స్వంత బ్యాటరీ సెల్‌ల నిర్మాణం ప్రారంభించిన ఓలా గిగాఫ్యాక్టరీ
జూన్ 23, 2023 05:52 pm ansh ద్వారా ప్రచురించబడింది
- 47 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
కంపెనీ, 5GWh ప్రారంభ సామర్థ్యంతో వచ్చే ఏడాది కార్యకలాపాలను ప్రారంభించబోతోంది
భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీల ఉత్పత్తికి, ఓలా గిగాఫ్యాక్టరీ నిర్మాణాన్ని ప్రారంభించింది, ఇది పూర్తయితే దేశంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీ గిగాఫ్యాక్టరీ అవుతుంది. తమిళనాడులోని కృష్ణగిరిలో 115 ఎకరాల్లో నిర్మాణ ప్రక్రియ ప్రారంభమైంది.
ఇది కూడా చదవండి: ప్రధాని నరేంద్ర మోడీని కలిసిన తర్వాత టెస్లా ఇండియా అరంగేట్రం గురించి ఎలన్ మస్క్ ధృవీకరించారు
ఫ్యాక్టరీ వచ్చే ఏడాదికి 5GWh (బ్యాటరీ సెల్స్‌లో) సామర్థ్యంతో కార్యకలాపాలు ప్రారంభించనుంది. నిర్మాణం పూర్తయిన తర్వాత ఇది 100GWh సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. కంపెనీ గత సంవత్సరం బెంగళూరులో బ్యాటరీ ఇన్నోవేషన్ సెంటర్‌ను ఏర్పాటు చేయడానికి గణనీయమైన పెట్టుబడి పెట్టింది.
ఓలా తమిళనాడులో కార్యకలాపాలను విస్తరించాలని యోచిస్తోంది. బ్యాటరీ సెల్స్, ఎలక్ట్రిక్ బైక్‌లు మరియు ఎలక్ట్రిక్ కార్ల తయారీని విస్తరించేందుకు కంపెనీ రాష్ట్ర ప్రభుత్వంతో MoUపై సంతకం చేసింది. MoU లో ఓలా రాష్ట్రంలో తయారీ సౌకర్యాలు, వెండర్ మరియు సప్లయర్ పార్కులను నిర్మిస్తుంది. 2024లో ఓలా EV ల ఆరు మోడళ్లను ప్రవేశపెట్టాలని యోచిస్తుంది . దీని మొదటి మోడల్ త్వరలో విక్రయానికి వస్తుంది.
ఇది కూడా చూడండి: మహీంద్రా BE.05 యొక్క మొదటి స్పై షాట్‌లు బహిర్గతం అయ్యాయి
బ్యాటరీలు EVలకు అతిపెద్ద ఇన్‌పుట్ ఖర్చులలో ఒకటి. బ్యాటరీల తయారీని స్థానికీకరించడం తో ఖర్చులు తగ్గుతాయి. వాటిని మరింత సరసమైన ధరలో కొనుగోలు చేయవొచ్చు. మీరు ఏమనుకుంటున్నారో మాకు తెలియజేయండి.
0 out of 0 found this helpful