ఎవల్యూషన్ వీడియో: 48 సంవత్సరాలుగా కొనసాగుతున్న రేంజ్ రోవర్
ల్యాండ్ రోవర్ పరిధి rover 2014-2022 కోసం raunak ద్వారా మార్చి 18, 2019 10:43 am ప్రచురించబడింది
- 17 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
రేంజ్ రోవర్ అంటే, లగ్జరీ మరియు ఆఫ్ రోడ్డింగ్ వంటి లక్షణాలకు పర్యాయపదంగా ఉంది, ప్రపంచంలోని అర్ధ శతాబ్దపు కాలాన్ని కలిగి ఉన్న ఈ కారు లీగ్లో చేరడానికి రెండు సంవత్సరాల కాలం పట్టింది. ఇదిలా ఉంటే, టాటా యాజమాన్యంలోని ఆఫ్ రోడ్ తయారీదారుడు ఒక ఎవల్యూషన్ వీడియోను విడుదల చేసింది, రేంజ్ రోవర్లో జరుగుతున్న అనేక ఇంజనీరింగ్ ఆవిష్కరణలను 48 ఏళ్ళ పాటు జరిగిన వాటిని ప్రదర్శిస్తూ, అత్యంత శక్తివంతమైన మోడల్ అలాగే 550 పిఎస్ ఎస్వి ఆటోబయోగ్రఫీ డైనమిక్ మోడల్ ను ప్రపంచవ్యాప్తంగా ప్రదర్శించింది. ల్యాండ్ రోవర్, రేంజ్ రోవర్ యొక్క అమ్మకాలను విడుదల తేదీ నుండి ఒకటి కంటే ఎక్కువ మిలియన్ యూనిట్లు అమ్ముడవుతోంది (ఇప్పటి వరకు 1.7 మిలియన్ల వాహనాలను అమకాలను జరిపింది). మేము ల్యాండ్ రోవర్ పరిశ్రమను తిరిగి అన్వేషించాము ఇక్కడ తెలిసిన విషయం ఏమిటంటే 48 ఏళ్ళ నుండి ప్రపంచంలో అత్యంత విలాసవంతమైన ఎస్యూవి లను ప్రవేశపెట్టడంలో ఆరి తేరింది.
ల్యాండ్ రోవర్ చీఫ్ డిజైన్ ఆఫీసర్ గెర్రీ మెక్గోవేర్న్ మాట్లాడుతూ: "రేంజ్ రోవర్ కాలక్రమేణా, దాని యొక్క రూపం ప్రగతిశీల పరిణామం ద్వారా ఐకానిక్ రూపకల్పన స్థితిని సాధించింది, ఇది అద్భుతమైన వాహనంతో ముగిసింది. దాని అంతర్గత రూపకల్పన అలాగే ఎక్స్టీరియర్స్ పరంగా చాలా అద్భుతంగా ఉంది మరియు అధునాతన అలాగే సున్నితమైన దృక్పథాల నుండి శక్తివంతమైనదిగా నిలుస్తుంది. ఈ రకమైన వాహనాలలో ఇది ఒకటే అగ్ర స్థాయిలో ఉన్నదని తెలిపారు.
మొదటి తరం
ల్యాండ్ రోవర్ ప్రకారం, ఇది 26 తయారీ నమూనాలతో సంస్థ ను ప్రారంభించింది, వీటిలో అన్ని వెలార్ బాడ్జ్ ను కలిగి ఉన్నాయి. వెలార్ అనేది ఇటాలియన్ పదం 'వెలేఋ నుండి వచ్చింది, దీని అర్థం వైల్. ఇది చాలా అందమైన గుర్తు, కాదంటారా? ముఖ్యంగా, పరీక్ష చేయవలసిన వాహనాలు ఎల్లప్పుడూ ర్యాప్ చేయబడి ఉంటాయి. మొట్టమొదటి తరం వాహనం 1970 లో విక్రయించబడింది, అంతేకాకుండా పర్మెనెంట్ ఆల్ వీల్ డ్రైవ్ తో ప్రపంచంలో అడుగుపెట్టిన మొట్టమొదటి ఎస్యువి గా మారింది. ఇది రెండు డోర్లను కలిగిన వాహనంగా అందుబాటులోకి వచ్చింది. ఐరోపావాసుల యొక్క వంపుని పునరుద్ఘాటిస్తూ అందుబాటులోకి వచ్చాయి. మొదటి- తరం మోడల్ లెజండరీ పారిస్- డాకర్ ర్యాలీ యొక్క ప్రారంభ ఎడిషన్ను గెలుపొందడంతో ఇది ఒక ఆఫ్ రోడ్ వాహనంగా నిరూపించబడింది. రంజీస్ యొక్క ట్రేడ్మార్క్ లక్షణం, నేటికి కూడా అదే ఫ్లోటింగ్ రూఫ్ తో కొనసాగుతుంది, మూడు సంవత్సరాల తర్వాత రేంజ్ రోవర్ తొలిసారిగా ప్రవేశపెట్టబడింది.
1981లో, ల్యాండ్ రోవర్ సంస్థ- రేంజ్ రోవర్ యొక్క మొదటి తరం వాహనాన్ని నాలుగు డోర్లను కలిగిన వెర్షన్ను ప్రవేశపెట్టింది. మరియు దాని ఫ్లోటింగ్ రూఫ్ ప్రభావం మరింత నల్లగా ఉన్న పిల్లార్ లతో కూడి ఉంది. ఇంతలో చాలా రకాల వాహనాలు ప్రవేశపెట్టబడ్డాయి అయినప్పటికీ, ఎనిమిది సంవత్సరాల తర్వాత ప్రవేశపెట్టిన ఏబిఎస్ (యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్) ను కలిగి ఉన్న మొట్టమొదటి 4X4 కారుగా గుర్తింపు పొందింది. కొద్ది సంవత్సరాలలో, తయారీదారుడు కూడా ఎలక్ట్రానిక్ ట్రాక్షన్ కంట్రోల్ మరియు ఆటోమేటిక్ ఎయిర్ సస్పెన్షన్లను జోడించారు, ఇవి 4X4తో పరిశ్రమలో మొదటివిగా కూడా ఉన్నాయి.
రెండవ తరం
ల్యాండ్ రోవర్ రెండవ తరం మోడల్ను ప్రవేశపెట్టింది, ఇది 1994లో బాడీ ఆన్ ఫ్రేమ్ నిర్మాణాన్ని కలిగి ఉంది. ఇది మునుపటి తరం మోడల్ యొక్క బాక్సింగ్ సిల్హౌట్ను నిలుపుకుంది, అయితే ఇది మరింత కాంటెంపరరీ గా కనిపించడానికి శరీరంలో చిన్న చిన్న మార్పులను జోడించింది. ఇది డిరెక్ట్ ఇంజెక్టెడ్ ఆయిల్ బర్నర్లతో మొదటి సారి నడుపబడింది. ఏడు సంవత్సరాల తరువాత, రెండవ తరం మోడల్ 2001లో నిలిపివేయబడింది.
మూడవ తరం
2001లో వచ్చిన మూడవ- తరం రేంజ్ రోవర్తో, ల్యాండ్ రోవర్ ప్రపంచంలోని అత్యధిక సామర్ధ్యాలను కలిగిన ఆఫ్ రోడ్ వాహనాలలో ఒకటిగా మోనోకోక్ నిర్మాణాన్ని ప్రవేశపెట్టింది. మునుపటి రెండు తరాలతో పోలిస్తే, 2001 రేంజ్ రోవర్ చాలా వరకు మార్కెట్లోకి వెళ్ళింది మరియు ఎప్పటికీ అత్యంత ఆకర్షణీయమైన వాహనంగా ఉంది. అంతేకాకుండా, ముందు ఫెండర్లకు సైడ్ వెంట్లు వంటి అంశాన్ని ఈ మోడల్ నమూనాలో ప్రవేశపెట్టడం జరిగింది. రూపకల్పన అంశాలు దాని తదుపరి తరం మోడల్ రూపకల్పనకు ఆధారంగా పనిచేశాయి, అనగా ప్రస్తుత ఉన్న రేంజ్ రోవర్ కారు.
నాల్గవ తరం (ప్రస్తుత మోడల్)
రేంజ్ రోవర్ యొక్క ప్రస్తుత మరియు నాల్గవ అవతార్ 2012లో ఆరంగేట్రం చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఒక తేలికైన ఒక అల్యూమినియం బాడీని కలిగి ఉన్న మొట్టమొదటి ఎస్యూవి గా ఇది దాని స్వంత లీగ్లో పేరు గాంచింది. ఇది ల్యాండ్ రోవర్ యొక్క నూతన పురాణ ఏటిపిసి (ఆల్- టెరైన్ ప్రోగ్రస్స్డ్ నియంత్రణ) సాంకేతికత యొక్క ప్రారంభంలో కూడా గుర్తించబడింది, ఇది రోడ్లపై అడ్డంకులను అధిగమించి ఒక అల్ట్రా- లో క్రాల్ వేగంతో రూపొందించబడింది. ఈ తరం కూడా లాంగ్ వీల్బేస్ వెర్షన్ ను అలాగే ఆటోబయోగ్రఫీ లాంగ్ వీల్బేస్ వెర్షన్ను పునరుద్ధరించింది. ల్యాండ్ రోవర్ ఒక ఫస్ట్ క్లాస్ అనుభవాన్ని అందిస్తుందని పేర్కొంది.
రెండు డోర్ల రేంజ్ రోవర్తో ప్రారంభమైన ఈ ప్రయాణం ప్రస్తుతం రాంజీలో అత్యంత శక్తివంతమైన మోడల్ ను తీసుకొచ్చింది - అది ఏమిటంటే 550పిఎస్ ఎస్వి ఆటోబయోగ్రఫీ డైనమిక్ - జనవరి 2017 లో 48 సంవత్సరాల తరువాత ప్రవేశపెట్టబడింది. ఇంకా ఈ రేంజ్ రోవర్ అనేక సంవత్సరాలు ఇలాగే విజయవంతంగా కొనసాగాలని మేము కోరుకుంటున్నాము!
ల్యాండ్ రోవర్ యొక్క వీడియోను పరిశీలించండి
ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ ఇండియా గురించి మరింత సమాచారాన్ని చదవండి
0 out of 0 found this helpful