టాటా ప్రస్తుత వినియోగదారుల కోసం ప్రత్యేక ఆఫర్లతో హారియర్ యొక్క మొదటి వార్షికోత్సవాన్ని జరుపుకుంటుంది
టాటా హారియర్ 2019-2023 కోసం sonny ద్వారా జనవరి 10, 2020 01:46 pm ప్రచురించబడింద ి
- 20 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
ఇప్పటివరకు 15,000 హారియర్ యజమానులకు వ్యక్తిగతీకరించిన బ్యాడ్జీలు, కాంప్లిమెంటరీ వాష్, సర్వీస్ డిస్కౌంట్ మరియు ఇంకెన్నో అందించింది
- టాటా 2019 జనవరిలో హారియర్ SUV ప్రారంభించిన మొదటి వార్షికోత్సవాన్ని దాని 15,000 మంది యజమానులతో ‘# 1 విత్ మై హారియర్’ ప్రచారంలో జరుపుకోనుంది.
- ఈ వేడుకల ప్రచారంలో ప్రత్యేక ఆఫర్లు మరియు ప్రయోజనాలు దీనిలో భాగంగా ఉన్నాయి, హారియర్ కస్టమర్లు తమ టాటా SUV కోసం వ్యక్తిగతీకరించిన బ్యాడ్జ్‌ను పొందు తారు.
- హారియర్ యజమానులు తమ కారును కాంప్లిమెంటరీ వాష్ మరియు వాక్యూమ్ క్లీన్, 40-పాయింట్ల చెకప్ మరియు ఈ సందర్భం గుర్తుగా ప్రత్యేకంగా రూపొందించిన స్కఫ్ ప్లేట్ల ను కూడా పొందవచ్చు.
- టాటా హారియర్ సర్వీస్ గోల్డ్ క్లబ్ కు సభ్యత్వాన్ని కూడా అందిస్తోంది, ఇది హారియర్ యజమానులకు రాబోయే 2 సంవత్సరాలలో లభించే ఏదైనా సేవా సదుపాయంపై రూ .8,400 వరకు పొదుపుగా ఉంటుంది.
- టాటా హారియర్ యజమానులు వారి స్నేహితులకు లేదా కుటుంబ సభ్యులకు కూడా కొనడానికి రిఫర్ చేస్తే రూ .5 వేల అమెజాన్ గిఫ్ట్ కార్డు ఇవ్వబడుతుంది.
- టాటా ఈ ప్రచారం సందర్భంగా హారియర్ యజమానులకు వర్క్‌షాప్‌లలో ఉచిత పిక్ అప్ అండ్ డ్రాప్ సదుపాయాన్ని కూడా అందిస్తోంది. ఈ బెనిఫిట్ వాక్-ఇన్ కస్టమర్లకు కూడా విస్తరించింది.
- హారియర్ యొక్క మొదటి వార్షికోత్సవం కోసం ఈ వేడుక ప్రచారం జనవరి 9 మరియు 19 మధ్య జరుగుతుంది.
మీరు మ్యానుఫ్యాక్చురర్స్ నుండి పూర్తి విడుదలను ఇక్కడ చదవవచ్చు:
టాటా మోటార్స్ హారియర్ 1 వ వార్షికోత్సవం కోసం వేడుకలను ప్రారంభించింది. ఇప్పటికే ఉన్న కస్టమర్ల కోసం # 1 విత్ మై హారియర్ ప్రచారాన్ని విడుదల చేస్తుంది.
ముంబై, జనవరి 04, 2020: టాటా మోటార్స్ తన ప్రధాన SUV-హారియర్ 1 వ వార్షికోత్సవం సందర్భంగా, దేశవ్యాప్తంగా # 1 విత్ మై హారియర్ వార్షికోత్సవ ప్రచారంతో హారియర్ యజమానులతో తన వేడుకలను ప్రారంభించినట్లు ప్రకటించింది. 1 వ వార్షికోత్సవ వేడుకలు 2020 జనవరి 9 నుండి 19 వరకు కొనసాగుతాయి మరియు 2019 జనవరిలో ప్రారంభించినప్పటి నుండి హారియర్ కొనుగోలు చేసిన మొత్తం 15,000 హారియర్ యజమానులను కవర్ చేస్తుంది.
టాటా మోటార్స్ ప్రచారం సందర్భంగా దాని ప్రస్తుత హారియర్ యజమానుల కోసం మాత్రమే రూపొందించిన ప్రత్యేక ఆఫర్లు మరియు ప్రత్యేక ప్రయోజనాలను అందించింది. అన్ని హారియర్ కస్టమర్లు తమ వాహనంతో పంచుకునే బంధాన్ని వ్యక్తీకరించడానికి వారి హారియర్ కోసం వ్యక్తిగతీకరించిన బ్యాడ్జ్ పొందుతారు. అంతేకాకుండా, ఈ సందర్భంగా ప్రత్యేకంగా రూపొందించిన స్కఫ్ ప్లేట్స్‌తో వారు తమ హారియర్‌కు మేక్ఓవర్ ఇవ్వవచ్చు, కాంప్లిమెంటరీ వాష్ & వాక్యూమ్ క్లీన్ మరియు ప్రత్యేకమైన 40 పాయింట్ల చెక్ అప్ ని వారి యొక్క శూవ్ కోసం చెక్ చేసుకోవచ్చు. హారియర్ యజమానులు హారియర్ సర్వీస్ గోల్డ్ క్లబ్ లో సభ్యత్వాన్ని కూడా పొందుతారు, ఇది రాబోయే 2 సంవత్సరాల్లో పొందే ఏదైనా సేవా సౌకర్యంపై 8,400 రూపాయల విలువైన డిస్కౌంట్ మరియు ప్రయోజనాలకు అర్హులు. టాటా మోటార్స్ హారియర్ కొనడానికి తన స్నేహితులు మరియు కుటుంబ సభ్యులను సూచించే ఏ కస్టమర్ కి అయినా 5,000 రూపాయల విలువైన అమెజాన్ గిఫ్ట్ వోచర్‌లను అందించనుంది. ఈ అనుభవాన్ని మరింత సులువు చేయడానికి, వినియోగదారులు ఈ ప్రచారం సందర్భంగా వర్క్‌షాప్‌లలో ఉచిత పిక్ అప్ మరియు డ్రాప్ సదుపాయాన్ని పొందవచ్చు.
వార్షికోత్సవ ప్రచారం గురించి టాటా మోటార్స్, ప్యాసింజర్ వెహికల్స్ బిజినెస్ యూనిట్ హెడ్-మార్కెటింగ్, వివేక్ శ్రీవత్సా మాట్లాడుతూ, “హారియర్ ఎప్పటినుంచో కంపెనీ మరియు పరిశ్రమలకు ఒక విభాగంగా నిర్వచించే ఉత్పత్తి గా స్థిరపడింది. మార్కెట్ లో దీనిని ప్రారభించి ఒక సంవత్సరం అయినందున హ్యారియర్ యొక్క ఒక సంవత్సరం మైలురాయిని మా 15,000 హారియర్ కస్టమర్‌లతో కలిసి మా ఉత్పత్తిని ఇష్టపడిన మరియు మా బ్రాండ్‌తో బలమైన బంధాన్ని కలిగి ఉన్న వారితో జరుపుకోవడం మాకు ఆనందంగా ఉంది. # 1WithMyHarrier ప్రచారం మా బ్రాండ్ ఈక్విటీని మరింత పెంచుతుందని మరియు మా వినియోగదారులతో మా సంబంధాన్ని మరింత బలపరుస్తుందని మేము విశ్వసిస్తున్నాము ” అని ఆయన తెలిపారు.
ప్రచారం కోసం రిజిస్ట్రేషన్లు బ్రాండ్ వెబ్‌సైట్ https://harrier.tatamotors.com/OneWithMyHarrier లో ఈ రోజు నుండి తెరవబడతాయి. ఈ ప్రయోజనాలను పొందటానికి 2020 జనవరి 9 నుండి 19 వరకు ఏదైనా టాటా మోటార్స్ అధీకృత వర్క్‌షాప్‌కు వినియోగదారులు వెళ్ళవచ్చు.
OMEGARC లో నిర్మించబడిన మరియు ల్యాండ్ రోవర్ యొక్క లెజెండరీ D8 ప్లాట్‌ఫాం నుండి ఉద్భవించిన హారియర్ అద్భుతమైన డిజైన్ మరియు అద్భుతమైన పనితీరు యొక్క సంపూర్ణ కలయిక. క్రయోటెక్ డీజిల్ ఇంజిన్ మరియు అడ్వాన్స్‌డ్ టెర్రైన్ రెస్పాన్స్ మోడ్ లచే ఆధారితమైన హారియర్, కష్టతరమైన భూభాగాలపై అద్భుతమైన పనితీరును ఇస్తుంది. హారియర్ శ్రేణి రూ .12.99 లక్షల నుండి, ఎక్స్-షోరూమ్, ఢిల్లీ నుండి ప్రారంభమవుతుంది.
మరింత చదవండి: హారియర్ డీజిల్
0 out of 0 found this helpful