ఫేస్లిఫ్ట్ పొందిన కొత్త మహీంద్రా థార్ కేమెరాకు చిక్కింది
మహీంద్రా థార్ 2015-2019 కోసం manish ద్వారా జూలై 23, 2015 11:28 am ప్రచురించబడింది
- 15 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
జైపూర్: మొట్టమొదటి సారి, మహీంద్రా థార్ ఫేస్లిఫ్ట్ స్పష్టమైన చిత్రాలు కేమెరాకు చిక్కడం జరిగింది. ఇతర నవీకరణలతో పాటుగా ఈ ప్రముఖ ఆఫ్-రోడరు పూర్తి పునరుద్ధరణ పొందింది. కొత్త మహీంద్రా థార్ రేపు ప్రారంభించేందుకు సిద్దం అయ్యింది మరియు దాని ప్యానెల్స్, బాహ్య రూపంలో మరియూ లోపలి భాగంలో కూడా అయితే మార్చబడాయి లేదంటే పునరుద్ధరించబడ్డాయి.
లోపలివైపు, జీప్ నుండి పెట్టిన 540mm డాష్బోర్డ్ తొలగించి దాని స్థానంలో మరింత అందమైన, డ్యూయల్ టోన్ రంగు గలది పెట్టబడింది. లోపలి భాగంలో బొలెరో నుండి అరువు సిల్వర్ పూతలతో స్టీరింగ్ వీల్ వెనుక ఒక కొత్త ట్రిపుల్-పాడ్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ పెట్టబడింది. కొత్త సిల్వర్ పూతతో ఎయిర్-కండిషనింగ్ యూనిట్లు నెలకొల్పబడిన సెంటర్ కన్సోల్ మీద కూడా 'థార్' బ్రాండింగ్ బ్యాడ్జీ ఉంది.
ఈ వాహనంలో కొత్త కప్ హోల్డర్లు, ఆఏశీఈ నియంత్రణలు మరియు గేర్ లెవర్ ని అమర్చబడ్డాయి. గ్రిల్ల్ తో పాటుగా బానెట్ కూడా పునరుద్దరించబడ్డాయి. కొత్త ఫుట్ బోర్డులు మరియు సైడ్ షీట్ మెటల్ డిజైన్ తో పాటుగా ఎగ్జాస్ట్ కూడా పునఃరూపకల్పన పొందింది. మీరు నవీకరించిన అల్లోయ్ వీల్స్ ని మరియూ హబ్ క్యాప్స్ ని కూడా ఆశించవచ్చు.
ప్రస్తుత 2.5-లీటర్ డి ఐ డీజిల్ ఇంజిన్ 38000rpm వద్ద 63bhp శక్తిని మరియు 1500-1800rpm వద్ద 195Nm టార్క్ ని అందించగా, ఇది 2.5 లీటర్ తక్కువ ఖర్చు కామన్ రైల్ (ఎల్సిసీఅర్) యూనిట్ తో భర్తీ చేయబడింది. ఈ 2.5 లీటర్ కామన్ రైల్ యూనిట్ 3200rpm వద్ద 75bhp శక్తిని మరియు 14000rpm వద్ద 200Nm టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది. ఇది ప్రస్తుతం ప్రవేశ స్థాయి స్కార్పియో తో జత చేయబడి ఉంది. ఈ ఇంజిన్ వలన థార్ కి అధనపు బలం చేకూరుతుంది. స్కార్పియో 2.5 లీటర్ సి అర్ డిఇ ఇంజిన్ 3800rpm వద్ద 105bhp శక్తిని మరియు 1800rpmవద్ద 247Nm టార్క్ ని అందిస్తుంది. ఇది ఇలానే కొనసాగుతుందని భావిస్తున్నాము. సి అర్ డిఇ మరియు డి ఐ మోటార్లు 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ వ్యవస్థతో అందుబాటులో ఉన్నాయి. థార్ రెండు రేర్ వీల్ డ్రైవ్ వ్యవస్థ తో మరియు అగ్ర శ్రేణి వేరియంట్లలో 4 × 4 వ్యవస్థ తో రాబోతున్నది.