ఐఎం ఎస్ 2015 వద్ద ప్రారంభించబడిన నిస్సాన్ ఎక్స్-ట్రైల్

ప్రచురించబడుట పైన Aug 20, 2015 05:34 PM ద్వారా Manish for నిస్సాన్ ఎక్స్

  • 2 సమీక్షలు
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

జైపూర్: నిస్సాన్ దాని మూడవ తరం నిస్సాన్ ఎక్స్-ట్రెయిల్ ని కొనసాగుతున్న ఇండోనేషియా అంతర్జాతీయ మోటార్ షో 2015 (ఐఐఎం ఎస్2015) అనగా, గైకిండో ఇండోనేషియా అంతర్జాతీయ ఆటో షో (జి ఐఎ ఎస్) వద్ద ప్రదర్శించింది. ఇటీవల ఒక నివేదిక ప్రకారం, ఈ కారు పండుగ సీజన్లో భారతదేశం లో ప్రారంభించబడుతుంది. ద్వీపసమూహంలో గత ఏడాది విడుదల చేయబడిన ఎస్యువి చికాపెక్, పశ్చిమ జావా లో అసెంబెల్ అయ్యింది. ఈ కారు సన్నని హెడ్ల్యాంప్స్, 'వి-మోషన్ గ్రిల్ ', సి-ఆకారపు టెయిల్ ల్యాంప్స్ మరియు డి-పిల్లర్ కింక్ లక్షణాలను కలిగి ఉంది. ఈ ఇండోనేషియా మోడల్ ఎం ఆర్20డిడి 2.0-లీటర్ డైరక్ట్ ఇంజెక్షన్ నాలుగు సిలిండర్ల ఇంజన్, ఇది 140ps శక్తిని మరియు 200Nm టార్క్ ని అందిస్తుంది లేదా క్యూఅర్25డి ఇ 2.5-లీటర్ ఎంపి ఐ నాలుగు సిలిండర్ల ఇంజన్ 171psశక్తిని మరియు 223Nm టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది. ఈ రెండు ఇంజిన్లలో ఏదో ఒక ఇంజిన్ ని మాత్రమే అందిస్తుంది. క్యూఅర్25డి ఇ ఇంజిన్ ఎక్స్టానిక్ సివిటి మరియు ఎం ఆర్20డిడి ఇంజిన్ 6- స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ లేదా ఎక్స్టానిక్ సివిటి తో జత చేయబడి ఉంటుంది. భారతదేశంలో ఈ కారు బహుశా నిస్సాన్ 2.0 డిసి ఐ ఇంజిన్ తో సివిటి గేర్బాక్స్ సిస్టమ్ తో జత చేయబడి ఉండవచ్చు. ఎడబ్లు డి వేరియంట్ ఇండోనేషియన్ మార్కెట్ లో అందుబాటులో లేదు మరియు మార్కెట్ ఫ్రంట్ వీల్ డ్రైవ్ వేరియంట్ ని మాత్రమే పొంది ఉంది. 

ఎక్స్ -ట్రెయిల్ ఆటో హెడ్లైట్లు మరియు యాక్టివ్ రైడ్ కంట్రోల్ మరియు ఎల్ ఇడి డే టైం రన్నింగ్ ల్యాంప్స్ వంటి లక్షణాలను కలిగి ఉన్నాయి. అగ్రశ్రేణి మోడల్స్ హీటెడ్ డోర్ మిర్రర్స్, పూర్తి ఎల్ ఇడి హెడ్లైట్స్, కీలెస్ ఎంట్రీ, పుష్-బటన్ స్టార్ట్, ఆటోమేటిక్ వైపర్స్, డ్యుయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, విద్యుత్ ద్వారా శక్తిని అందించే ముందు సీట్లు, క్రూయిజ్ కంట్రోల్, 18 అంగుళాల వీల్స్, లెథర్ సీట్లు మరియు వ్యూ మిర్రర్స్ వంటి లక్షణాలను కలిగి ఉంది. 

ఈ కారు అనేక భద్రతా లక్షణాలతో కూడా అందుబాటులో ఉంది. వాటిలో వెహికిల్ డైనమిక్ కంట్రోల్ (విడిసి), యాక్టివ్ ఇంజిన్ బ్రేకింగ్, ఫ్రంట్ డ్యూయల్ ఎయిర్బ్యాగ్స్, హిల్ స్టార్ట్ అసిస్ట్, ఇబిడి తో పాటూ ఎబిఎస్, బ్రేక్ అసిస్ట్ మరియు ఐఎస్ ఓ ఫ్ ఐఎస్ పిల్లల సీటు యాంకర్స్ వంటివి ఉన్నాయి. కారు కోసం రంగు స్కీమ్ ఫ్లోరల్ వైట్, ప్రీమియం బ్రోంజ్ మెటాలిక్, స్మోకీ గ్రే మెటాలిక్, డైమండ్ సిల్వర్ మెటాలిక్ మరియు ఫాంటమ్ బ్లాక్ షేడ్స్ ఉన్నాయి. 

ద్వారా ప్రచురించబడినది

Write your Comment పైన నిస్సాన్ ఎక్స్

Read Full News
  • ట్రెండింగ్
  • ఇటీవల
×
మీ నగరం ఏది?