బహిష్కరణను ఎదుర్కొంటున్న టకాట ఎయిర్బ్యాగ్స్
నవంబర్ 16, 2015 12:54 pm sumit ద్వారా ప్రచురించబడింది
- 15 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
జైపూర్:
హోండా, టయోటా సంస్థలు వారు టకాటా ఎయిర్బ్యాగ్స్ ఉపసంహరించుకున్న తరువాత, నిస్సాన్ కూడా వారి ఆటోమోటివ్ భాగాల తయారీదారిని బహిష్కరించాలని నిర్ణయించింది. నిస్సాన్ మోటార్స్ వారు ఇక మీదట తన కార్లకు జపనీస్ ఆటో విడిభాగాల తయారీ సంస్థ చేసిన ఎయిర్ బ్యాగ్స్ ని ఉపయోగించమని రెండు రోజులు క్రితం చెప్పారు. ఈ నిలిపివేత అమలు చేయబడడంతో ఎయిర్బ్యాగ్స్ కి సంబంధించి తప్పుడు డిజైన్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా కార్లు రీకాల్ చేయబడ్డాయి. పరిస్థితి మరింతగా దిగజారి మాజ్డా, మిత్సుబిషి మోటార్స్ మరియు ఫుజి హెవీ ఇండస్ట్రీస్ వంటి ఇతర జపనీస్ వాహన తయారీసంస్థలు కూడా వారి టకాట ఎయిర్‌బ్యాగ్ టెక్నాలజీని నిషేధించాలని ఆలోచిస్తున్నాయి.
"మేము ఇకపై భవిష్యత్తులో మా మోడల్స్ కోసం అమ్మోనియం నైట్రేట్ కలిగి ఉండే టకాటా ఎయిర్‌బ్యాగ్స్ ని ఉపయోగించదలచుకోలేదు." అని నిస్సాన్ సంస్థ ఒక ప్రకటనలో తెలిపారు. "మేము మొదట మా వినియోగదారుల కొరకు భద్రతపై దృష్టి పెడతాము మరియు సాధ్యమైనంత త్వరగా వాహనాలను ఉపసంహరించేందుకు ప్రయత్నిస్తాము." అని వారు తదుపరి జోడించారు. జపనీస్ వాహనతయారీ సంస్థ సోమవారం మొదట స్వదేశంలో దాని వాహనాల తనిఖీ ని పునరావృతం చేసి ప్రారంభంలోనే ఎయిర్‌బ్యాగ్ లోపాలు క్లియర్ చేస్తామని విశదీకరించారు.
ఇంకా చదవండి : హోండా వారు 2,23,578 కార్లను ఉపసంహరించమని ఆదేశాలు జారీ చేసింది, ఇందులో మీ కార్లని చూసుకోండి!
యు.ఎస్ ఆటో భద్రత నియంత్రకాలు ప్రకారం, అమ్మోనియం నైట్రేట్ కలిగి ఉన్న కారణంగా అధిక శక్తి వలన ఎయిర్బ్యాగ్స్ లో పేలుడు సంభవించవచ్చు. వాహనాలలో వెదజల్లిన స్ప్రే కారణంగా కూడా ఇతర ప్రమాదకర ప్రభావాలను కలిగి ఉంటుంది. ఈ ఎయిర్‌బ్యాగ్ లోపం, ప్రపంచవ్యాప్తంగా 30 మిలియన్ల కార్లు రీకాల్ పై బాధ్యత వహిస్తుంది. మొదటి రీకాల్ 2008 ప్రారంభంలో జరిగింది. ఈ లోపం కారణంగా పలు మరణాలు మరియు తీవ్రమైన గాయాలు సంభవించే అవకాశం ఉంది. ఈ వార్తలు తప్పనిసరిగా టకాటా లో అలజడి సృష్టిస్తాయి. వారి మొత్తం అమ్మకాలలో భద్రత ఫీచర్ పరికరాలు సుమారు 40% గా పరిగణిస్తాము.