ఎస్- క్రాస్ - పోటీతత్వాన్ని తట్టుకునేందుకు ఏ లక్షణాలను కలిగి ఉంది?

మారుతి ఎస్-క్రాస్ 2017-2020 కోసం manish ద్వారా ఆగష్టు 04, 2015 02:52 pm ప్రచురించబడింది

జైపూర్:

క్రాసోవర్ కి ఉన్న క్రేజ్ ఎప్పటికప్పుడు పెరుగుతునే ఉంది. భారతదేశంలో తయారీదారులు హాచ్బాక్ లో ఉన్న లక్షణాలను అలానే ఎస్యువిలో ఉన్న లక్షణాలను తీసుకొని క్రాసోవర్ రూపొందించి విజయం సాధిస్తున్నారు. మారుతీ కూడా అదే విధంగా ఎస్-క్రాస్ ని రూపొందించింది. ఈ ఎస్-క్రాస్ చూడడానికి కొంచం హాచ్బాక్ లా కనిపించినా ఇది క్రాసోవర్ కి చెందిన కారు. ఇది ఖచ్చితంగా దాని విభాగంలో ఇతర కార్లతో పోటీ పడగలదని నమ్మకం.   

డిజైన్:

ఈ ఎస్-క్రాస్ మారుతి కొత్త ప్రీమియం డీలర్ నెక్సా ద్వారా అమ్మకాలకు వెళ్ళనుంది. ఈ డీలర్ ప్రధానంగా సుజుకి యొక్క  ప్రీమియం కార్లు మరియు క్రాస్ జాబితా కొరకు రూపొందింది. దీని వలన ఈ కారు ఎంత ఉన్నతస్థాయికి చెందిందిందో ఆలోచించవచ్చు. మారుతీ సుజికి ఇతర కంపెనీలు వలే హచ్-టు-క్రాస్ఓవర్ విధానం తీసుకోలేదు. కారు తయారీదారు ఎస్- క్రాస్ యొక్క రూపకల్పన ప్రత్యేకంగా చేశారు. ఈ కారు  4.3 మీటర్ల  పొడవుతో అందించబడుతుంది. ఈ కారు ప్రొజెక్టర్ హెడ్ల్యాంప్స్, హెచ్ ఐ డి మరియు పగటిపూట నడుస్తున్న ఎలి డి లు మరియు టెయిల్ లైట్ క్లస్టర్  పక్క భాగాలకు మరియు బూట్ కంపార్ట్మెంట్ కి అందించడం జరిగింది. ఇతర పోటీదారులలా కాకుండా ఎస్-క్రాస్ అధిక క్లాడింగ్ మరియు స్కఫ్ ప్లేట్స్ తో అందించబడుతుంది. ఈ జపనీస్ డిజైన్ వినియోగదారుల అంచనాకు తగ్గట్టుగా ఉంటుంది. అలానే దీని ఫ్లుయిడిక్ డిజైన్ ఐ20 కి పోటీగా ఉంటుంది.

అంతర్భాగాలు:

ఈ ఎస్-క్రాస్ యొక్క డాష్బోర్డ్ మృ దువైన   టచ్ ప్లాస్టిక్ టచ్ తో అనేక అంశాలను కలిగి ఉంది. దీని సెంటర్ కన్సోల్ మరియు ఏ.సి వెంట్లు సిల్వర్ చేరికలతో స్టైలిష్ లుక్ ఇస్తాయి. మారుతి ఎస్- క్రాస్ యొక్క వీల్బేస్  హ్యుందాయ్ ఐ 20 కంటే 30mm  ఎక్కువ మరియు పుష్కల మైన మోకాలు స్పేస్ మరియు లెగ్ గది అందించేందుకు ఈ కారు సహాయపడుతుంది. అలానే, ఈ కారు 353 లీటర్ బూట్ స్పేస్ అందిస్తుంది. ఇది ఈ విభాగంలో మిగతా కార్ల కంటే, చాలా ఎక్కువ. ఈ కారు బ్లూటూత్ తో పాటూ  టచ్స్క్రీన్ సమాచార వ్యవస్థ, ఆక్స్ ఇన్ సాకెట్ మరియు నావిగేషన్ సిస్టమ్ తో అందించబడుతుంది. అలానే, దీనిలో స్పీడ్ సెన్సింగ్ ఆటో లాక్, క్రూయిజ్ నియంత్రణ మరియు లెథర్ అపోలిస్ట్రీ వంటి విలాశవంతమైన అంశాలు కూడా అందించడం జరిగింది.

భద్రత:

దాని విభాగంలో అత్యంత పోటీదారులు లానే మారుతీ ఎస్-క్రాస్ రెండు డ్రైవర్ కి ,అలాగే ప్రయాణీకులకి  ఎయిర్బ్యాగ్స్ తో అందించబడుతుంది. ఈ జపనీస్ క్రాసోవర్ ఎబిఎస్ లక్షణాన్ని కూడా కలిగి ఉంది. మిగిలిన అన్ని క్రాసోవర్ లా  ఇది నాలుగు చక్రాలు లో డిస్క్ బ్రేక్లు కలిగి లేదు. ఇది ముందరి రెండు  వీల్స్ కి  మాత్రమే డిస్క్ బ్రేక్లు కలిగి ఉంది. అలానే వెనుక వీల్స్ కిడ్రమ్ బ్రేక్లను కలిగి ఉంది.

గురగుర ధ్వని:

ఈ ఎస్-క్రాస్ రెండు ఇంజిన్ ఎంపికలతో రావచ్చు. ఈ ప్రత్యేక డీజిల్ ఇంజన్ ఫియాట్ నుండి తీసుకోబడింది.  90hp శక్తిని ఉత్పత్తి చేసే 1.3 లీటర్ డీజిల్ ఇంజిన్  లేదా   3750rpm వద్ద 118bhp శక్తిని మరియు  1750rpm వద్ద  320Nm టార్క్ ని ఉత్పత్తి చేసే 1.6 లీటర్ డీజిల్ ఇంజిన్ తో రావచ్చు. దీని విభాగంలో ఇతర కార్లతో పోలిస్తే, అవి  67-93bhp శక్తిని అందిస్తాయి. ఎస్ క్రాస్ ఖచ్చితంగా శక్తి పరంగా అద్భుతంగా ఉంది. వాహనం యొక్క  అత్యుత్తమ శక్తి  1500rpm వద్ద అందించవచ్చు. ఈ కారు 6-స్పీడ్ ట్రాన్స్మిషన్ సిస్టమ్ తో వస్తుంది.  ఈ కారు నియంత్రణ మరియు స్టీరింగ్ బరువు నగర మరియు హైవే రోడ్లకు తగ్గట్టుగా ఉంటుంది. ఈ మెరుగైన హ్యాండింగ్ కి కారణం ఎస్ క్రాస్ ఒక కృత్రిమ స్టీరింగ్ భావాన్ని మరియు మృదువైన సస్పెన్షన్ సెటప్ అందించకపోవడం. దీని పొడవైన వీల్బేస్ కూడా డ్రైవర్ నమ్మకానికి స్పూర్తిని ఇస్తుంది.   

ఇంధన సామర్ధ్యం:

ఈ హాచ్బాక్  ఎస్యువియొక్క సౌకర్యంతో   మంచి ఇంధన సామర్ధ్యం అందిస్తుంది. మారుతీ ఎస్-క్రాస్ 1.6 లీటర్ డీజిల్ వేరియంట్ కొరకు 22.7km/l సామర్థ్యాన్ని  అందిస్తుంది. ఈ ప్రొజెక్షన్ టొయోటా ఎతియోస్ క్రాస్ 23.6km/l  కి కూడా ఉంది. ఇది ఎస్-క్రాస్ కంటే, 0.9km/l  ఎక్కువ అందిస్తుంది.

ధర:

ధర పరిశీలనలో కి తీసుకుంటే, మారుతి అందిస్తున్న విస్తృత సేవ నెట్వర్క్  మరియు ఎస్-క్రాస్ యొక్క అన్ని లక్షణాల కారణంగా ఎస్-క్రాస్ యొక్క ధర దాని పోటీ దారుల ధర కంటే ఎక్కువగానే ఉండవచ్చు. ఎస్ క్రాస్ ఉత్పత్తి  కాంపాక్ట్ ఎస్యువి మరియు ఒక క్రాస్ఓవర్ హాచ్బాక్  రెండు ప్రయోజనాలను అందిస్తుంది. అందువలనే, 1.6 లీటర్ వేరియంట్ రెనాల్ట్ డస్టర్ ధరకి ధాటిగా  మరియు 1.3 లీటర్ వేరియంట్  ఐ 20 ధరకి  పోటీగా ఉంది.

కాబట్టి మేము మారుతీ అందించబో యే క్రాసోవర్ గురించి ఎంతగానో ఎదురు చూస్తున్నాం. ఈ ఎస్-క్రాస్ ఉత్తమ శక్తిని, విశాలంగా మరియు అనేక లక్షణాలను కలిగి ఉంటుంది.  అందువలనే ఈ వాహనం చాలా ప్రతేఖంగా అనిపిస్తుంది.

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your Comment పైన మారుతి S-Cross 2017-2020

Read Full News

ట్రెండింగ్‌లో ఉందిహాచ్బ్యాక్ కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience