• English
    • లాగిన్ / నమోదు

    రేపు ప్రారంభం కావడానికి సిద్ధంగా ఉన్న రేంజ్ రోవర్ ఇవోక్ ఫేస్లిఫ్ట్

    నవంబర్ 19, 2015 11:20 am sumit ద్వారా ప్రచురించబడింది

    15 Views
    • ఒక వ్యాఖ్యను వ్రాయండి

    జైపూర్:

    ల్యాండ్ రోవర్ రేపు భారతీయ కారు మార్కెట్ లో దాని రేంజ్ రోవర్ ఇవోక్ ఫేస్లిఫ్ట్ ని బహిర్గతం చేసేందుకు సిద్ధంగా ఉంది. ఈ ఫేస్లిఫ్ట్ మోడల్ బాహ్యంగా మరియు అంతర్గతంగా కూడా చాలా సౌందర్యపరమైన మార్పులను పొందింది. దీనిలో పునః రూపకల్పన చేయబడిన బంపర్, పెద్ద ఎయిర్ ఇన్‌టేక్, ఎల్ఇడి అడాప్టివ్ హెడ్ ల్యాంప్స్ మరియు మరికొన్ని అధనపు లక్షణాలతో ఈ కారు వాహన ప్రియులను ఆకర్షణించే విధంగా ఉంది. రిఫ్రెష్ టెయిల్‌గేట్ స్పాయిలర్, ఎల్ఇడి టెయిల్ ల్యాంప్స్ మరియు అలాయ్ వీల్స్ యొక్క కొత్త సమితి  దాని మునుపటి దానితో పోలిస్తే దాదాపు కొత్తగా మరియు విభిన్నంగా ఉంది.  

    2016 రేంజ్ రోవర్ ఇవోక్ వాహనం పెద్ద రేంజ్ రోవర్ లో ఉన్నటువంటి అదే విధమైన ఆల్-టెర్రైన్ ప్రోగ్రెస్ కంట్రోల్ సిస్టమ్ ని కలిగి ఉంది. ఈ వాహనం అల్యూమినియం ఇగ్నీషియం TD4 టర్బోడీజిల్ ఇంజన్ ని కలిగి ఉండి, మునుపటి దానితో పోలిస్తే 20-30Kg తేలికగా ఉంటుంది. ఈ ఇంజిన్ 150bhp మరియు 180bhp రెండు రకాల శక్తిని అందిస్తుంది. అయితే 180bhp శక్తి అగ్ర శ్రేణి వేరియంట్లలో మాత్రమే అందించబడుతుంది. అంతేకాకుండా ఈ ఇంజిన్ గరిష్టంగా 420Nm టార్క్ ని అందిస్తుంది మరియు 9-స్పీడ్ ZF ట్రాన్స్మిషన్ వ్యవస్థతో జతచేయబడి ఉంటుంది.  

    సంబంధిత స్టొరీలు:

    ల్యాండ్-రోవర్ రేంజ్-రోవర్-ఇవోక్యూ

    was this article helpful ?

    Write your Comment on Land Rover రేంజ్ రోవర్ ఎవోక్ 2016-2020

    ట్రెండింగ్‌లో ఉంది ఎస్యూవి కార్లు

    • లేటెస్ట్
    • రాబోయేవి
    • పాపులర్
    *న్యూ ఢిల్లీ లో ఎక్స్-షోరూమ్ ధర
    ×
    మీ అనుభవాన్ని అనుకూలీకరించడానికి మాకు మీ నగరం అవసరం