డస్టర్ ఫేస్లిఫ్ట్ ను 2016 ఆటో ఎక్స్పో వద్ద బహిర్గతం చేసిన రెనాల్ట్
రెనాల్ట్ డస్టర్ 2016-2019 కోసం raunak ద్వారా ఫిబ్రవరి 06, 2016 04:10 pm ప్రచ ురించబడింది
- 13 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
రెనాల్ట్ ఇండియా, జరుగుతున్న 2016 ఆటో ఎక్స్పో వద్ద నవీకరించబడిన డస్టర్ ను బహిర్గతం చేసింది. నవీకరించబడిన అంశాలతో పాటు, ఈ నవీకరించబడిన డస్టర్ యొక్క కీలకమైన అంశం ఏమిటంటే, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ తో డీజిల్ ఇంజన్. అంతేకాకుండా, కాంపాక్ట్ ఎస్యువి అయిన హ్యుందాయ్ క్రెటా వాహనం మాత్రమే ఆటోమేటిక్ ఎంపికతో పాటు డీజిల్ ఇంజన్ తో అందించబడుతుంది.
యాంత్రిక నవీకరణల విషయానికి వస్తే, ఈ వాహనం లో ఉండే ఇంజన్ అత్యధికంగా 110 పి ఎస్ పవర్ ను విడుదల చేసే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. ఈ ఇంజన్, రెనాల్ట్ యొక్క ఈజీ ఆర్ (ఏ ఎం టి) ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ తో వస్తుంది. ఈ ఏ ఎం టి, డస్టర్ యొక్క 6- స్పీడ్ మాన్యువల్ యూనిట్ పై ఆధారపడి ఉంటుంది. వీటన్నింటితో పాటు ఈ డస్టర్ వాహనం, ఏడబ్ల్యూడి డ్రైవ్ తో పాటు అన్ని యాంత్రిక ఎంపికలతో వస్తుంది.
స్టైలింగ్ మార్పుల జత విషయానికి వస్తే, ఈ వాహనం యొక్క ముందు భాగం ఒక కొత్త ట్విన్ స్లాట్ గ్రిల్ తో పాటు రెనాల్ట్ సంస్థ యొక్క ప్రముక చిహ్నం అందించబడుతుంది. ఈ కొత్త గ్రిల్ కు ఇరువైపులా, మార్పు చేయబడిన డ్యూయల్ బేరల్ హెడ్ ల్యాంప్లు బిగించబడి ఉంటాయి. ముందు బంపర్ కూడా, కొన్ని మార్పులను చోటు చేసుకుంది. చాలా వరకు మార్పులు అన్నియూ కూడా వాహనం యొక్క ముందు భాగంలోనే చోటుచేసుకున్నాయి మరియు వీటి వలన ఈ వాహనానికి ఒక కొత్త లుక్ అందించబడింది. రెనాల్ట్ సంస్థ ఈ వాహనం యొక్క సైడ్ ప్రొఫైల్ కు కొన్ని మార్పులను అందించింది. మరోవైపు ఈ వాహనానికి, డస్టర్ బ్రాండింగ్ తో పాటు కొత్త అల్లాయ్ వీల్స్ మరియు రూఫ్ రైల్ వంటి అంశాలు అందించబడ్డాయి.
ఈ వాహనం యొక్క అంతర్భాగం విషయానికి వస్తే, ఈ 2016 డస్టర్ వాహనం కొత్త సెంటర్ కన్సోల్ తో పాటు ఆటో ఏసి మరియు మార్పు చేయబడి ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి అంశాలు అందించబడ్డాయి. వీటన్నింటితో పాటు ఈ వాహనానికి, 7- అంగుళాల రెనాల్ట్ యొక్క మీడియా నావ్ టచ్ స్క్రీన్ సమాచార వ్యవస్థ తో పాటు నవీకరణలు మరియు కొన్ని చిన్న చిన్న మార్పులు వంటివి ఈ రెనాల్ట్ డస్టర్ వాహనం లో చూడవచ్చు.