రేపు ప్రారంభంకానున్న Tata Harrier, Safari ఫేస్‌లిఫ్ట్‌లు
టాటా హారియర్ కోసం rohit ద్వారా అక్టోబర్ 16, 2023 12:53 pm ప్రచురించబడింది
- 380 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
రెండు మోడల్‌లు ఇప్పటికీ అదే 2-లీటర్ డీజిల్ ఇంజిన్‌ను పొందుతున్నాయి, మాన్యువల్ మరియు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఎంపికలతో మునుపటిలా అందించబడుతున్నాయి.
- హారియర్ మరియు సఫారీ రెండూ మొదటి సంపూర్ణ మిడ్‌లైఫ్ నవీకరణను పొందాయి.
- బాహ్య నవీకరణలలో సవరించిన LED లైటింగ్ సెటప్ మరియు నవీకరించబడిన బంపర్ డిజైన్‌లు ఉన్నాయి.
- క్యాబిన్‌లు, రీడిజైన్ చేయబడిన డ్యాష్‌బోర్డ్ మరియు కొత్త టచ్ ఆధారిత క్లైమేట్ కంట్రోల్ ప్యానెల్‌ను పొందుతాయి.
- అందించిన ఫీచర్ల జాబితాలో 12.3-అంగుళాల టచ్‌స్క్రీన్ సిస్టమ్, డ్యూయల్-జోన్ AC మరియు ఏడు ఎయిర్‌బ్యాగ్‌లు ఉన్నాయి.
- రెండు SUVలు ఇప్పటికే ఉన్న మోడళ్ల కంటే లక్ష వరకు ప్రీమియం చెల్లించే అవకాశం ఉంది.
టాటా హారియర్ మరియు టాటా సఫారీ ఫేస్‌లిఫ్ట్‌లు రేపు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. కారు తయారీ సంస్థ, అన్ని ఫీచర్‌లు మరియు స్పెసిఫికేషన్‌లను వెల్లడించింది. మీరు కొత్త హారియర్ లేదా సఫారీని ఆన్‌లైన్‌లో లేదా భారతదేశం అంతటా టాటా డీలర్‌షిప్‌ల వద్ద రూ. 25,000 ముందస్తు చెల్లింపుతో బుక్ చేసుకోవచ్చు.
ఈ SUVలలో కొత్తవి ఏమిటో ఇక్కడ శీఘ్ర వివరణ ఉంది:
నవీకరించబడిన ఎక్స్టీరియర్
రెండు SUVలు రీడిజైన్ చేయబడిన గ్రిల్, పదునైన ఇండికేటర్లు మరియు కొత్త LED హెడ్‌లైట్‌ల వంటి మార్పులతో సరికొత్త రూపాన్ని పొందుతాయి. ముందు భాగంలో పొడవైన LED DRL స్ట్రిప్‌ను కలిగి ఉన్నాయి మరియు ముందు డోర్లపై తాజా అక్షరాలతో 'హారియర్' మరియు 'సఫారి' బ్యాడ్జ్‌లను కలిగి ఉన్నాయి. టాటా 17-అంగుళాల నుండి 19-అంగుళాల యూనిట్ల వరకు అల్లాయ్ వీల్స్‌తో రెండు SUVలను అందిస్తోంది. రెండు SUVల వెనుక భాగంలో కనెక్ట్ చేయబడిన LED టైల్‌లైట్ సెటప్ ఉంది మరియు రెండూ చంకీ స్కిడ్ ప్లేట్‌లతో అందించబడతాయి.
టాటా సఫారి ఫేస్‌లిఫ్ట్ vs మహీంద్రా XUV700
టాటా హారియర్ ఫేస్‌లిఫ్ట్ vs కియా సెల్టోస్
పునరుద్ధరించిన ఇంటీరియర్
క్యాబిన్ ఇప్పుడు లేయర్డ్ డ్యాష్‌బోర్డ్ డిజైన్ తో అందించబడింది. ఈ డిజైన్, కొత్త సెంట్రల్ AC వెంట్‌లు మరియు టచ్ ఆధారిత క్లైమేట్ కంట్రోల్ ప్యానెల్ వంటి అంశాలను కలిగి ఉంది. రెండు మోడల్‌లు, 'టాటా' లోగో తో కూడిన 4-స్పోక్ స్టీరింగ్ వీల్‌ను కలిగి ఉంటాయి మరియు ఎంచుకున్న వేరియంట్ ఆధారంగా వివిధ ఇన్‌సర్ట్‌లను ఎక్ట్సీరియర్‌తో కలర్-కోఆర్డినేట్ చేయవచ్చు.
మెరుగైన ఫీచర్లు
ఈ SUVలు 12.3-అంగుళాల టచ్‌స్క్రీన్ సిస్టమ్, 10.25-అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, యాంబియంట్ లైటింగ్ మరియు పనోరమిక్ సన్‌రూఫ్‌తో సహా కొత్త ఫీచర్ల శ్రేణితో వస్తాయి. అంతేకాకుండా ఈ రెండు SUVలు, ఎలక్ట్రికల్-సర్దుబాటు మరియు వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు (6-సీటర్ సఫారిలో మధ్య-వరుస వెంటిలేషన్‌తో), క్రూజ్ కంట్రోల్ అలాగే వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్ వంటి అంశాలను కూడా కలిగి ఉంటాయి.
భద్రత విషయానికి వస్తే, ఏడు ఎయిర్‌బ్యాగ్‌లు (ప్రామాణికంగా ఆరు), 360-డిగ్రీ కెమెరా, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ మౌంట్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ESP) మరియు హిల్-హోల్డ్ అసిస్ట్‌తో అందించబడుతున్నాయి. అంతేకాకుండా అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్‌లు (ADAS) అనుకూల క్రూయిజ్ కంట్రోల్, ఫార్వర్డ్-కొలిషన్ వార్నింగ్ మరియు బ్లైండ్-స్పాట్ మానిటరింగ్‌తో అందించబడ్డాయి.
ఇది కూడా చదవండి: కొత్త టాటా హ్యారియర్ మరియు సఫారి ఫేస్‌లిఫ్ట్‌తో టాటా కారులో ప్రారంభమైన 5 ఫీచర్లు
డీజిల్ ఇంజిన్ మాత్రమే
హారియర్ మరియు సఫారి ఫేస్‌లిఫ్ట్‌లు రెండూ, 2-లీటర్ డీజిల్ ఇంజన్ (170PS/350Nm) తో అందించబడతాయి. ఈ రెండు ఇంజన్లు, 6-స్పీడ్ మాన్యువల్ లేదా ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో అందుబాటులో ఉంటాయి.
ధర మరియు పోటీ
టాటా SUVలు సవరించిన వేరియంట్ లైనప్‌లో విక్రయించబడతాయి, వీటిని విస్తృతంగా నాలుగు ప్రధాన వేరియంట్లుగా విభజించారు. హారియర్ ఫేస్‌లిఫ్ట్ కోసం, ఇవి స్మార్ట్, ప్యూర్, అడ్వెంచర్ మరియు ఫియర్‌లెస్; మరియు సఫారి ఫేస్‌లిఫ్ట్ కోసం స్మార్ట్, ప్యూర్, అడ్వెంచర్ మరియు అకాప్లిష్డ్ వేరియంట్లుగా విభజించబడ్డాయి. అవుట్‌గోయింగ్ మోడల్‌ల కంటే వాటి ధరలు లక్ష వరకు పెరిగే అవకాశం ఉంది. సూచన కోసం, ప్రస్తుత హారియర్ ధర రూ. 15.20 లక్షలతో ప్రారంభమై రూ. 24.27 లక్షలకు చేరుకుంటుంది, అయితే ప్రస్తుతం ఉన్న సఫారీ ధర రూ. 15.85 లక్షల నుంచి రూ. 25.21 లక్షల (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) వరకు ఉంది.
కొత్త టాటా హారియర్- MG హెక్టర్ మరియు మహీంద్రా XUV700తో పాటు హై-స్పెక్ హ్యుందాయ్ క్రెటా మరియు కియా సెల్టోస్ వేరియంట్‌లతో పోటీని కొనసాగిస్తుంది. ఫేస్‌లిఫ్టెడ్ టాటా సఫారి ఇప్పటికీ హ్యుందాయ్ అల్కాజర్, మహీంద్రా XUV700 మరియు MG హెక్టర్ ప్లస్ వంటి 3-వరుసల SUVలతో ప్రత్యామ్నాయంగా కొనసాగుతుంది.
ఇవి కూడా చూడండి: టాటా సఫారీ ఫేస్‌లిఫ్ట్ అడ్వెంచర్ వేరియంట్ 5 చిత్రాలలో వివరించబడింది
మరింత చదవండి: హారియర్ డీజిల్
0 out of 0 found this helpful