Login or Register కోసం ఉత్తమ CarDekho experience
Login

MG కామెట్ EV పరిధి, బ్యాటరీ స్పెసిఫికేషన్‌ల వివరాలు!

ఎంజి కామెట్ ఈవి కోసం tarun ద్వారా ఏప్రిల్ 19, 2023 08:13 pm ప్రచురించబడింది

ఈ స్పెసిఫికేషన్‌లతో, దీన్ని టాటా టియాగో EV ఎంట్రీ-లెవెల్ వేరియెంట్‌లకు ప్రత్యర్ధిగా చూడవచ్చు.

  • కామెట్ EV 230 కిలోమీటర్‌ల క్లెయిమ్ చేసిన మైలేజ్‌తో కేవలం 17.3kWh బ్యాటరీ ప్యాక్‌ను మాత్రమే పొందుతుంది.

  • ఎలక్ట్రిక్ మోటార్ 42PS పవర్ మరియు 110Nm టార్క్‌ను అందిస్తుంది.

  • 3.3kW ఛార్జర్ؚతో, కామెట్ EV పూర్తిగా ఛార్జింగ్ అవ్వడానికిؚ ఏడు గంటలు సమయం పడుతుంది.

  • LED హెడ్ؚల్యాంప్ؚలు, డ్యూయల్ 10.25-అంగుళాల డిస్ప్లే స్క్రీన్ؚలు, ESC, హిల్ؚస్టార్ట్ అసిస్ట్, మరియు డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగ్ؚలు వంటి ఫీచర్‌లతో వస్తుంది.

  • ధరలు రూ.10 లక్షల నుండి రూ.15 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్) ఉంటాయని అంచనా.

MG కామెట్ EV విడుదలకు ముందు, దీని ఇండియా-స్పెక్ బ్యాటరీ మరియు పరిధి గణాంకాలతో సహా వివరణాత్మక బ్రోచర్ ఆన్ؚలైన్ؚలో లీక్ అయింది, ఈ ఎలక్ట్రిక్ కాంపాక్ట్ ఆఫ్‌లైన్ బుకింగ్ؚలు ప్రారంభం అయ్యాయని సమాచారం అందింది. ప్రత్యేకించి ఈ గణాంకాలతో, 2-డోర్‌ల ఈ కాంపాక్ట్ EV మాస్-మార్కెట్ నగర కొనుగోలుదారులను లక్ష్యంగా చేసుకుంది.

కామెట్ EV 17.3kWh బ్యాటరి ప్యాక్ మరియు 230 కిలోమీటర్‌ల క్లెయిమ్ చేసిన పరిధితో వస్తుంది. వెనుక-అమర్చిన ఎలక్ట్రిక్ మోటార్ 42PS పవర్ మరియు 110Nm గరిష్ట టార్క్‌ను అందిస్తుంది. 3.3kW ఛార్జర్‌తో, కామెట్ EV పూర్తిగా ఛార్జ్ కావడానికి ఏడు గంటల సమయం పడుతుంది మరియు 10-80 శాతం ఛార్జ్ అవ్వడానికి ఐదు గంటల సమయం పడుతుంది తీసుకుంటుంది. ఫాస్ట్ ఛార్జింగ్ సామర్ధ్యం కూడా అందిస్తారని ఆశిస్తున్నాము.

ఇది కూడా చదవండి: భారతదేశంలో విడుదల కానున్న ఎలక్ట్రిక్ కార్‌ల వివరాలు

విడుదల తరువాత, మూడు మీటర్‌ల కంటే తక్కువ పొడవుతో, మార్కెట్‌లో అందుబాటులో ఉండే అతి చిన్న కారుగా కామెట్ EV నిలుస్తుంది. అయితే, ఇందులో నలుగురు ప్రయాణించవచ్చు మరియు బూట్ స్పేస్ ఉన్నట్లుగా కనిపించడం లేదు. ఇంటీరియర్‌లను ఇప్పటికే వెల్లడించగా. అనేక ప్రీమియం ఫీచర్‌లతో, ప్రీమియం డిజైన్ؚతో కనిపిస్తుంది.

MG కామెట్ EVలో LED హెడ్‌ల్యాంపులు, టెయిల్ ల్యాంప్ؚలు, టచ్ؚస్క్రీన్ ఇన్ఫోటైన్ؚమెంట్ మరియు డ్రైవర్ డిస్ప్లే కోసం డ్యూయల్ 10.24-అంగుళాల డిస్ప్లేలు, మాన్యువల్ AC, స్టీరింగ్ؚకు అమర్చిన కంట్రోల్ؚలు, స్టీరింగ్ వీల్ కోసం టెలిస్కోపిక్ అడ్జస్ట్ؚమెంట్, కీలెస్ ఎంట్రీ, మరియు డ్రైవ్ మోడ్ؚలు ఉంటాయి. ప్రయాణీకుల భద్రత కోసం డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగ్ؚలు, EBDతో ABS, ESC, హిల్ స్టార్ట్ అసిస్ట్, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, మరియు వెనుక పార్కింగ్ కెమెరా కూడా ఉంటాయని అంచనా.

కామెట్ EV ధరలు త్వరలోనే వెల్లడిస్తారు అని ఆశిస్తున్నాము, ఇది రూ.10 లక్షల నుండి రూ.15 లక్షల (ఎక్స్-షోరూమ్) పరిధిలో ఉంటుందని అంచనా. 19.2kWh ప్యాక్ మరియు 250 కిలోమీటర్‌ల పరిధితో టాటా టియాగో EV ఎంట్రీ-లెవెల్ వేరియెంట్ؚలు MG మైక్రో-హ్యాచ్‌కు సరైన పోటీదారులుగా నిలుస్తాయి.

మూలం

t
ద్వారా ప్రచురించబడినది

tarun

  • 64 సమీక్షలు
  • 0 Comments

Write your Comment పైన ఎంజి Comet EV

Read Full News

ట్రెండింగ్‌లో ఉంది ఎలక్ట్రిక్ కార్లు

  • పాపులర్
  • రాబోయేవి
Rs.10.99 - 15.49 లక్షలు*
Rs.14.74 - 19.99 లక్షలు*
Rs.7.99 - 11.89 లక్షలు*
Rs.6.99 - 9.40 లక్షలు*
Rs.60.95 - 65.95 లక్షలు*
*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర