భారతదేశానికే ప్రత్యేకంగా రూపొందిన మారుతీ ఎర్టిగా యొక్క చిత్రాలు వెలువడ్డాయి
మారుతి ఎర్టిగా 2015-2022 కోసం అభిజీత్ ద్వారా ఆగష్టు 11, 2015 11:13 am ప్రచురించబడింది
- 15 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
జైపూర్:
మారుతీ వారి ప్రముఖ ఎంపీవీ అయిన ఎర్టిగా యొక్క ఫేస్లిఫ్టెడ్ వెర్షన్ ని ఆగస్టు 20న జరిగే ఇండొనేషియా మోటార్ షో లో ప్రదర్శింపబడుతుంది. దీనికి మునుపు, పునరుద్దరింపబడిన ఎర్టిగా ని కూడా ఇండొనేషియా లోనే వెలువడటం జరిగింది. తయారీదారుడు ఆగస్టు ఆఖరిలోగా భారతదేశంలోకి దీనిని ప్రవేశింప చేసే అవకాశం ఉంది.
మార్పులు గురించి మాట్లాడుతూ, క్రోము గ్రిల్లు కొద్దిగా బానెట్ మీదుగా జరగడం గమనించవచ్చు మరియూ క్రోము పూత కూడా కొద్దిగా ఎక్కువగా వాడినట్టు కనిపిస్తుంది. ముందు వైపు బంపర్ పునరుద్దరింపబడింది మరియూ మునుపటి కంటే స్పోర్టీగా కనబడుతోంది. ఇరువైపులా చూసినట్టు అయితే కనుక, మనకి అల్లోయ్ వీల్స్ కనిపిస్తాయి. వెనుక భాగానికి టెయిల్ లైట్స్ కాస్త సాగదీసినట్టుగా మధ్య క్రోము భాగం వరకు పొడిగించబడి ఉన్నాయి. వెనుక బంపర్ లో ఒక జత రిఫ్లెక్టర్స్ ని జత చేయడంతో పాటుగా కొన్ని మార్పులు జరిగాయి.
ఇక ఇంజిను విషయానికి వస్తే, అదే 1.4 లీటరు పెట్రోల్ మరియూ 1.3 లీటరు పెట్రోల్ డిజిలు మరియూ 90పీఎస్ శక్తి అలాగే 200ఎనెం టార్క్ ఉత్పత్తిని కలిగి ఉంటుంది. అంతే కాకుండా, ఈసారి ఇది ఆటోమాటిక్ ట్రాన్స్మిషన్ ని 5-స్పీడ్ మాన్యువల్ తో పాటుగా వచ్చే అవకాశం ఉంది. కొలతల విషయానికి వస్తే, ఎలాంటి మార్పులు, ముఖ్యంగా వీల్ బేస్ లో, వెడల్పులో మరియూ పొడుగులో ఎలాంటి మార్పులు ఉండబోవు.
లోపల వైపున, మార్పులు చేర్పులు తక్కువ అనే చెప్పాలి. స్టార్ట్/స్టాప్ బటను, సియాజ్ లో ఉన్నటువంటి టచ్ స్క్రీన్ ఇంఫోటెయిన్మెంట్ సిస్టము, కొత్త సీటు కవర్లు మరియూ బ్లూటూత్ కనెక్టివిటీ వంటివి చూడవచ్చు.