• English
  • Login / Register

భారతదేశానికి మెర్సిడెజ్-బెంజ్ ఏఎంజీ వీ12 అందుబాటులో ఉండదు

ఆగష్టు 28, 2015 06:02 pm manish ద్వారా ప్రచురించబడింది

  • 13 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

జైపూర్:

మెర్సిడెజ్-బెంజ్, అందులోనూ ప్రత్యేకంగా ఏఎంజీ మోడలు గత ఏడాది మీద 43% అమ్మకాల ఎదుగుదలను చూసింది. ఈ సంవత్సరానికి ఇంకా ఐదు కార్లు విడుదలకు వరుసలో సిద్దం గా ఉన్నాయి. కానీ వీటిలో ఏ ఒక్కటికీ వీ12 ఇంజిను కలిగి ఉండవు. తాజాగా వచ్చిన ఏఎంజీ ఎస్ 63 సెడాన్ లో 5.5-లీటరు ట్విన్-టర్బో వీ8 ఇంజిను ఉంటుంది. దీనితో కలుపుకుని మెర్సిడెజ్ వారి లగ్జరీ ఏఎంజీ కార్ల జాబితాలో మొత్తం తొమ్మిది ఉన్నాయి.

మెర్సిడేజ్-బెంజ్ భారతదేశానికి ఎండీ మరియూ సీఈఓ అయిన ఎబర్హార్డ్ కర్న్ గారు మాట్లాడుతూ," ఏఎంజీ వీ12 ని తీసుకు వచ్చే ఉద్దేసం మాకు ఇప్పటిలో లేదు. ఎస్ 63 ఏఎంజీ లో అద్భుతమైన వీ8 ఇంజిను అమర్చబడి ఉంది మరియూ ఇది మా అన్ని ఉన్నత శ్రేని కార్లలోనూ సరిగ్గ అమరుతుంది. ఎస్ 63 ఏఎంజీ పై మరియూ ఏఎంజీ సమర్ధతపై ఆధారపడిన ఎమెఫే వేదికపైన ఏ విధంగా భారతదేశానికి సరిపడే విధంగా చేయాలా అనే విషయంపైన దృష్టి కేంద్రీకరించ దలచాము," అని అన్నారు.

ప్రపంచవ్యాప్తంగా, మెర్సిడెజ్ వారు జీ 65, ఎసెల్ 65, ఎస్ 65 సెడాన్ మరియూ ఎస్ 65 కూపే లో 630బీహెచ్పీ 6.0-లీటరు వీ12 బై-టర్బో ఇంజినుని అమర్చారు. ఈ వీ12 ఏఎంజీ మోడలుకి ఖరీదైఅన్ మరియూ సంక్లిష్ట సర్వీసు అవసరం మరియూ అదనపు ఆఫ్టర్ సేల్ సర్వీసు కూడా అవసరం. భారతీయ రోడ్ల కారణంగా ఇంకా వారి గోలియత్ ఇంజిన్లు భారతదశానికి ఇంకా వచ్చే పరిస్తితి లేదు అని మెర్సిడేజ్ వారు అభిప్రాయపడ్డారు.

లగ్జరీ కార్ల డిమాండ్ వలన బీఎండబ్ల్యూ మరియూ ఆడీ కూడా మెర్సిడే అడుగుజాడలలఓనే నడుస్తున్నాయి. ఆడీ వారు కొత్తగా 10 మోడల్స్ విడుదల చేయటానికి సిద్దంగా ఉన్నారు కాకపోతే బీఎండబ్ల్యూ వారి సంఖ్య ఈ సంవత్సరం చివరికి 15 మోడల్స్ గా ఉంది.

వీ12 ని భారతదేశానికి తీసుకురాలేనందున మెర్సిడెజ్ వారు ఏఎంజీ సీ 63 ఎస్ ని సెప్టెంబర్ 3న భారతదేశంలో విడుదల చేయనున్నారు. ఒక సంవత్సరం తరువాత ఏఎంజీ జీటీ స్పోర్ట్స్ ని కూడా విడుదల చేస్తారు.

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your వ్యాఖ్య

Read Full News

ట్రెండింగ్‌లో ఉంది కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience