• English
  • Login / Register

కేవలం కైగర్ యొక్క 1 వేరియెంట్ ధరను మాత్రమే తగ్గించిన రెనాల్ట్

రెనాల్ట్ కైగర్ 2021-2023 కోసం rohit ద్వారా మే 03, 2023 02:56 pm ప్రచురించబడింది

  • 29 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

కైగర్ RXT (O) వేరియెంట్ అలాయ్ వీల్స్, LED లైటింగ్ మరియు టచ్ؚస్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ؚతో వస్తుంది

Renault Kiger

  • రెనాల్ట్, RXT (O) MT ధరను రూ.25,000 వరకు తగ్గించింది, ఇప్పుడు దీని రూ.7.99 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరతో అందిస్తుంది. 

  • RXT (O) 8-అంగుళాల టచ్ؚస్క్రీన్ మరియు 16-అంగుళాల డ్యూయల్-టోన్ అలాయ్ వీల్స్‌తో వస్తుంది. 

  • దీని భద్రత కిట్ؚలో నాలుగు ఎయిర్ బ్యాగ్ؚలు, ESP, మరియు రివర్సింగ్ కెమెరా ఉంటాయి.

  • ఈ SUVలో రెండు పెట్రోల్ ఇంజన్ ఎంపికలు ఉంటాయి: 1-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ యూనిట్ మరియు 1-లీటర్ టర్బో-పెట్రోల్ యూనిట్.

  • రెనాల్ట్ కైగర్ ధర రూ.6.5 లక్షల నుండి రూ.11.23 లక్షలుగా (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) ఉంది.

టాప్ వేరియెంట్ కంటే దిగువ స్థానంలో ఉన్న రెనాల్ట్ కైగర్ RXT (O) వేరియెంట్ ఇటీవలే కొన్ని అప్‌డేట్‌లను పొందింది, ఇవి కేవలం మాన్యువల్ ఎంపికకు మాత్రమే వర్తిస్తాయి. ఒక ప్రధాన ఫీచర్ అప్ؚగ్రేడ్ؚతో పాటుగా దీని ధరను కూడా తగ్గించారు.

సవరించిన ధర, మునపటి ఫీచర్‌ల జాబితా 

ఇప్పటి వరకు, రెనాల్ట్ RXT (O) MT ధర రూ.8.24 లక్షలుగా ఉంది, కానీ ఇది ప్రస్తుతం రూ.7.99 లక్షలకు అందిస్తున్నారు, అంటే దీని ధర రూ. 25,000 తగ్గింది. 

8-అంగుళాల టచ్ؚస్క్రీన్, LED హెడ్ؚలైట్‌లు మరియు టెయిల్ లైట్‌లు మరియు 16-అంగుళాల డ్యూయల్-టోన్ అలాయ్ వీల్స్ؚతో సహా ప్రస్తుత ఫీచర్‌ల సెట్ؚను ఇది కొనసాగిస్తుంది.

ఇటీవలి భద్రత అప్ؚడేట్

Renault Kiger ESP
Renault Kiger hill-start assist

కైగర్ؚతో సహా రెనాల్ట్ తన అన్ని కార్‌ల భద్రత ఫీచర్‌లను ఫిబ్రవరి 2023లో అప్ؚడేట్ చేసింది. ఈ SUV ప్రస్తుతం ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రాం (ESP), ట్రాక్షన్ కంట్రోల్, హిల్-స్టార్ట్ అసిస్ట్ మరియు టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ؚలతో (TPMS) ప్రామాణికంగా అందించబడుతుంది. ఇతర భద్రత ఫీచర్‌లలో నాలుగు ఎయిర్ బ్యాగ్ؚలు మరియు రివర్సింగ్ కెమెరా ఉన్నాయి.

ఇది కూడా చదవండి: ఆధునిక బ్రేక్-ఇన్ పద్ధతుల గురించి ఉన్న అపోహలు మరియు పద్దతులను విస్మరించడం

రెండు పెట్రోల్ ఇంజన్ ఎంపికలు 

కైగర్ 1-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ యూనిట్ (72PS/96Nm) మరియు 1-లీటర్ టర్బో-పెట్రోల్ (100PS/160Nm) రెండు పెట్రోల్ ఇంజన్ ఎంపికలను అందిస్తుంది. ఇవి రెండూ ప్రామాణికంగా 5-స్పీడ్‌ల మాన్యువల్ ట్రాన్స్ؚమిషన్ మరియు ఆటోమ్యాటిక్ ట్రాన్స్ؚమిషన్ؚకు జోడించబడ్డాయి, ఇందులో మొదటి దాని కోసం 5-స్పీడ్‌ల AMT మరియు రెండవ దాని కోసం CVT ఎంపిక కూడా ఉంది.

ధరలు మరియు పోటీదారులు

Renault Kiger rear

రెనాల్ట్ కైగర్ ధర రూ.6.50 లక్షలు నుండి రూ.11.23 లక్షల వరకు ఉంది. టాటా నెక్సాన్, మారుతి బ్రెజ్జా, మరియు నిసాన్ మాగ్నైట్ వంటి సబ్-4మీ SUVలకి పోటీదారుగా కైగర్ నిలుస్తుంది, అంతేకాకుండా సిట్రియోన్ C3, మారుతి ఫ్రాంక్స్ మరియు రానున్న హ్యుందాయ్ ఎక్స్టర్ వంటి క్రాస్-హ్యాచ్ؚలతో కూడా పోటీ పడుతుంది.

అన్నీ ఎక్స్-షోరూమ్ ఢిల్లీ ధరలు

ఇక్కడ మరింత చదవండి: రెనాల్ట్ కైగర్ AMT

was this article helpful ?

Write your Comment on Renault కైగర్ 2021-2023

ట్రెండింగ్‌లో ఉంది ఎస్యూవి కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience