స్కార్పియో ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది; 5 లక్షల యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది
published on సెప్టెంబర్ 24, 2015 04:01 pm by cardekho కోసం మహీంద్రా స్కార్పియో
- 6 సమీక్షలు
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
జైపూర్: ఎస్యూవీ విభాగంలోకి మహింద్రా వారి రాకకి సంబంధించి వచ్చిన కారు కి కొత్తగా మరొక లక్షనం జత అయ్యింది. మహింద్రా స్కార్పియో సంచిత అమ్మకాలను 5 లక్షలకు చేరుకోగలిగింది. దాదాపు 13 సంవత్సరాలలో రెండు పునరుద్దరణలు పొందడం వలన ఇది కాలానికి తగినట్టుగా ఉండి ఈ విజయంలో కొంత ఘనత డిజైనర్లకు కూడా చెందుతుంది. ఏటా ఈ కారు 48,000 యూనిట్ల సగటు అమ్మకాలను ఇది నమోదు చేసుకుంటోంది.
ఈ కారు లో 12 వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి మరియూ 2WD, AWD, MT మరియూ AT ఆప్షన్లుగా విభజించబడ్డాయి. కంపెనీ వారు కారు యొక్క బరువుని తగ్గించే ప్రయత్నం చేశారు మరియూ కొత్త లక్షణాలను జత చేశారు. ఇక ఇందులో ఉన్న 2.5-లీటర్ డీజిల్ ఇంజిను 75hp మరియూ 200Nm అందించగా, 2.2-లీటర్ఇంజిను 120hp మరియూ 280Nm అందిస్తుంది.
ఈమధ్య పోటీ పెరుగుతుండగా మార్పులు చేర్పులు ఎక్కువగా చేయడం అత్యవసరం. హ్యుండై క్రేటా, రెనాల్ట్ డస్టర్, నిస్సాన్ టెర్రానో మరియూ ఫోర్డ్ ఈకోస్పోర్ట్ వంటివి దీని అమ్మకాలను కొంత వరకు దెబ్బతీయగా ఈ కారు ఈమధ్య మార్పులతో కొత్త ఉత్తేజంతో పోటీదారులకు ధీటుగా నిలుస్తోంది.
- Renew Mahindra Scorpio Car Insurance - Save Upto 75%* with Best Insurance Plans - (InsuranceDekho.com)
- Loan Against Car - Get upto ₹25 Lakhs in cash
0 out of 0 found this helpful