• English
  • Login / Register

మారుతి విటారా బ్రెజ్జా, హ్యుందాయ్ వెన్యూ ప్రత్యర్థి అయిన రెనాల్ట్ యొక్క కారు ఆటో ఎక్స్‌పో 2020 లో ప్రదర్శన కి ముందే టెస్టింగ్ చేయబడుతూ మా కంటపడింది

రెనాల్ట్ కైగర్ 2021-2023 కోసం sonny ద్వారా జనవరి 18, 2020 11:23 am ప్రచురించబడింది

  • 27 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

కొత్త సబ్ -4m SUV సమర్పణ ఈ ఏడాది చివర్లో ప్రారంభించబడుతుంది

  •  కొత్త రెనాల్ట్ HBC (కోడ్‌నేం) కవరింగ్ చేయబడి ఉండి మొదటిసారి మా కంటపడింది.
  •  కొనసాగుతున్న SUV ట్రెండ్ కి అనుగుణంగా స్ప్లిట్ హెడ్‌ల్యాంప్ సెటప్‌ ని పొందే అవకాశం ఉంది.
  •  దీనిలో 8 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, సెమీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి లక్షణాలు ఉంటాయి.
  •  కొత్త 1.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ ద్వారా ఇది పవర్ ని అందుకొనే  అవకాశం ఉంది.
  •  2020 రెండవ భాగంలో రెనాల్ట్ HBC భారతదేశంలో ప్రారంభించబడుతుంది.

Renault’s Maruti Vitara Brezza, Hyundai Venue Rival Spied Testing Ahead Of Unveil At Auto Expo 2020

రెనాల్ట్ సంస్థ ఫిబ్రవరి లో జరగబోయే ఆటో ఎక్స్‌పో 2020 లో సబ్ -4m SUV విభాగంలోకి ప్రవేశించనున్నది. HBC అని పేరు పెట్టబడిన ఇది ఇప్పుడు కవరింగ్ తో కప్పబడి ఉండి, మొదటిసారిగా రోడ్ పైన టెస్టింగ్ చేయబడుతూ మా కంటపడింది. మా కంటపడిన  HBC బంపర్‌ పై మల్టీ-రిఫ్లెక్టర్ LED ల్యాంప్స్ ని కలిగి ఉంది, ఇది బోనెట్ లైన్ క్రింద టర్న్ ఇండికేటర్స్ మరియు DRL లతో ఉంటుంది. దీని ఫ్రంట్ ఎండ్ ఆకారం క్యాప్టూర్ మరియు ట్రైబర్ వంటి ఇతర రెనాల్ట్ సమర్పణల మాదిరిగానే కనిపిస్తుంది. దీని వెనుక భాగం రూఫ్ లైన్ ముగిసే చోట నుండి కొంచెం బయటకు వస్తుంది, ఇది మార్కెట్ లో అందుబాటులో ఉన్న కొన్ని సబ్ -4m SUV ల కంటే తక్కువ బాక్సీగా కనిపిస్తుంది.    

Renault’s Maruti Vitara Brezza, Hyundai Venue Rival Spied Testing Ahead Of Unveil At Auto Expo 2020

రాబోయే రెనాల్ట్ సబ్ -4 m SUV ట్రైబర్ సబ్ -4m MPV క్రాస్‌ఓవర్ మాదిరిగానే అదే ప్లాట్‌ఫార్మ్ పై ఆధారపడి ఉంటుంది. ఒకవేళ HBC కి 2636 మిమీ ట్రైబర్ మాదిరిగానే  వీల్‌బేస్ ని కలిగి ఉంటే, ఇది సబ్ -4 m SUV విభాగంలో అత్యంత విశాలమైన సమర్పణలలో ఒకటి అవుతుంది.     

కామోతో కప్పబడిన HBC లోపలి భాగాన్ని మేము బాగా చూడలేకపోయినప్పటికీ, ఇది ట్రైబర్ మాదిరిగానే 8.0-ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ డిస్‌ప్లే ను కలిగి ఉన్నట్లు అనిపిస్తుంది. కానీ డాష్‌బోర్డ్ లేఅవుట్ భిన్నంగా ఉంటుంది, ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ డాష్‌బోర్డ్‌ను కొద్దిగా బయటకు తీస్తుంది. ప్రొడక్షన్-స్పెక్ మోడల్ దాని కనెక్ట్ చేయబడిన కార్ టెక్నాలజీతో పాటు సెమీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్‌ను అందించవచ్చు.   

Renault’s Maruti Vitara Brezza, Hyundai Venue Rival Spied Testing Ahead Of Unveil At Auto Expo 2020

భారతదేశంలో HBC 2020 ద్వితీయార్ధంలో ప్రారంభించబడుతుంది. రెనాల్ట్ తన 1.0-లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్‌ తో మాన్యువల్ మరియు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ రెండింటి ఎంపికతో మాత్రమే అందిస్తుందని భావిస్తున్నారు. 2020 ఏప్రిల్ తరువాత BS 6 శకంలో డీజిల్ పవర్‌ట్రైన్‌లను తీసేయాలని రెనాల్ట్ నిర్ణయించినందున డీజిల్ ఎంపికలు ఇక మీదట ఉండవు.    

దీని ధర ప్రారంభం నాటికి రూ .7 లక్షల నుంచి రూ .10 లక్షల మధ్య ఉంటుందని అంచనా. ఇది మారుతి సుజుకి విటారా బ్రెజ్జా, హ్యుందాయ్ వెన్యూ, టాటా నెక్సాన్, మహీంద్రా XUV 300, ఫోర్డ్ ఎకోస్పోర్ట్, మరియు రాబోయే కియా QYI వంటి వాటితో పోటీ పడనుంది.  

చిత్ర మూలం

మరింత చదవండి: హ్యుందాయి వెన్యూ ఆన్ రోడ్ ప్రైజ్

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your Comment on Renault కైగర్ 2021-2023

Read Full News

ట్రెండింగ్‌లో ఉంది ఎస్యూవి కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience