• English
  • Login / Register

భారతదేశంలో తయారుచేయబడి విక్రయిస్తున్న కార్‌లలో అత్యంత సురక్షితమైన కార్‌లుగా నిలిచిన Tata Harrier And Tata Safari

టాటా హారియర్ కోసం rohit ద్వారా అక్టోబర్ 18, 2023 05:30 pm సవరించబడింది

  • 304 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

కొత్త టాటా హ్యారియర్ మరియు సఫారీలు ఇప్పటి వరకు గ్లోబల్ NCAP టెస్ట్ చేసిన భారతీయ SUVలు అన్నటికంటే అత్యధిక స్కోర్ؚను సాధించాయి

Tata Harrier and Safari facelifts at Global NCAP

  • అడల్ట్ మరియు చైల్డ్ ఆక్యుపెంట్ భద్రత రెండిటిలో ఈ రెండు SUVలు 5 స్టార్ؚలను సాధించాయి. 

  • అడల్ట్ ఆక్యుపెంట్ భద్రతలో ఈ రెండు మోడల్‌లు 34 పాయింట్లకు 33.05 పాయింట్ల స్కోర్ؚను సాధించాయి.

  • చైల్డ్ ఆక్యుపెంట్ భద్రతలో, కొత్త హ్యారియర్ మరియు సఫారీ 49 పాయింట్లకు 45 పాయింట్లను పొందాయి.

  • వీటిలో అందిస్తున్న ప్రామాణిక భద్రత ఫీచర్‌లలో 6 ఎయిర్ బ్యాగ్ؚలు, ISOFIX సీట్ మౌంట్ؚలు, మరియు ESP ఉన్నాయి.

  • రెండిటిలో ADAS సాంకేతికత కూడా ఉంది, ఇందులో అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ మరియు హై-బీమ్ అసిస్ట్ ఉన్నాయి. 

టాటా హ్యారియర్ మరియు టాటా సఫారీ ఫేస్ؚలిఫ్ట్ؚల విక్రయాలు ప్రస్తుతం ప్రారంభం అయ్యాయి. ప్రెజెంటేషన్ సమయంలో, ఈ రెండు SUVలు గ్లోబల్ NCAP (కొత్త కార్ అసెస్మెంట్ ప్రోగ్రాం) క్రాష్ టెస్ట్ؚలలో 5-స్టార్ؚల భద్రత రేటింగ్ؚను పొందినట్లు వార్తలు వచ్చాయి. అడల్ట్ మరియు చైల్డ్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ అసెస్మెంట్ؚ రెండిటిలో, ఈ రెండు SUVలు 5 స్టార్ؚలను సాధించాయి.

అడల్ట్ ఆక్యుపెంట్ భద్రత

ఫ్రంటల్ ఇంపాక్ట్ (64kmph)

Tata Safari facelift frontal offset at Global NCAP

అడల్ట్ ఆక్యుపెంట్ భద్రతలో కొత్త హ్యారియర్ మరియు సఫారీలు 34 పాయింట్లకు 33.05 పాయింట్లను సాధించాయి. ఈ SUV జంట డ్రైవర్ మరియు ప్రయాణీకుల తల మరియు మెడకు ‘మంచి’ భద్రతను అందించాయి. డ్రైవర్ మరియు ప్రయాణీకుల ఛాతీకి లభించే భద్రత ‘తగినంత’గా రేట్ చేయబడింది. డ్రైవర్ మరియు ప్రయాణీకుల మోకాళ్ళకు ‘మంచి’ భద్రత అందిస్తుంది.

Tata Harrier, Safari facelifts adult occupant protection Global NCAP result

డ్రైవర్ కాలి క్రింది భాగానికి ‘తగినంత’ భద్రత లభిస్తుంది, ప్రయాణీకుల కాలి కింది భాగానికి ‘మంచి’ భద్రత లభిస్తుంది. వారి ఫుట్ؚవెల్ ప్రాంతం మరియు బాడీؚషెల్ ‘స్థిరంగా’ ఉన్నట్లు పరిగణించబడింది. రెండు టాటా SUVలు మరింత లోడింగ్ؚను తట్టుకునే సామర్ధ్యం ఉంది.

సైడ్ ఇంపాక్ట్ (50kmph)

Tata Safari facelift side impact Global NCAP

సైడ్ ఇంపాక్ట్ టెస్ట్ؚలో తల, ఛాతీ, కడుపు మరియు పెల్విస్ భాగాలకు ‘మంచి’ భద్రత లభించినట్లు పేర్కొనబడింది.

సైడ్ పోల్ ఇంపాక్ట్ (29kmph)

Tata Harrier facelift side pole impact Global NCAP

కర్టెన్ ఎయిర్ బ్యాగ్ؚల ఫిట్మెంట్ కూడా అవసరమైన ప్రోటోకాల్స్ ప్రకారం ఉంది. సైడ్ పోల్ ఇంపాక్ట్ టెస్ట్ؚలో, తల మరియు పెల్విస్ భాగాలకు కర్టెన్ ఎయిర్ బ్యాగ్ؚؚؚల నుండి ‘మంచి’ భద్రత లభిస్తుంది, ఛాతీకి ‘ఒక మోస్తరు’ భద్రత మరియు కడుపుకు ‘తగినంత’ భద్రత లభించింది. 

ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC)

నవీకరించిన టాటా ఫ్లాగ్ؚషిప్ SUVలలో ESC ఫిట్మెంట్ రేట్ అవసరాలను అందుకుంది మరియు టెస్ట్ؚలో వీటి ప్రదర్శన గ్లోబల్ NCAP కొత్త అవసరాలకు అనుగుణంగా ఆమోదయోగ్యంగా ఉంది.

ఇది కూడా చదవండి: కొత్త టాటా హ్యారియర్ మరియు సఫారీ నవీకరణతో టాటా కార్ؚలో కొత్తగా రానున్న 5 ఫీచర్‌లు

A post shared by CarDekho India (@cardekhoindia)

ఫ్రంటల్ ఇంపాక్ట్ (64kmph)

చైల్డ్ ఆక్యుపెంట్ భద్రతలో రెండు టాటా SUVలు 49 పాయింట్లకు 45 పాయింట్లను పొందాయి, రెండిటిలో చైల్డ్ సీట్లు వెనుక ముఖంగా అమర్చబడ్డాయి. 3-సంవత్సరాల వారి కోసం, ఫ్రంటల్ ఇంపాక్ట్ సమయంలో ఇవి తలకు దెబ్బ తగలకుండా నివారించగలిగాయి మరియు పూర్తి భద్రతను అందించింది. మరొక వైపు, 1.5-సంవత్సరాల డమ్మీ చైల్డ్ తలతో సహా పూర్తి భద్రతను అందిస్తుంది.

సైడ్ ఇంపాక్ట్ (50KMPH)

Tata Safari facelift side pole impact Global NCAP

సైడ్ ఇంపాక్ట్ టెస్ట్ సమయంలో రెండు చైల్డ్ రెస్ؚట్రైంట్ సిస్టమ్ؚలు (CRS) పూర్తి భద్రతను అందించాయి. 

2023 టాటా హ్యారియర్, సఫారీ భద్రత కిట్

Tata Harrier facelift 7 airbags

ఈ నవీకరణతో, ఈ కారు తయారీదారు రెండు SUVల భద్రత ఫీచర్‌లను మెరుగుపరిచారు, దీని కోసం 6 ఎయిర్ బ్యాగ్ؚలను ప్రామాణికంగా అందిస్తున్నారు మరియు మొత్తం మీద రెండిటి నిర్మాణ సమగ్రతను మెరుగుపరిచారు. కొత్త హ్యారియర్ మరియు సఫారీ ప్రస్తుతం టాప్-స్పెక్ వేరియెంట్‌లలో అదనపు ఎయిర్ బ్యాగ్ؚను పొందుతాయి (డ్రైవర్ మోకాళ్ళకు కూడా భద్రత లభిస్తుంది). ఇతర భద్రత ఫీచర్‌లలో ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రాం (ESP), ISOFIX చైల్డ్ సీట్ మౌంట్ؚలు మరియు 360-డిగ్రీల కెమెరా ఉన్నాయి. ఈ రెండు SUVలు అడ్వాన్సెడ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ؚలను (ADAS) కూడా కలిగి ఉన్నాయి, వీటిలో అటానమస్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ మరియు అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ ఉన్నాయి.

టాటా హ్యారియర్ ఫేస్ؚలిఫ్ట్ ధర రూ.15.49 లక్షలుగా మరియు కొత్త టాటా సఫారీ ఫేస్ؚలిఫ్ట్ ధర బేస్ వేరియంట్ ధర రూ.16.19 లక్షలుగా ఉంది. 

అన్నీ పరిచయ ఎక్స్-షోరూమ్ పాన్-ఇండియా ధరలు

ఇది కూడా చూడండి: టాటా హ్యారియర్ మరియు సఫారి ఫేస్ؚలిఫ్ట్ؚలు: వాస్తవ ప్రపంచంలో ఇవి ఎంత లాగేజ్‌ను మోయగలవు

ఇక్కడ మరింత చదవండి: హ్యారియర్ ఆన్ؚరోడ్ ధర

was this article helpful ?

Write your Comment on Tata హారియర్

explore similar కార్లు

సరిపోల్చడానికి & పరిశీలించడానికి ఒకే లాంటి కార్లు

*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర

ట్రెండింగ్‌లో ఉంది ఎస్యూవి కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience