పరిచయం చేయనున్నది.
టాటా హారియర్ కు కొత్త సంవత్సరానికి ధరల పెరుగుదల లభించింది. ఈ మొత్తం లైనప్ కి రూ .35,000 నుండి రూ .45,000 వరకు ధరల పెరుగుదల ఉంది. పాత మరియు క్రొత్త ధరల యొక్క వేరియంట్ వారీ పోలిక ఇక్కడ ఉంది:
వేరియంట్ |
కొత్త ధర (2020) |
పాత ధర (2019) |
తేడా |
XE |
రూ. 13.43 లక్షలు |
రూ. 12.99 లక్షలు |
రూ. 44,000 |
XM |
రూ. 14.69 లక్షలు |
రూ. 14.25 లక్షలు |
రూ. 44,000 |
XT |
రూ. 15.89 లక్షలు |
రూ. 15.45 లక్షలు |
రూ. 44,000 |
XZ |
రూ. 17.19 లక్షలు |
రూ. 16.75 లక్షలు |
రూ. 44,000 |
XZ (డ్యుయల్ టోన్) |
రూ. 17.3 లక్షలు |
రూ. 16.95 లక్షలు |
రూ. 35,000 |
XT (డార్క్ ఎడిషన్) |
రూ. 16 లక్షలు |
రూ. 15.55 లక్షలు |
రూ. 45,000 |
XZ (డార్క్ ఎడిషన్) |
రూ. 17.3 లక్షలు |
రూ. 16.85 లక్షలు |
రూ. 45,000 |
(అన్ని ధరలు, ఎక్స్-షోరూమ్ ఢిల్లీ)
సంబంధిత వార్త: టాటా ప్రస్తుత వినియోగదారుల కోసం ప్రత్యేక ఆఫర్లతో హారియర్ యొక్క మొదటి వార్షికోత్సవాన్ని జరుపుకుంటుంది
గత సంవత్సరం హారియర్‌కు రూ .30,000 పెరిగిన తరువాత ఇది రెండవ ధరల పెరుగుదలగా ఉంది. హారియర్ లోని లక్షణాలు, మెకానికల్స్ కూడా మునుపటిలాగే ఉన్నాయి. ఇది BS 4-కంప్లైంట్ 2.0-లీటర్ డీజిల్ ఇంజిన్ తో పవరింగ్ కొనసాగుతూ 140 Ps గరిష్ట పవర్ ని మరియు 350Nm పీక్ టార్క్ ని అందిస్తుంది. ప్రస్తుతం, టాటా కేవలం 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో మాత్రమే SUV ని అందిస్తుంది.
5- సీటర్ SUV యొక్క BS 6-కంప్లైంట్ వెర్షన్ కూడా రాబోయే ఆటో ఎక్స్‌పో 2020 లో విడుదలయ్యే అవకాశం ఉంది, అందువల్ల త్వరలో ధరలు మళ్లీ పెరిగే అవకాశం ఉంది. ఈ అప్‌గ్రేడ్‌తో, 2.0-లీటర్ డీజిల్ యూనిట్ కి 170 Ps వరకు పవర్ పెరిగే అవకాశం ఉంది. అయితే హారియర్ కంపాస్ లో ఉండే ఇంజన్ ని షేర్ చేసుకుంటున్నందుకు ఆ కంపాస్ రేంజ్ లో ఇది కూడా ఉంది. ఇదిలా ఉండగా, హారియర్ యొక్క 7-సీట్ల వెర్షన్ గ్రావిటాస్, ఆటో ఎక్స్‌పోలో లాంచ్ అవుతుంది మరియు దీని ధర రూ .13 లక్షల నుండి 17 లక్షల మధ్య ఉంటుంది.
మరింత చదవండి: హారియర్ డీజిల్
0 out of 0 found this helpful