• English
  • Login / Register

క్రెటా లాంచ్ తర్వాత: ఎస్-క్రాస్, ఆ పోటీ ను తట్టుకోగలుగుతుందా?

మారుతి ఎస్-క్రాస్ 2017-2020 కోసం raunak ద్వారా జూలై 29, 2015 12:40 pm ప్రచురించబడింది

  • 11 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

జైపూర్: నివేదికలను మనం గమనించినట్లైతే, హ్యుందాయ్ ముందుగానే క్రెటా ప్రవేశపెట్టినప్పటికి దీనిని తట్టుకునేలా మారుతి సుజుకి, ఎస్-క్రాస్ ను రానున్న వారంలో ప్రవేశపెట్టబోతుంది. ఎస్-క్రాస్ తో పోలిస్తే, క్రెటా కు మార్కెట్ లో ఊహించలేనంత పుష్కలమైన ఆదరణ ఉంది అనేది మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అనుకున్నదానికంటే హ్యుందాయ్ క్రెటా ధర ఎక్కువ ఉంది మరియు ఈ కొరియన్ వాహన తయారీదారుడు ఈ వాహనానికి ఎక్కువ ధరను ఇచ్చినప్పటికీ ఈ వాహనానికి ఉండే క్రేజ్ వలన ఈ సంస్థ ఎక్కువ లాభాలను పొందే అంచనాలు ఉన్నాయి. అయితే, భారతదేశం యొక్క అతిపెద్ద ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ అయిన మారుతి సుజుకి, ఎస్ క్రాస్ ను మార్కెట్ లోకి వచ్చే వారం విడుదల చేయబోతుంది.

మందకోడిగా ఉన్న ఎస్ క్రాస్ తో పోలిస్తే, క్రెటా లుక్స్ పరంగా మరియు రోడ్ల పై ప్రదర్శన పరంగానైతే ఈ వాహనానికి మనం అధిక మార్కులను ఇవ్వవచ్చు. అయితే, యాంత్రికంగా చూసినత్లైతే, ఎస్-క్రాస్ ముందంజలో ఉంది అని చెప్పవచ్చు. ఈ ఎస్-క్రాస్ యొక్క హుడ్ క్రింది భాగానికి వస్తే, ఫియాట్ నుండి తీసుకోబడిన శక్తివంతమైన 1.6 లీటర్ మల్టిజెట్ ఇంజన్ తో రాబోతుంది. అంతేకాకుండా క్రెటా యొక్క 1.6 లీటర్ సి ఆర్ డి ఐ ఇంజన్ తో పోలిస్తే, ఎస్- క్రాస్ 1.6 లీటర్ మల్టిజెట్ ఇంజన్, 60 Nm ఎక్కువ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. అంటే, 320 Nm టార్క్ ను విడుదల చేస్తుంది. మరో చెప్పదగ్గ విషయం ఏమిటంటే, ఎస్-క్రాస్ లో ఆల్ రౌండ్ డిస్క్ బ్రేకింగ్ అందించబడుతుంది. అంతే, ఈ ఎస్-క్రాస్ ముందు బ్రేక్లను వెంటిలేటెడ్ డిస్క్ బ్రేక్లతో మరియు వెనుక వాటిని సాలిడ్ డిస్క్ బ్రేక్ల సమితి తో జత చేశారు. అదే క్రెటా విషయానికి వస్తే, వెనుక డిస్క్ బ్రేక్లను పొంది లేదు.

క్రెటా తో పోలిస్తే, ఎక్కువ టార్క్ ను విడుదల చేయడమే కాకుండా, అధిక మైలేజ్ ను కూడా అందిస్తుంది. క్రెటా 1.6 లీటర్ సి ఆర్ డి ఐ ఇంజన్, ఏ ఆర్ ఏ ఐ సర్టిఫికేషన్ ప్రకారం 19.37 kmpl మైలేజ్ ను అందిస్తుంది. అయితే, క్రెటా 1.4 లీటర్ సి ఆర్ డి ఐ ఇంజన్ అధికంగా 21.38 kmpl మైలేజ్ ను అందిస్తుంది. మరోవైపు, మారుతి సుజుకి ఎస్-క్రాస్, 1.6 లీటర్ డి డి ఐ ఎస్ డీజిల్ ఇంజన్, అధికంగా 22.7 kmpl మైలేజ్ ను అందించగా, 1.3 లీటర్ డి డి ఐ ఎస్ డీజిల్ ఇంజన్ 23.65 kmpl మైలేజ్ ను అందిస్తుంది.

వీటన్నింటినీ ప్రక్కన పెడితే, పైన పేర్కొన్న విధంగా లుక్ పరంగా చెప్పాలంటే ఎస్-క్రాస్ కంటే క్రెటా ఆకర్షణీయంగా కనబడుతుంది. అంతేకాకుండా ఎస్-క్రాస్ తో పోలిస్తే, క్రెటా లుక్స్ పరంగా చాలా ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా విభిన్న టెర్షరీ లలో చాలా ఆకర్షణీయంగా ఉంది. ఎస్-క్రాస్ లో పెద్ద హెడ్ల్యాంప్స్ మరియు ఎక్కువ మొత్తం లో మందకోడిగా ఉండటమే దీనికి ప్రతికూలత అని చెప్పవచ్చు. అంతేకాకుండా ఈ ఎస్-క్రాస్ లో అల్లాయ్ వీల్స్ కూడా ఆకర్షణీయంగా కనబడటం లేదు.

హ్యుందాయ్ వలే, మారుతి సుజుకి తన యొక్క విదానాన్ని అమలుపరచలేకపోతుంది. అంతేకాకుండా, హ్యుందాయ్ వాహనాలను ప్రవేశపెట్టినట్టుగా ఈ మారుతి సుజుకి, తన యొక్క వాహనాలను ప్రేవేశపెట్టలేకపోతుంది. ఇంకో విషయం ఏమిటంటే, ఈ ఎస్-క్రాస్ ను ప్రీమియం క్రాస్ వోవర్ గా పిలుస్తున్నారు అది ఎంతవరకు సమంజసమో చూద్దాం. మరోవైపు, ఈ ఎస్-క్రాస్, క్రూజ్ కంట్రోల్ (ఈ విభాగం లో మొదటిసారిగా చూడవచ్చు), బై-జినాన్ ప్రొజెక్టర్ హెడ్ల్యాంప్స్ (మళ్ళీ మొదటిసారి ఈ సెగ్మెంట్ లో), ఆల్ బ్లాక్ డాష్బోర్డ్ తో పాటు లెధర్ అపోలిస్ట్రీ, 7 అంగుళాల టచ్ స్క్రీన్ తో పాటు నావిగేషన్ వ్యవస్థ, మరియు ప్రామాణిక డ్యుయల్ ఎయిర్బ్యాగ్స్ (దిగువ శ్రేణి వేరియంట్ లో డ్రైవర్ కు మాత్రమే ఎయిర్బాగ్) వంటి వాటిని కలిగి ఉంది. అంతేకాకుండా, నెక్సా అనుభవం తో కంపెనీ హైపింగ్ చేస్తుంది. ఇది నిజంగానే ఒక ప్రీమియం క్రాస్ఓవర్! మరియు మీ సమాచారం కోసం, హ్యుందాయ్ లో క్రెటా అనేది 'పర్ఫెక్ట్ ఎస్యువీ గా చెప్పవచ్చు. మరో విషయం ఏమిటంటే, దీనిని ఒక ఆఫ్ రోడ్ ల పై సున్నితమైన వాహనం అని చెప్పవచ్చు. ఇది ఒక పెర్ఫెక్ట్ ఎస్యువి అయినప్పటికీ, ఒక ఆఫ్ రోడ్ వాహనం మాత్రం కాదు. అయితే, వచ్చే వారం మారుతి సుజుకి, ఎస్-క్రాస్ ను ఆగస్టు 5 న ధరలతో ప్రవేశపెట్టడానికి సిద్దంగా ఉంది. ముఖ్యంగా చెప్పదగ్గ విషయం ఏమిటంటే, ఈ మారుతి సుజుకి క్రాస్ ఓవర్ లో ధరలు ముఖ్య పాత్ర వహిస్తాయి.

ఎస్-క్రాస్ యొక్క నిపుణుడి సమీక్ష ను వీక్షించండి

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your Comment on Maruti ఎస్-క్రాస్ 2017-2020

Read Full News

ట్రెండింగ్‌లో ఉంది ఎస్యూవి కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience