ఇంజిన్ మరియు ఎయిర్ బ్యాగ్ సమస్యల ఉపసంహరణ కోసం భారతదేశం లో 12,000 కార్లను వెనక్కి పిలిచిపించిన నిస్సాన్
జూన్ 30, 2015 01:09 pm arun ద్వారా ప్రచురించబడింది
- 21 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
ముంబై: నిస్సాన్, ప్రపంచ పునశ్చరణలో భాగంగా భారతదేశం లో నిస్సాన్ మైక్రా హ్యాచ్బ్యాక్, నిస్సాన్ సన్నీ సెడాన్, అలాగే నిస్సాన్ యొక్క హై ఎండ్ ప్రతిపాదనలైన టియానా మరియు ఎక్స్-ట్రైల్ తో సహా 12,000 వాహనాలను వెనక్కి పిలిపించింది.
జూన్ 2013 నుండి మార్చి 2015 మధ్య తయారు చేసిన ప్రభావిత వాహనాలను వెనక్కి పిలిచాయి. ఈ వాహనాలు కూడా ఇంజిన్ స్విచ్ అలాగే ఎయిర్బాగ్స్ సమస్యలతో ఉన్న వాహనాలను మాత్రమే ఉపసంహరణ కోసం పిలిచారు.
వీటి ఇంజిన్ స్విచ్ లను, వినియోగదారులకు నిస్సాన్ రిటైల్ వ్యాపారులు ఎలాంటి ఖర్చు లేకుండా బాగు చేసి అందించనున్నారు. అతికొద్ది భాగమైన సంభావ్య ఎయిర్బ్యాగ్ లోపంతో ఉన్న 12000 వాహనాలను మాత్రమే వారు వెనక్కి తీసుకుని మరమ్మత్తు చేయిస్తున్నారు. ఈ ఎయిర్బ్యాగ్స్ టకాటా సంస్థ వారిచే తయారయ్యాయి, ఇది గత కొన్ని నెలలుగా వివాదాల మధ్యలో ఉన్న సంస్థ అని తెలిసింది.
"నిస్సాన్ తమ వినియోగదారుల కోసం ఉన్నత స్థాయి లో భద్రత, సేవ మరియు సంతృప్తి ని ఇవ్వడానికి ఎల్లవేళలా కట్టుబడి ఉంది, మరియు వెంటనే ఈ సమస్యను తీర్చడానికి దాని డీలర్స్ తో సంప్రందించాము" అని నిస్సాన్ ప్రతినిధి తెలిపారు.