లిమిటెడ్ ఎడిషన్ డస్టర్ ఎక్స్ప్లోర్ ని ప్రారంభించిన రెనాల్ట్ సంస్థ

రెనాల్ట్ డస్టర్ 2016-2019 కోసం arun ద్వారా సెప్టెంబర్ 02, 2015 10:14 am ప్రచురించబడింది

  • 11 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

ముంబై: రెనాల్ట్ ఇండియా నేడు రెనాల్ట్ డస్టర్ ఎక్స్ప్లోర్ ఎడిషన్ ను ప్రారంభించింది. రెనాల్ట్ సంస్థ, లిమిటెడ్ ఎడిషన్ ఎక్స్ప్లోర్ ' సాహసానికి సారాంశం అని మరియు కొత్త వాటిని అన్వేషించడంలో అత్యద్భుతమైన ఆత్మ విశ్వాశాన్ని ప్రదర్శిస్తుందని  ' తెలిపింది.     

'నోయ్వేయు ఆరంజ్' రంగు ఈ లిమిటెడ్ ఎడిషన్ లో ఉంది. రెనాల్ట్ సంస్థ ఈ వాహనంలో అంతర్భాగాలని మరియు బాహ్య భాగాలని ఆరెంజ్ చేరికలతో అలంకరించింది.  

దీనిలో బాహ్య స్వరూపాల విషయానికి వస్తే, డస్టర్ అడ్వంచర్ ఎడిషన్ లో ఉన్న బంపర్ వలే ఒకేవిధమైన రెండు ల్యాంప్స్ తో అమర్చబడియున్న బంపర్ ని కలిగి ఉంది. అంతేకాక,రెనాల్ట్ లోగో చుట్టూ ఆరెంజ్ రంగు చేరికలు,  బోనెట్ వెంట ఆఫ్-సెట్ గీతలు మరియు నల్లటి రంగు వింగ్ మిర్రర్స్ పైన ఆరెంజ్ గీతలు వంటివి కలిగి ఉంది. దీనిలో బి మరియు డి పిల్లర్స్ మాట్టే నలుపు ట్రీట్మెంట్ ని పొంది ఉన్నాయి. అయితే మాట్టే నలుపు  స్టికర్ ఎక్స్ప్లోర్ బ్యాడ్జింగ్ తో ప్రక్క బోర్డ్  వరకూ ఉంది. 

   

కొత్త లిమిటెడ్ ఎడిషన్ డస్టర్ గురించి భారతదేశంలో రెనాల్ట్ ఇండియా ఆపరేషన్ యొక్క సిఇఓ మరియు మానేజింగ్ డైరెక్టర్ మిస్టర్ సుమిత్ సావ్నే మాట్లాడుతూ " డస్టర్ తో, మేము భారత ఆటోమొబైల్ పరిశ్రమలో ఒక కొత్త విభాగం రూపొందించాము. డస్టర్ భారతదేశం లో రెనాల్ట్ యొక్క పెరుగుదల ప్రణాళికలో ఒక కీలక పాత్ర పోషిస్తుంది. ఒక ముందుచూపు గల సంస్థగా, కస్టమర్ అంచనాలను మరియు భారతదేశపు ప్రియమైన ఎస్యువి పై వారికి ఉండే నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకొని మేము డస్టర్ ని  తాజా మరియు సమకాలీన డస్టర్ గా ఉంచాము. డస్టర్ ఈ విభాగంలో అత్యున్నత స్థాయికి చేరుకుంటుందని నమ్మకంగా ఉన్నాము. అంతేకాకుండా ఈ కొత్తగా ప్రారంభించబడిన  లిమిటెడ్ ఎడిషన్ డస్టర్ ఎక్స్ప్లోర్ భారతదేశంలో డస్టర్  బ్రాండ్ యొక్క గొప్పతనాన్ని మరింతగా పెంచుతుందని పూర్తిగా విశ్వసిస్తున్నాము." అని తెలిపారు. 

 

దీనిలో అంతర్భాగాలు ఆరెంజ్ రంగులో ఆకర్షణీయంగా ఉన్నాయి. దీనిలో ఆరెంజ్ రంగు చేరికలు ఏ.సి వెంట్లపైన, సీట్లపై మరియు ఫ్లోర్ మ్యాట్స్ పైన కూడా ఉండి చూపరులను ఆకట్టుకుంటున్నాయి. ఇంకా దీనిలో గేర్ షిఫ్ట్ క్రింద ఆరెంజ్ కుట్లు ఉండగా, స్టీరింగ్ వీల్ లెథర్ తో చుట్టబడి ఉంది. అంతేకాక,చిన్న చిన్న మెరుగులు, స్విచ్చులపైన నల్లటి లైట్ మరియు నాబ్స్ మరియు ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ చుట్టూ హైలైట్ అంతా కూడా నోయ్వేయు ఆరెంజ్ రంగుతో అద్భుతంగా ఉండేలా చేసిన రెనాల్ట్ యొక్క ఆవశ్యకతను మెచ్చుకోవాల్సిందే.    

ఈ లిమిటెడ్ ఎడిషన్ డస్టర్ ఎక్స్ప్లోర్ యాంత్రికంగా ఎటువంటి మార్పుని పొందలేదు. హుడ్ క్రింద శక్తివంతమైన 1.5 డిసి ఐ ఇంజిన్ తో అమర్చబడి ఉంది. ఇది రెండు రకాల వేరియంట్లలో అందుబటులో ఉంది. ఒకటి  లిమిటెడ్ ఎడిషన్ డస్టర్ 85 పిఎస్ ఆర్ఎక్స్ఎల్ ఎక్స్ప్లోర్ మరియు ఇంకోటి లిమిటెడ్ ఎడిషన్ డస్టర్ 110 పిఎస్ ఆర్ఎక్స్ఎల్ ఎక్స్ప్లోర్. దీనిలో లిమిటెడ్ ఎడిషన్ డస్టర్ 85 పిఎస్ ఆర్ఎక్స్ఎల్ ఎక్స్ప్లోర్ రూ. 9.99 లక్షల ధర కాగా ఇంకోటి రూ. 11.10 లక్షలు (ఎక్స్-ఢిల్లీ) ధరతో అందుబాటులో ఉంది.

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your Comment పైన రెనాల్ట్ డస్టర్ 2016-2019

Read Full News

ట్రెండింగ్‌లో ఉందిఎస్యూవి కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience