BS6 ఫేజ్ 2కు అనుగుణమైన ఫ్లెక్స్-ఫ్యూయల్ Toyota Innova Hycross Strong-Hybrid ప్రోటోటైప్ؚను ఆవిష్కరించిన నితిన్ గడ్కారీ
ఈ ప్రోటోటైప్ 85 శాతం వరకు ఎథనాల్ మిశ్రమంపై పని చేస్తుంది మరియు కొన్ని పరీక్ష పరిస్థితులలో, హైబ్రిడ్ సిస్టమ్ కారణంగా, మొత్తం అవుట్ؚపుట్ؚలో 60 శాతాన్ని EV పవర్ నిర్వహిస్తుంది.
-
ఈ ప్రోటోటైప్ 186PS 2-లీటర్ బలమైన-హైబ్రిడ్ పెట్రోల్ ఇంజన్ؚతో వస్తుంది.
-
20 శాతం ఎథనాల్ మిశ్రమం, పెట్రోల్ కంటే 14 శాతం తక్కువ PM2.5 ఉద్గారాలను ఉత్పత్తి చేస్తుంది.
-
ఎథనాల్ ధర పెట్రోల్ కంటే చవకైనది ఎందుకంటే ఇది ఎక్కువగా చెరకు నుండి తయారవుతుంది.
-
భారతదేశ రహదారుల కోసం దీన్ని సిద్ధం చేయడానికి ఈ ప్రోటోటైప్‌పై మరిన్ని పరీక్షలు నిర్వహించవలసిన అవసరం ఉంది.
శ్రీ. నితిన్ గడ్కారీ, కేంద్ర రోడ్డు రవాణా మరియు హైవేల మంత్రి, ఫ్లెక్స్-ఫ్యూయల్ టయోటా ఇన్నోవా హైక్రాస్ హైబ్రిడ్ ప్రోటోటైప్ؚను ఆవిష్కరించారు, ఇది 85 శాతం వరకు ఎథనాల్ మిశ్రమ ఇంధనంపై పని చేస్తుంది. ఈ ప్రోటోటైప్, నవీకరించిన BS6 ఫేజ్-2 నిబంధనలకు అనుగుణంగా ఉంటుంది మరియు ఫ్లెక్స్-ఫ్యూయల్ ఇన్నోవా హైక్రాస్ గురించి మీరు తెలుసుకోవలసిన విషయాలు క్రింద పేర్కొనబడ్డాయి.
స్వచ్చమైన పవర్ؚట్రెయిన్
ఫ్లెక్స్-ఫ్యూయల్ హైక్రాస్ 186PS 2-లీటర్ బలమైన-హైబ్రిడ్ పెట్రోల్ ఇంజన్ؚను ఉపయోగిస్తుంది, ఈ సంధర్భంలో, ఇది 85 శాతం వరకు (E85) ఎథనాల్ మిశ్రమంపై పని చేస్తుంది, మిగిలిన 15 శాతం పెట్రోల్ పై పని చేస్తుంది, తద్వారా ఇది స్వచ్చమైన ICE పవర్‌ట్రెయిన్ؚతో పోలిస్తే మరింత సమర్ధమైనదిగా మరియు పర్యావరణ హితమైనదిగా నిలుస్తుంది.
ప్రయోజనాలు
పెట్రోల్ లేదా డీజిల్ కంటే ఎథనాల్ స్వచ్చమైన ఇంధనం కాబట్టి, దీని వినియోగం వలన తక్కువ ఉద్గారాలు విడుదల అవుతాయి మరియు పర్యావరణానికి తక్కువ హాని కలుగుతుంది.
ఇది కూడా చదవండి: రూ.10.29 లక్షల ధరతో విడుదలమైన టయోటా రూమియాన్ MPV
టయోటా ప్రకారం, E20 ఇంధనాలు (20 శాతం ఎథనాల్ మిశ్రమం) సాధారణ పెట్రోల్‌తో పోలిస్తే 14 శాతం వరకు తక్కువ PM2.5 ఉద్గారాలను విడుదల చేస్తుంది. అంతేకాకుండా, చాలా రాష్ట్రాలలో ఇథనాల్ ధర, పెట్రోల్ ధరతో పోలిస్తే తక్కువగా ఉంటుంది అందువలన వినియోగదారులు మరింతగా పొదుపు చేయగలరు. ఎథనాల్ ఎక్కువగా చెరకు నుండి తయారు చేయబడుతుంది, కావునా దిని తయారీ కూడా సులభమే.
ఇది కూడా చదవండి: మారుతి బాలెనో టయోటా గ్లాంజా వరుస డ్రైవింగ్: మేము తెలుసుకున్న 5 విషయాలు
చివరిగా, రవాణా రంగంలో హరిత భవిష్యత్తు వైపు నడుస్తున్నాము, ఇది ఎక్కువగా ఎలక్ట్రిక్ వాహనాలపై దృష్టి సారిస్తుంది. అయితే, పెట్రోల్/డీజిల్ నుండి ఎలక్ట్రిక్ వాహనాలకు మారడం అంత సులభం కాదు, ఈ మార్పును సాఫీగా, సులభంగా జరిగేలా చేసే, పరిపూర్ణమైన మాధ్యమం – హైబ్రిడ్ వాహనాలతో పాటు – ఫ్లెక్స్-ఫ్యూయల్.
ఈ ఫ్లెక్స్-ఫ్యూయల్ ఇన్నోవా హైక్రాస్ ప్రస్తుతానికి ప్రోటోటైప్ మాత్రమే మరియు ప్రొడక్షన్‌కు సిద్దం అవ్వడానికి మరింత సమయం పట్టవచ్చు. దీన్ని భారతీయ రహదారుల కోసం సిద్ధం చేయడానికి మరెన్నో పరీక్షలను నిర్వహించవలసిన అవసరం ఉంది, కానీ ఇది ఆశాజనకంగా కనిపిస్తుంది. ఈ ప్రోటోటైప్ గురించి మీరు ఏం అనుకుంటున్నారో క్రింద కామెంట్ؚలలో మాకు తెలియజేయండి.
ఇక్కడ మరింత చదవండి: ఇన్నోవా హైక్రాస్ ఆటోమ్యాటిక్