• English
  • Login / Register

అధికారికంగా మారూతీ సుజూకీ ఆగస్ట్ 5న ఎస్-క్రాస్ ని విడుదల చేయనున్నారు

మారుతి ఎస్-క్రాస్ 2017-2020 కోసం akshit ద్వారా జూలై 24, 2015 03:53 pm సవరించబడింది

  • 15 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

డీల్లీ: మారుతీ సుజూకీ వారు ఎంతగానో ఎదురు చూస్తున్న ఎస్-క్రాస్ ని ఆగస్ట్ 5న విడుదల చేయనున్నారు. అవి నిన్న డిల్లీ కార్యక్రమంలో ప్రారంభం చేయబడ్డ ప్రత్యేక నెక్సా డీలర్షిప్ల ద్వారా అమ్మబడుతాయి.

ఎస్-క్రాస్ ద్వారా భారతదేశంలో మొట్టమొదటి సారిగా 1.6-లీటరు ఎంజేడీ డీజిలు ఇంజిను ప్రవేశబడుతోంది. ఇది మారుతీ కార్లలఒ అత్యధికంగా వాడే 1.3-లీటరు ఫియట్ ఇంజిను కుటుంబం నుండి వచ్చినదే అయినా ఈ పెద్ద ఇంజినుకి వేరియేబుల్ జామెట్రీ టర్బో చార్జర్ ఉంది. ఇది 118భ్ప్ శక్తిని మరియూ 320న్మ్ టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది. ఈ 1.3 లీటర్ ఇంజిను దిగువ వేరియంట్స్లలో కూడా 5-స్పీడ్ గేర్ బాక్స్ తో లభ్యమౌతుంది కానీ 1.6 వర్షన్ కి 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఇవ్వబడింది. వీటిలో పెట్రోల్ ఇంజిను కానీ. ఆటోమాటిక్ ట్రాన్స్మిషన్ కానీ, ఆల్ వీల్ డ్రైవ్ కానీ ఇవ్వబడటం లేదు.

ఈ ఎస్-క్రాస్ ని నాలుగు ట్రింలలో అందిస్తున్నారు- సిగ్మా, డెల్టా, జీటా మరియూ ఆల్ఫా. కేవలం దిగువ ట్రిం కి మాత్రమే 1.3-లీటరు డీజిలు ఇంజిను పెట్టబడింది, వేరే మూడు వేరియంట్స్ లలో 1.3-లీటరు మరియూ 1.6-లీటరు ఎంజేడీ రెండు యూనిట్లు పెట్టబడతాయి. ఉన్నత స్థాయి ట్రిం కి ఆటోమాటిక్ క్లైమేట్ కంట్రోల్, నావిగేషన్ మరియూ బ్లూటూథ్ గల 7-ఇంచ్ టచ్స్క్రీన్, క్రూయిజ్ కంట్రోల్, ఆటో డిమ్మింగ్ అద్దం, 16 ఇంచ్ అల్లోయ్ వీల్స్ ఇంకా మరెన్నో లక్షణాలు కలిగి ఉంటుంది.

మారూతీ ఎస్-క్రాస్, రెనాల్ట్ డస్టర్, నిస్సాన్ టెర్రానో, ఫోర్డ్ ఈకోస్పోర్ట్ మరియూ ఈమధ్యే విడుదల్ అయ్యిన హ్యుండై క్రేటా లతో తలపడనుంది.

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your Comment on Maruti ఎస్-క్రాస్ 2017-2020

Read Full News

ట్రెండింగ్‌లో ఉంది ఎస్యూవి కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience