• English
  • Login / Register

రెనాల్ట్ డస్టర్ ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్ప్లే లతో ప్రారంభం

రెనాల్ట్ డస్టర్ 2016-2019 కోసం raunak ద్వారా మార్చి 26, 2019 11:25 am ప్రచురించబడింది

  • 14 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి
  • రెనాల్ట్ యొక్క తాజా 7- అంగుళాల మీడియా నావ్ ఎవల్యూషన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఇప్పుడు భారతదేశంలో చివరకు అందుబాటులో ఉంది.

  • మధ్య శ్రేణి వేరియంట్ అయిన డస్టర్ ఆర్ ఎక్స్ ఎల్ పెట్రోల్ మరియు అగ్ర శ్రేణి డస్టర్ ఆర్ఎక్స్జెడ్  ల యొక్క డీజిల్ ఏఎంటి లు నిలిపివేయబడ్డాయి; ప్రస్తుతం వేరియంట్ లైనప్, మూడుకి పడిపోయింది అవి వరుసగా (ఆర్ఎక్స్ఈ, ఆర్ఎక్స్ఎస్ మరియు ఆర్ఎక్స్జెడ్).

  • అగ్ర శ్రేణి ఆర్ఎక్స్జెడ్ వేరియంట్ ప్రస్తుతం డీజిల్- మాన్యువల్ పవర్ ట్రైన్ ఎంపికతో ప్రత్యేకంగా అందుబాటులో ఉంది.

  • డస్టర్ ఇప్పటికీ ప్రామాణికంగా ఎయిర్ బాగ్లను పొందదు.

  • ధర పరిధి రూ 7.99 లక్షల నుంచి రూ .13.09 లక్షలు (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ).

  • రెండవ తరం డస్టర్ ఈ ఏడాది చివరిలో గాని లేదా 2020 ఆటో ఎక్స్పోలో ప్రారంభం కానుంది.

Renault Duster రెనాల్ట్ ఇండియా, తన కాంపాక్ట్ ఎస్యువి అయిన డస్టర్ను, 2019 సంవత్సరానికి వినియోగదారులకు అవసరమైన నవీకరణలతో అందిస్తుంది. ఫ్రెంచ్ కార్ల తయారీ సంస్థ, డస్టర్ యొక్క వేరియంట్ విభాగ శ్రేణిని తిరిగి పొందింది మరియు కొత్త ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ను ప్రవేశపెట్టింది.

ముందు నివేదించినట్లుగా, 2019 డస్టర్ ఇప్పుడు రెనాల్ట్ / డేసియా యొక్క తాజా మీడియా నావ్ ఎవల్యూషన్ అకా మీడియా నావ్ 4.0 ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ తో వస్తుంది. ఈ కొత్త యూనిట్, ఆపిల్ కార్ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటోలకు మద్దతు ఇస్తుంది. అక్టోబర్లో 2018 ప్యారిస్ మోటార్ షోలో కొత్త ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ను కంపెనీ ప్రకటించింది మరియు 2019 జనవరిలో తన కొత్త మోడళ్లలో నూతన యూనిట్ ను ప్రవేశపెట్టింది.

ఈ కొత్త ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, ప్రాథమిక నమూనాను అలాగే మునుపటి వెర్షన్ లో కనిపించే సింగ్నేచర్ బ్లాక్- టైప్ యూజర్ ఇంటర్ఫేస్ (యూఐ) ను ముందుకు తీసుకువెళుతున్నప్పటికీ, ఈ సిస్టం ఇప్పుడు ఒక కెపాసిటివ్ టచ్ స్క్రీన్ ప్యానెల్ (స్మార్ట్ఫోన్- వంటిది) ను కలిగి ఉంటుంది. పాత యూనిట్, పాత రకం స్విచ్చులతో కూడిన రెసిస్టివ్ టచ్స్క్రీన్ను కలిగి ఉంది. కొత్త యూనిట్ కూడా వేగవంతమైన ప్రాసెసర్ను కలిగి ఉంది అని రెనాల్ట్ పేర్కొంది. దిగువ శ్రేణి వేరియంట్ ఆర్ఎక్స్ఈ మినహా, మిగిలిన ఆన్ని వేరియంట్ లలో కొత్త ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అందుబాటులో ఉంది. 

తాజా నవీకరణ ఏమి చెబుతుందంటే, రెండవ తరం మోడల్ త్వరలోనే ప్రవేశపెడుతుందని మరియు ప్రస్తుతం ఉన్న డస్టర్ అంతరించిపోతుందని తెలుసుంది. దురదృష్టకరమైన విషయం ఏమిటంటే, నూతన సంవత్సరం లొ నవీకరించబడిన డస్టర్లో కూడా రెనాల్ట్ ఎయిర్బ్యాగ్లను ప్రామాణికం చేయలేదు, అది ఎంట్రీ-స్థాయి మోడల్ అయినప్పటికీ అందించబడటం లదు. కానీ, క్విడ్ ఇప్పుడు డ్రైవర్ ఎయిర్బ్యాగ్ను ప్రామాణికంగా పొందుతుంది. కాబట్టి రెనాల్ట్, ఇప్పటికే ఉన్న డస్టర్ లో మరింత నవీకరణను అందించాలని లేదా రెండవ తరం మోడల్ లో అయినా ప్రామాణికంగా అందించాలని భావిస్తున్నాము.

 • 2019 రెనాల్ట్ డస్టర్: ఏ ఏ అంశాలను ఆశించవచ్చు

2019 నవీకరణతో, రెనాల్ట్ సంస్థ డస్టర్ యొక్క కొన్ని రకాల వేరియంట్ లను కూడా నిలిపివేసింది. మధ్య శ్రేణి ఆర్ ఎక్స్ ఎల్ పెట్రోల్ (రూ 8.79 లక్షలు) మరియు అగ్ర శ్రేణి వేరియంట్ ఆర్ ఎక్స్ జెడ్ డీజిల్ ఏ ఎం టి(రూ. 12.33 లక్షలు) వేరియంట్లు అందుబాటులో లేవు. 2019 రెనాల్ట్ డస్టర్ యొక్క ప్రస్తుత ధర శ్రేణి ఈ క్రింది విధంగా ఉంది:

 

రెనాల్ట్ డస్టర్

పెట్రోల్

డీజిల్ 85 పిఎస్

డీజిల్ 110 పిఎస్

ఆర్ఎక్స్ఈ

రూ 7.99 లక్షలు

రూ 9.19 లక్షలు

 

ఆర్ఎక్స్ఎస్

రూ 9.19 లక్షలు

రూ. 9.99 లక్షలు

 

ఆర్ఎక్స్ఎస్ సివిటి

రూ. 9.99 లక్షలు

 

 

ఆర్ఎక్స్ఎస్ ఏఎంటి

 

 

రూ 12.09 లక్షలు

ఆర్ ఎక్స్ జెడ్

 

రూ 11.19 లక్షలు

రూ 12.09 లక్షలు

ఆర్ఎక్స్జెడ్ ఏడబ్ల్యూడి

 

 

రూ. 13.09 లక్షలు

 

* అన్ని ధరలు, ఎక్స్-షోరూమ్ ఢిల్లీ

తనిఖీ: మహీంద్రా ఎక్స్యూవి300: 52 చిత్రాలు

మరింత చదవండి: డస్టర్ ఏఎంటి

was this article helpful ?

Write your Comment on Renault డస్టర్ 2016-2019

ట్రెండింగ్‌లో ఉంది ఎస్యూవి కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience