ఎక్స్ -ట్రైల్ ఎస్యువి వాహనాన్ని 2016 ఆటో ఎక్స్పోలో ప్రారంబించనున్న నిస్సాన్
జైపూర్:
నిస్సాన్ ఎక్స్-ట్రైల్ అనునది జపనీస్ వాహనతయారీదారుడి ద్వారా విడుదల అవుతున్న ప్రీమియం ఎస్యువి లలో ఇది ఒకటి. దీనిని ఈ ఏడాది నవంబర్ లో ప్రయోగించేందుకు షెడ్యూల్ ప్రకటించారు కానీ, కొన్ని అంతర్గత కారణాలు కారణంగా ఈ కారును ఇప్పుడు 2016 ఆటో ఎక్స్పోలో విడుదల చేయడానికి సిద్దపడ్డారు. ఈ ఎస్యువి భారతదేశంలో, 2004 నుండి 2014 వరకు అమ్ముడుపోయింది. వినియోగదారుల మధ్య ప్రాచుర్యం పొందడంలో విఫలం అయ్యిన కారణంగా ఈ వాహనాన్ని నిలిపివేయడం జరిగింది.
నిస్సాన్, ఇండోనేషియా అంతర్జాతీయ మోటార్ షో 2015 (ఐ ఐ ఎం ఎస్ 2015) వద్ద నిస్సాన్ ఎక్స్-ట్రైల్ యొక్క మూడవ తరం వాహనాన్ని ప్రదర్శించింది. ఈ ఇండోనేషియా వెర్షన్, 2.0 లీటర్ డైరెక్ట్ ఇంజక్టడ్ నాలుగు సిలండర్ ఇంజన్ తో జత చేయబడి ఉంటుంది. అంతేకాకుండా ఈ ఇంజన్ అత్యధికంగా, 144 పి ఎస్ పవర్ ను అదే విధంగా 200 ఎన్ ఎం గల అధిక టార్క్ ను విడుదల చేసే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. మరోవైపు 2.5 లీటర్ ఎం పి ఐ నాలుగు సిలండర్ ఇంజన్ విషయానికి వస్తే, అత్యధికంగా 171 పి ఎస్ పవర్ ను అదే విధంగా 233 ఎన్ ఎం గల అధిక టార్క్ ను విడుదల చేసే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. ఈ 2.5 లీటర్ ఇంజన్, ఎస్ ట్రోనిక్ సివిటి ట్రాన్స్మిషన్ గేర్ బాక్స్ తో జత చేయబడి ఉంటుంది మరియు 2.0 లీటర్ ఇంజన్ విషయానికి వస్తే, 6- స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ లేదా ఎక్స్ ట్రోనిక్ సివిటి ట్రాన్స్మిషన్ గేర్ బాక్స్ తో జత చేయబడి ఉంటుంది. భారతదేశంలో ఈ వాహనం, నిస్సన్ 2.0 లీటర్ డిసి ఐ ఇంజన్ తో వచ్చే అవకాశాలు ఉన్నాయి మరియు ఈ ఇంజన్, సివిటి గేర్ బాక్స్ తో జత చేయబడి ఉంటుంది.
ఈ వాహనం యొక్క లక్షణాల గురించి చెప్పడానికి వస్తే, సొగసైన హెడ్ ల్యాంప్లు, వి మోషన్ గ్రిల్, సి ఆకారపు టైల్ ల్యాంప్లు మరియు డి పిల్లార్ లింక్ వంటివి అందించబడతాయి. వీటన్నింటితో పాటు ఈ వాహనానికి, ఆటో హెడ్ లైట్లు, యాక్టివ్ రైడ్ కంట్రోల్ మరియు ఎల్ ఈ డి డే టైం రన్నింగ్ లైట్లు వంటి లక్షణాలు కూడా అందించబడ్డాయి. అదే ఈ వాహనం యొక్క అగ్ర శ్రేణి వేరియంట్ విషయానికి వస్తే, హీటెడ్ డోర్ మ్యాట్లు, పూర్తి ఎల్ ఈ డి లైట్లు, కీ లేని ప్రవేశం, పుష్ బటన్ ప్రారంభం, ఆటోమేటిక్ వైపర్లు, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, విధ్యుత్తు తో సర్ధుబాటయ్యే ముందు సీట్లు, క్రూజ్ కంట్రోల్, 18 అంగుళాల చక్రాలు, లెధర్ సీట్లు మరియు అరౌండ్ వ్యూ మొనిటర్ వంటి అంశాలు అందించబడతాయి. ఈ కారు, చేవ్రొలెట్ ట్రయల్బ్లేజర్ వాహనానికి పోటీగా పోటీతత్వ ధరతో వస్తుంది. ప్రీమియం ఎస్యువి అనేది భారతదేశంలో, అత్యంత వేగంగా పెరుగుతున్న విభాగం అని చెప్పవచ్చు.
ఇంకా చదవండి
4 వ "నిస్సాన్ తో హ్యాపీ" అనే సేవ క్యాంప్ నిర్వహిస్తున్న నిస్సాన్ సంస్థ