ఇప్పుడు మీరు మీ ఇంటి వద్ద నుండి టాటా హారియర్‌ను టెస్ట్ డ్రైవ్ చేయవచ్చు
టాటా హారియర్ 2019-2023 కోసం dhruv ద్వారా అక్టోబర్ 31, 2019 04:44 pm ప్రచురించబడింది
- 23 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
ఆన్‌లైన్ బుకింగ్ చేసుకున్న తరువాత ఢిల్లీ/ NCR మరియు ముంబైలలోని కొనుగోలుదారులు టాటా ప్రధాన SUV ని తమ ఇంటి దగ్గర పొందవచ్చు
- టాటా మోటార్స్ ఒరిక్స్(ORIX) ఇండియాతో భాగస్వామ్యం కలిగి ఉంది, హారియర్-కొనుగోలుదారులకు షోరూమ్‌ను సందర్శించకుండా SUV ని టెస్ట్ డ్రైవ్ చేసే అవకాశాన్ని అందిస్తుంది.
- వినియోగదారులు టాటా మోటార్స్ వెబ్‌సైట్ లో టెస్ట్ డ్రైవ్‌ను బుక్ చేసుకోవచ్చు, దీని తరువాత కస్టమర్ కేర్ బృందం కాల్ చేసి స్లాట్ ని కన్‌ఫార్మ్ చేస్తుంది.
- ఇచ్చిన తేదీకి, సరైన సమయానికి SUV ని కస్టమర్ కేర్ బృందం ఇంటి వద్దకు తీసుకువస్తారు.
- ఈ సేవ ఢిల్లీ/ NCR మరియు ముంబైలలో మాత్రమే అందుబాటులో ఉంది, అయితే టాటా మోటార్స్ త్వరలో దీనిని మరింత విస్తరించాలని యోచిస్తోంది.
అన్ని వివరాల కోసం క్రింద ఇచ్చిన పత్రికా ప్రకటనను చూడండి.
పత్రికా ప్రకటన
ఢిల్లీ, అక్టోబర్ 22, 2019:
టాటా మోటార్స్ తన ప్రధాన SUV - హారియర్ కోసం దేశంలో ప్రియారిటీ టెస్ట్ డ్రైవ్‌లను విడుదల చేసింది. వినూత్న లీజింగ్ & రవాణా పరిష్కారాలలో గ్లోబల్ లీడర్ అయిన ఒరిక్స్ భాగస్వామ్యంతో రూపొందించిన ఈ చొరవ, తమ వినియోగదారులందరికీ హారియర్‌ను వారి ఇంటి వద్ద పరీక్షించడానికి సౌకర్యాన్ని అందిస్తుంది.
మారుతున్న ప్రొఫైల్ మరియు దాని వినియోగదారుల ప్రాధాన్యతలను దృష్టిలో ఉంచుకుని, టాటా మోటార్స్ కస్టమర్లు తమ టెస్ట్ డ్రైవ్‌ను తమ అనుకూలమైన సమయం మరియు ప్రదేశం ప్రకారం ఆన్‌లైన్‌లో బుక్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తుంది. ఇది ఇండస్ట్రీలో మొట్టమొదటి సర్వీస్, ఇది మొదట్లో ముంబై మరియు ఢిల్లీ NCR కేంద్రంగా ఉన్న వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది మరియు తరువాత ఇతర నగరాలకు విస్తరించబడుతుంది.
మరో కస్టమర్-స్నేహపూర్వక సేవను ప్రారంభించడంపై టాటా మోటార్స్, ప్యాసింజర్ వెహికల్స్ బిజినెస్ యూనిట్, సేల్స్, మార్కెటింగ్ & కస్టమర్ సపోర్ట్ వైస్ ప్రెసిడెంట్ శ్రీ SN బార్మాన్ మాట్లాడుతూ” టాటా హారియర్ మా ప్రధాన ఉత్పత్తి మరియు ఈ సంవత్సరం ప్రారంభంలో ప్రారంభించినప్పటి నుండి వినియోగదారులచే మరియు ఇండస్ట్రీ నుండి కూడా విస్తృతంగా ప్రశంసించబడింది. గత కొద్ది నెలల కాలంలో అధిక ధనవంతులైన వ్యక్తుల నుండి హారియర్ కి ఎక్కువ ఆధరణ మేము చూస్తున్నాము. బిజీ షెడ్యూల్ ఉన్న చాలా మంది కస్టమర్‌లు తమకి కుదిరిన సమయంలో మరియు వారికి సౌకర్యవంతంగా ఉండే టైం లో టెస్ట్ డ్రైవ్‌ల కోసం కోరుకుంటారు. ఈ క్రమంగా డిజిటల్ కస్టమర్‌లతో పొత్తు పెట్టుకోవడానికి, కస్టమర్లు తమ ఇంటి వద్ద నుండి సౌకర్యంగా కొన్ని క్లిక్‌లతో టెస్ట్ డ్రైవ్‌ను షెడ్యూల్ చేయడానికి ఒరిక్స్‌తో భాగస్వామిగా ఉంటున్నందుకు మేము సంతోషిస్తున్నాము. ఇది వినియోగదారులకు తమకు నచ్చిన సమయంలో మరియు ప్రదేశంలో టెస్ట్ డ్రైవ్‌ను ఎంచుకునే స్వేచ్ఛను ఇస్తుంది. ఈ పరిశ్రమ మొదటి ఆన్‌లైన్ టెస్ట్ డ్రైవ్ బుకింగ్ హారియర్ కస్టమర్లకు అద్భుతమైన అనుభవాన్ని అందించడం ద్వారా కొనుగోలు విధానాన్ని సులభతరం చేయడంలో సహాయపడటానికి ఒక చిన్న దశగా పనిచేస్తుందని మేము ఆశిస్తున్నాము. ” అని అన్నారు.
ఈ సందర్భంగా ఓరిక్స్ ఇండియా MD మరియు CEO సందీప్ గంభీర్ మాట్లాడుతూ “ఈ కొత్త చొరవపై టాటా మోటార్స్‌తో కలిసి పనిచేయడానికి మేము చాలా సంతోషిస్తున్నాము. ఈ భాగస్వామ్యం వినియోగదారులకు ఒక మంచి ప్రొడక్ట్ యొక్క అద్భుతమైన అనుభవాన్ని అందించడంలో సహాయపడుతుందని మేము ఆశిస్తున్నాము. టెక్నాలజీ, ఇన్నోవేషన్ మరియు మానవ స్పర్శ యొక్క సంపూర్ణ కలయిక ద్వారా, రెండు ప్రముఖ మరియు గౌరవనీయమైన బ్రాండ్ల యొక్క అసోసియేషన్ ఇంటి వద్ద నుండే సంతృప్తికరమైన కస్టమర్ అనుభవాన్ని అందిస్తుందని మరియు వినియోగదారులకు హారియర్ గురించి బాగా సమాచారం ఇవ్వడానికి మరియు క్రొత్త మార్గాలను సూచించడంలో సహాయపడుతుందని మేము ఆశిస్తున్నాము. అంటే వారికి నచ్చిన ఉత్పత్తిని సొంతం చేసుకోవడం లో బాగా సహాయపడుతుంది. ఇది బహుశా గొప్ప భాగస్వామ్యానికి నాంది, టాటా మోటార్లు మరియు ఒరిక్స్ రెండూ కూడా సమీప భవిష్యత్తులో ఇటువంటి వినూత్న కస్టమర్ సెంట్రిక్ కార్యక్రమాల కోసం పని చేస్తాయి మరియు కస్టమర్‌కు విభిన్న అనుభవాన్ని అందించడంలో సహాయపడతాయి అని అన్నారు.
ప్రక్రియ:
కస్టమర్లు హారియర్ వెబ్‌సైట్‌ను సందర్శించి, వారి వ్యక్తిగత వివరాలతో క్లుప్త లీడ్ ఫారమ్‌ను నింపాలి. దానిలో వారు వివిధ రకాల డేట్స్ ని మరియు టైం వివరాలని కలిగి ఉంటారు, దాని నుండి వారు తమకి కావలసిన డేట్ ని మరియు టైం ని ఎంచుకోవచ్చు. ఆ వివరాలు సబ్‌మిట్ చేసిన తరువాత, కస్టమర్ టెస్ట్ డ్రైవ్ కోసం నిర్ధారణను అందుకుంటారు. టాటా మోటార్స్ కస్టమర్ కేర్ బృందం నుండి వారికి కాల్ బ్యాక్ అందుతుంది, దాని ద్వారా వారు టెస్ట్ డ్రైవ్ షెడ్యూల్ చేస్తారు.
ల్యాండ్ రోవర్ యొక్క లెజెండరీ D8 ప్లాట్‌ఫాం నుండి ఉద్భవించిన OMEGARC ఆర్కిటెక్చర్‌పై హారియర్ నిర్మించబడింది. అలాగే ఇది టాటా మోటార్స్ యొక్క IMPACT 2.0 డిజైన్ లాంగ్వేజ్ ఆధారంగా ఉంది, ఇది అద్భుతమైన డిజైన్ మరియు అద్భుతమైన పనితీరు యొక్క సంపూర్ణ కలయిక అని చెప్పవచ్చు. అత్యాధునిక క్రియోటెక్ 2.0 డీజిల్ ఇంజిన్ మరియు అడ్వాన్స్‌డ్ టెర్రైన్ రెస్పాన్స్ మోడ్‌ల ద్వారా ఆధారితమైన హారియర్, కష్టతరమైన భూభాగాలపై అద్భుతమైన పనితీరును ఇస్తుంది.
డ్రైవ్‌ను ఆన్‌లైన్‌లో షెడ్యూల్ చేయడానికి, వినియోగదారులు దీనికి లాగిన్ అవ్వవచ్చు: http://harrier.tatamotors.com/
మరింత చదవండి: టాటా హారియర్ డీజిల్